అయ్యా ! సాధారణముగాచెరువులలోనూ దొరువులలోనూ కలువలూ , కమలాలూ కొల్లలుగా నుండును ! యిలా ఒకే ఒక్క చంద్రకాంత ముండుట చాలా అరుదు ! అది ఒంటరితనానికి ప్రతీక ! దీన్ని కృష్ణశాస్త్రిగారు ఎంత లోతుగా(depth) విశ్లేషించారంటే యిక యెవరికైనా అది అసాధ్యం ! గమనించండి !
నా కుగాదులు లేవు నా కుషస్సులు లేవు నేను హేమంత కృ ష్ణానంత శర్వరిని !
నాకు కాల మ్మొక్క టే కారు రూపు , నా శోకమ్ము వలెనె , నా బ్రతుకు వలె, నా వలెనె ! _______________________________ (" దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారి ప్రవాసము నుండి ")
నన్నుగని యేరు జాలి జెం - దంగ వలదు ఎవ్వరని యెంతురో నన్ను? - ఏ ననంత శోక భీకర తిమిర లో - కైక పతిని ! కంటక కిరీటి ధారినై, - కాళ రాత్రి మధ్య వేళల , జీమూత - మందిరంపు కొలువు కూటాల నేకాంత - గోష్ఠి దీర్చి దారుణ దివాంధ రోదన - ధ్వనుల శ్రుతుల పొంగి యుప్పొంగి యుప్పొంగి - పొరలి పోవు నా విలాప నిబిడ గీతి - కావళీ , వి రావముల , నర్థరాత్ర గ - ర్భమ్ము, మరియు మరియు భీషణ కాళిమో - న్మత్త గాగ చేయుతరి , నన్ను మీరు వీ - క్షింప లేదొ?
నన్నుగని యేరు జాలి చెం - దంగ వలదు
నాకు నిశ్శ్వాస తాళ వృం - తాలు కలవు నాకు కన్నీటి సరుల దొం - తరలు కలవు నా కమూల్య యపూర్వ మా - నంద మొసగు నిరుపమ నితాంత దుఃఖంపు - నిధులు కలవు ఎవ్వరని యెంతురో నన్ను??? _______________________________ (" దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారి కృష్ణపక్షము నుండి ")
అయ్యా ! చివరి మాట ! ఈ లోకంలోకి ఎవరైనా ఒంటరిగా రావలసిందే ! ఒంటరిగా వెళ్ళ వలసిందే ! ఎవరికి ఎవరూ తోడు రారు ! __________________________________ మాయా మేయ జగంబె, నిత్య మని సం - భావించి , మోహంబు నన్ నా యిల్లా లని , నా కుమారు డని , ప్రా - ణంబుండు నందాక ,ఎం తో ,యల్లాడిన ,ఈ శరీర మిపుడిం- దున్ ,కట్టె లన్ , గాలు చో ఆ యిల్లాలును రాదు ! పుత్రుడును తో - డై రాడు !! తప్పింప గన్ !!! __________________________________ అని బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు చెప్పిన దాని నే ఆత్రేయ గారు
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ! ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం ! వింత నాటకం !
వసంత మహోదయా ధన్యవాదాలు. చాలాకాలం తర్వాత మళ్ళా ఈమధ్యన మీ కవితా వైభవాన్ని ఆనందిస్తున్నాం. ఈ రోజు దేవులపల్లి వారి అపురూపమైన సాహిత్యంలో ఓలలాడించారు. సంతోషం.
మోము వాడెను చూడుమా మోహనాంగి
రిప్లయితొలగించండివేయి రేకుల కనులతో వేచి చూచి
కమల బాంధవు డేతెంచె కమల నీకు
ఆకు పళ్ళెమ్ము నింపెనా వెల్గు చూడు.
