17, ఆగస్టు 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 795 (పంది పుటుక్కున)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
పంది పుటుక్కునఁ గొఱికెను భామిని పెదవిన్.

14 కామెంట్‌లు:

  1. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    ఉదయం పద్యరచన పోస్ట్ చేయగానే పోయిన కరెంట్ మా వీధిలో ఇంకా రాలేదు. అందువల్ల ఈ నాటి సమస్యను పోస్ట్ చేయడం ఆలస్యమయింది. ప్రస్తుతం నేను బజారుకు వచ్చి ఒక నెట్ సెంటర్ నుండి సమస్యను పోస్ట్ చేస్తున్నాను.
    ఆలస్యానికి మన్నించండి.

    రిప్లయితొలగించండి
  2. సుందరిని పెండ్లి యాడగ
    నందలమందున వరుడదె యరుదెంచె సుమీ!
    పందిరిలో మదనుని పిలు
    పంది, పుటుక్కునఁ గొఱికెను భామిని పెదవిన్.

    రిప్లయితొలగించండి
  3. ఇటువంటి సమస్య ఇదివరకు ఇచ్చారు. సమస్యాపూరణము -45 చూడండి.

    రిప్లయితొలగించండి

  4. అందమగు భామ లిరువురు
    పందిరి మంచంబు నెక్కి పాటలు పాడన్
    నిందిర ! రావా యను పిలు
    పంది, పుటుక్కున గొఱి కెను భామిని పెదవిన్ .

    రిప్లయితొలగించండి
  5. రని గారూ,
    నిజమే... గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు. చెప్పాను కదా, ఈమధ్య మతిమరుపు ఎక్కువయింది. అది మీరు పంపిన సమస్యే.. 22-7-2010 నాడు ప్రకటించింది. అది యిది...
    పంది యధరసుధలు గ్రోలి పరవశుఁ డయ్యెన్.

    రిప్లయితొలగించండి
  6. విందువినోదంబులనుచు
    నందాల మగువలుసైత మాపబ్బులందున్
    సందడిఁజేయనొకడుకై
    పంది పుటుక్కున గొఱికెను భామిని పెదవిన్!

    రిప్లయితొలగించండి
  7. కవిమిత్రలకు నమస్కృతులు.
    ఈరోజు సమస్య ఆలస్యంగా ఇచ్చినందువల్ల కాబోలు... స్పందనలు తక్కువగా వచ్చినవి.
    అందులోను ఇలాంటిదే గతంలో ఇచ్చానని రవి గారు గుర్తు చేసారు.
    చక్కని పూరణలు చేసిన
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి
    ..... అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారి పూరణలు.....
    (1)
    సుందరితోడ శయింపఁ, 'బ
    సం దయినటు వంటి మేలి చక్కెర కేళిన్
    విందారఁగించు కల' కిం
    పంది, పుటుక్కునఁ గొఱికెను భామిని పెదవిన్!
    (2)
    అందమ్ము చిందు లాడెడి
    సుందరి తన చెంత నుండఁ జూచుచుఁ దమితో;
    ముందుకుఁ జనియున్, దా, వల
    పంది, పుటుక్కునఁ గొఱికెను భామిని పెదవిన్!

    రిప్లయితొలగించండి



  9. చందనగంధి వరూధిని
    సుందర రూపమున బరవశుండై ,యామెన్
    పొందెను ప్రవరాఖ్యుని రూ
    పంది, చటుక్కును గొరికెను భామిని పెదవిన్

    రిప్లయితొలగించండి
  10. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఒక యువకుడు ఊహలలో :

    01)
    _______________________________

    నిందలు వేయగ తనపై
    కుందుచు నొక యువకు డంత - కోపము తీరన్
    సుందరినే , తన మది తల
    పంది , పుటుక్కునఁ గొఱికెను - భామిని పెదవిన్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  11. అందము లొలికెడు పాపాయ్
    చిందులు వేయుచును తల్లి చేతులు చాపన్
    అందక పరుగిడుచును కొ
    ప్పంది పుటుక్కునఁ గొఱికెను భామిని పెదవిన్.

    రిప్లయితొలగించండి
  12. చిన్న సవరణ తో..

    అందము లొలికెడు పాపడు
    చిందులు వేయుచును, తల్లి చేతులు చాపన్
    అందక పరుగిడుచును కొ
    ప్పంది పుటుక్కునఁ గొఱికెను భామిని పెదవిన్.

    రిప్లయితొలగించండి
  13. పందిరి వడ్డింపున తా
    వొందిన చికెను బిరియాని బొక్కగ పెదవుల్
    కందగ, తన నొసటికి సలు
    పంది, పుటుక్కునఁ గొఱికెను భామిని, పెదవిన్

    రిప్లయితొలగించండి
  14. అశోక వనమున సీత:

    తొందరగా పోలేదని
    చిందులు త్రొక్కుచు మరిదిని ఛీఛీ యనుచున్
    నిందను తా మోపిన తల
    పంది,... పుటుక్కునఁ గొఱికెను భామిని పెదవిన్ :)

    రిప్లయితొలగించండి