నిండు జాబిల్లి వెన్నెలల్ నిండె జగతి
రిప్లయితొలగించండికలువ కన్నియ మోములో గాంతులలరె
ప్రేమ జంటల హృదయాలు వెల్లి విరిసె
భావ వాహినులుప్పొంగి పరువులెత్తె
కమల బాంధవుడు దయించె కనుల విందు
రిప్లయితొలగించండివెండి వెన్నెల కురియుచు దండి గాను
విరహ వేదన తొలగెను వేడ్క మీర
తెల్ల కలువల సౌరులు వెల్లి విరిసె
నింగి లోనున్న ప్రియునికై నీల్గుటేల,
రిప్లయితొలగించండివలదటంచును బోధించవలదు; నీటి
యందు నీడలోనైనను హాయి గొలుపు
కౌగిళుల భాగ్యము దొఱుకగలదు మాకు.
విరిసిన పూవుల కొలనిది
మురిసెను నామది గనంగ మోదము నిండెన్,
ధరణిని సౌందర్యముకా
కరువు? కనెడు వారలకును కన్నుల విందౌ.
అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు కరువు అని వాడేరు. కఱవు అనేదే సాధువు. స్వస్తి.
అయ్యా
రిప్లయితొలగించండిసరియైన పదము తెలిపినారు. ధన్యవాదాలండి.
గుండు మధుసూదన్ గారి పద్యములు...
రిప్లయితొలగించండిఆ.వె.
భానుఁ డుదయ మందె! భామినీ శ్వేత ప
ద్మమ్ము వికసనమునఁ దగ హసించె!
రమ్యమైన యట్టి రంగస్థలమ్మదె;
భాను భామినులకుఁ బ్రణయ కేళి!(1)
తే.గీ.
పత్ర రచిత వలయ శుభ ప్రాంగణమున
సూత్రధారుండు సూర్యుండు సుప్రభాత
గీతములు పాడ నేతెంచె కేళి కొఱకు!
రమణి ముఖపద్మము విరిసె రమణుఁ జూచి!!(2)
కం.
రమణి యఁట పుండరీకము;
సుమనోహర సూత్రధారి సూర్యుం డటకున్
రమణీయముగా ప్రణిధా
నము సేయఁగ బిడియమందె నళినమ్మపుడున్!(3)
తే.గీ.
రమణుఁ డంతట నునుముద్దు రమణి కిడఁగ,
ముఖము విప్పారె; సొబగులు మురిపెము లిడె!
ప్రకృతి కాంతాస్య మోహన రాగ యతికిఁ
జూపఱ సరసిక హృదయ సుమము విరిసె!!(4)
కం.
రమణీయ దృశ్యకావ్యము
కమనీయముగానుఁ దోచుఁ గవి మిత్రులకున్!
సమయమ్మిదె వర్ణనముకు
సుమనోహర ధవళవర్ణ సుమ సరసి కడన్!!(5)
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
తేటివలపు :
_______________________________
అలరు పడంతు లెల్లరు హి - మాంబువులన్ , నవ మల్లికా సతిన్
జలకము లార్చినారు , వన - జాత పరాగ మలంది నారు , మేల్
జిలుగు హొరంగు పొందళుకు - చీరల గట్టిరి పెండ్లికంచు; కో
మల జలజాత పత్రముల - మాటున నేటికి దాగినాడవో ?
_______________________________
(" దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారి కృష్ణపక్షము నుండి ")
-మల్లికాసతిన్- బదులు -చంద్రకాంతమున్- అంటే సరిపోతుంది
పై చిత్రానికి !
ఒంటరి :
రిప్లయితొలగించండి01)
_______________________________
వస్తి నొంటరిగా నిట - వలువ లేక !
చేస్తి నేకాకి సమరము - జీవితమున !
అస్థి సంచయమే గద - యాస్తి నేడు !
మిత్తి వచ్చిన నదికూడ - మిగుల దపుడు !
_______________________________
తోలుతిత్తి యిది - తూటులు తొమ్మిది - తుస్సు మనుట ఖాయం
ఓ జీవా - తుస్సు మనుట ఖాయం !
("పాండురంగ మహత్మ్యం "నుండి ! గుర్తులేవు గాని
చరణాలు యింకా అద్భుతముగా నుండును)
అయ్యా ! సాధారణముగాచెరువులలోనూ దొరువులలోనూ
రిప్లయితొలగించండికలువలూ , కమలాలూ కొల్లలుగా నుండును !
యిలా ఒకే ఒక్క చంద్రకాంత ముండుట చాలా అరుదు !
అది ఒంటరితనానికి ప్రతీక !
దీన్ని కృష్ణశాస్త్రిగారు ఎంత లోతుగా(depth) విశ్లేషించారంటే
యిక యెవరికైనా అది అసాధ్యం ! గమనించండి !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినా జీవితము :
రిప్లయితొలగించండి_______________________________
వింతగా దోచు నాదు జీ - వితము నాకె !
జిలుగు వెన్నెలతో చిమ్మ - చీకటులతొ !
అమల మోహన సంగీత - మందు, హృదయ
దళన దారుణ రోదన - ధ్వనులు విందు !
వక్రగతి బోదు చక్కని - పథము నందె !
రాజ పథమునకై కుమా- ర్గమున జూతు !
గరళమే తిందు కడుపార - నెరిగి యెరిగి !
అవల ద్రోతు చేతులార - నమృత రసము !
విస మమృత మట్టు లమృతంబు - విసము రీతి
చిత్ర చిత్ర గతుల మార్చు - జీవితంబు !
_______________________________
(" దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారి కృష్ణపక్షము నుండి ")
చుక్కలు :
రిప్లయితొలగించండి_______________________________
మింట నెచటనొ మెరయు చుక్కల
కంట చూచితి కాంక్ష లూరగ !
కాంక్ష లూరిన కొలది చుక్కలె
కాంచి బ్రదుకే గడపితిన్ !
చేతి కందెడు పూల కొరకై
చేయి చాపక చేరి కోరక
దూరముగ లేవంచు వానిని
దూరి వదలితిని !
మింట చుక్క లదృశ్య మాయెను !
చేతి కందెడు పూలు వాడెను !
సార హీనపు జీవితమునకు
కోరికల్ మిగిలెన్ !
పక్షివలె నాకాశ నిర్మల
పథ విహార స్వేచ్ఛ గోరితి !
పక్షములు లే వం చెరుంగక
ప్రాకులాడుచు పొగిలితిన్ !
ముగిసి చనె నూరేళ్ళ బ్రదుకిటు !
మూడు నాళ్ళకె ముక్క లాయెను !
మ్రోడు మాకై పూయకుండగ
వాడి తూలిన తీవయై !
తళుకు బంగరు తారలేలా ?
తలకు మీరిన తలపు లేలా ?
వలచి పొందగ గగన సుమములు
కలయె జీవితము ?
_______________________________
(" దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారి కృష్ణపక్షము నుండి ")
దుఃఖము :
రిప్లయితొలగించండి_______________________________
దినము దినమెల్ల నైదాఘ - తీక్ష్ణ భాను
భీకర కరాన లచ్చట - వేగి వేగి
శీతల నిశా ప్రశాంత , శ - య్యా తలాన
నిట్టె కనుమోడ్చె గాదె , నా - హృదయ సుమము !
అలసటం దూలి , నిర్జీవ - మటుల సోలి
జాలి గొల్పును గాదె ? నీ - వేల స్వప్న
మటుల లోలోన కలచి , చీ - కటి ముసుంగు
నొత్తిగిల ద్రోసి , వదలని - పొత్తు గోరి
తొంగి తొంగి చూచెద వయ్యొ - దుఃఖమా ! యొ
కించు కైనను జాలి వ - హించ వేమి?
సగము వాడిన మృదుల పు - ష్పమ్ము సుమ్ము
నిదుర పోనిమ్ము లేకున్న - నేల వాలు !
_______________________________
(" దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారి కృష్ణపక్షము నుండి ")
నా కుగాదులు :
రిప్లయితొలగించండి_______________________________
నా కుగాదులు లేవు
నా కుషస్సులు లేవు
నేను హేమంత కృ
ష్ణానంత శర్వరిని !
నాకు కాల మ్మొక్క
టే కారు రూపు , నా
శోకమ్ము వలెనె , నా
బ్రతుకు వలె,
నా వలెనె !
_______________________________
(" దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారి ప్రవాసము నుండి ")
నన్నుగని:
రిప్లయితొలగించండి_______________________________
నన్నుగని యేరు జాలి జెం - దంగ వలదు
ఎవ్వరని యెంతురో నన్ను? - ఏ ననంత
శోక భీకర తిమిర లో - కైక పతిని !
కంటక కిరీటి ధారినై, - కాళ రాత్రి
మధ్య వేళల , జీమూత - మందిరంపు
కొలువు కూటాల నేకాంత - గోష్ఠి దీర్చి
దారుణ దివాంధ రోదన - ధ్వనుల శ్రుతుల
పొంగి యుప్పొంగి యుప్పొంగి - పొరలి పోవు
నా విలాప నిబిడ గీతి - కావళీ , వి
రావముల , నర్థరాత్ర గ - ర్భమ్ము, మరియు
మరియు భీషణ కాళిమో - న్మత్త గాగ
చేయుతరి , నన్ను మీరు వీ - క్షింప లేదొ?
నన్నుగని యేరు జాలి చెం - దంగ వలదు
నాకు నిశ్శ్వాస తాళ వృం - తాలు కలవు
నాకు కన్నీటి సరుల దొం - తరలు కలవు
నా కమూల్య యపూర్వ మా - నంద మొసగు
నిరుపమ నితాంత దుఃఖంపు - నిధులు కలవు
ఎవ్వరని యెంతురో నన్ను???
_______________________________
(" దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారి కృష్ణపక్షము నుండి ")
తెల్లని కలువల యందము
రిప్లయితొలగించండిమల్లెల సౌరభము జగతి మదినే దోచన్ !
యుల్లము ఝల్లని పించెడి
కల్లలు గావనగ ప్రకృతి కన్నియ సొగసుల్ !
మీరు మనసారగా :
రిప్లయితొలగించండి_______________________________
మీరు మనసారగా నేడ్వ - నీరు నన్ను !
నన్ను విడువుడు ! ఒకసారి - నన్ను విడిచి
నంత , నేకాంత యవనికా - భ్యంతరమున
వెక్కి వెక్కి రోదింతును , - విసువు లేక,
విరతి లేక , దుర్భర శోక - విషమ గీతు
లేడ్చి వైతు ! ఎలుంగెత్తి - యేడ్చివైతు !
ఈ మహానంద వీచికా - స్తోమ డోలి
కాగ్రముల నింక , నే , నాట్య- మాడ లేను !
నేను చిరునవ్వు పెదవుల - నిలుప లేను !
ఏ విరామ మేని లేని- యీ శుభోత్స
వ ప్రణయ కేళికామోద - భార మింక
నేను వహియింప లేను ! జీ - వింప లేను !
_______________________________
(" దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారి కృష్ణపక్షము నుండి ")
కలువ కన్నియ యొంటరై కొలనుఁజలక
రిప్లయితొలగించండిమాడ, పున్నమి రేతిరి సడియె లేని
జాము లోన గ్రహాంతర సాస రందు
సొగసుఁగాంచగఁదిగిరేమొ సురలు ధరను!
అయ్యా ! చివరి మాట !
రిప్లయితొలగించండిఈ లోకంలోకి ఎవరైనా
ఒంటరిగా రావలసిందే !
ఒంటరిగా వెళ్ళ వలసిందే !
ఎవరికి ఎవరూ తోడు రారు !
__________________________________
మాయా మేయ జగంబె, నిత్య మని సం - భావించి , మోహంబు నన్
నా యిల్లా లని , నా కుమారు డని , ప్రా - ణంబుండు నందాక ,ఎం
తో ,యల్లాడిన ,ఈ శరీర మిపుడిం- దున్ ,కట్టె లన్ , గాలు చో
ఆ యిల్లాలును రాదు ! పుత్రుడును తో - డై రాడు !! తప్పింప గన్ !!!
__________________________________
అని
బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు
చెప్పిన దాని నే
ఆత్రేయ గారు
అనుబంధం ఆత్మీయత
అంతా ఒక బూటకం !
ఆత్మ తృప్తికై మనుషులు
ఆడుకొనే నాటకం !
వింత నాటకం !
అన్నారు మరి !
*****
నీదు రాక గోరి నిలువెల్ల కన్నులై
రిప్లయితొలగించండివేచి యుంటి పవలు ప్రియ శశాంక
మొదటి జాము గడచె మోమైన జూపవా
నాదు వలపు పిలుపు చేద నీకు?
నింగిలోన నీవు నేలపైనను నేను
తక్కువైతి నేమి తరలి రావు
ప్రేమ బంధమునకు లేమి యడ్డగు నేమి
పేద వారి యెదకు ప్రేమ తగద?
మూట గట్టి వలపు ముద్దరాలై నేను
కనులు కాయలగుచు కాచుకొనగ
నావయస్సు జూచి నా జుంటి తేనెల
దోచ తేటి వేచె దుష్ట బుద్ధి.
తార బిగికౌగిటను నిను దాచె నేమి
నా వలపు పిల్పు నినుజేరునా బిరాన
చంద్రమా తాళ లేనింక జాలి జూపి
కలువ కన్నెను చేకొన కదలి రావె.
అల్లదే వెండి వెన్నెల తెల్ల దనము
మెల్ల మెల్లన కరగించు చల్లదనము
వచ్చు చుంటివా నాప్రియా వలపు చిలుక
రమ్ము రారమ్ము నీస్పర్శ నిమ్ము వేగ.
మిస్సన్న మహాశయా !
రిప్లయితొలగించండిమీ
కలువ కన్నె కలవరింత
బాగు బాగు !
వసంత మహోదయా ధన్యవాదాలు. చాలాకాలం తర్వాత మళ్ళా ఈమధ్యన మీ కవితా వైభవాన్ని ఆనందిస్తున్నాం. ఈ రోజు దేవులపల్లి వారి అపురూపమైన సాహిత్యంలో ఓలలాడించారు.
రిప్లయితొలగించండిసంతోషం.
రిప్లయితొలగించండిచిత్రంలో తామరపువ్వో,లేక కలువపువ్వో సరిగా తెలియలేదు.అందుచేత రెండిటి గురించి రాస్తున్నాను.
1.కొలనులో వికసించెను కుముదమొకటి ,
వలపు చెలికాడు రేరాజు వచ్చుననుచు
పత్రసఖులను గూడి విభాసమాన
మగుచు ,నామనమ్ముల్లసిత మాయె చూచి.
2. ఉదయమాయెను దినకరు డుజ్వలముగ ,
కలిత కాంతిని బుండరీకమ్ము సరసి
దామరాకుల నడుమను దర్శనీయ
శోభ జేకూర్చె బ్రకృతికి శుభకరముగ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
ఏ నాటి కైనా- యీ చిన్ని పూవూ
హరి పాదాల జేరీ - వర్ధిల్లు నా?
02)
___________________________________
పున్నమి నాడు రోదసిని - పూర్ణమసుం డదె ప్రజ్వలింప, నా
వెన్నెల వెల్లువన్ మిగుల - వేడుక స్నానము జేసి, పిమ్మటన్
వెన్నెలకందు రాకకయి - వేచిన , పూచిన చంద్రకాంతమా
వెన్నెలఱేడు రాడిలకు ! - వీడడు రిక్కల కౌగిలిన్ సదా !
వన్నెల చిన్నెల న్నడవి - పాలగు వెన్నెల లట్లు సేయకే
వన్నెలు తగ్గు ముందుగనె - పన్నగశాయి పదాబ్జ మందినన్
పన్నగశాయి , భక్తి కిడు - భాగ్యము తోడుత శక్తి, ముక్తులన్
వెన్నుని భక్తి తోడ కడు ,- వేడుము , పొందుము , శోభనం బిలన్ !
___________________________________
మిస్సన్న సారూ ! బహుత్ ఖూబ్ !
రిప్లయితొలగించండినీ దశావతార్ పూరణ్ చోరీ జేసినా !
భయ్ , జర చూస్కోరాదె ?
అరె కిశోర్ భాయ్ ఏం చోరీ చేసినవ్ బిడ్డా. బహుత్ పసంద్ గుంది భాయ్. చేస్తే చేసినావ్ గాని జర తబీయత్
రిప్లయితొలగించండిచూస్కో భాయ్.
జరూర్ ! జరూర్ దేఖ్ లూంగా
రిప్లయితొలగించండిమిసన్న భాయ్ ! షుక్రియా !