6, ఆగస్టు 2012, సోమవారం

పద్య రచన - 73

అశ్వత్థామ పరాభవము
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. హంత యితండు పుత్రకుల నందరినిన్ హతమార్చె వీని నే
    నంతము చేయువాడనని యా గురుసూనుని జంపబోవగా
    శాంతము బూని వీడుడనె సన్మతి ద్రౌపది భర్తలన్ బళా!
    యంతటి ధీరమానసకు నంజలి గూర్తు సమాదరమ్మునన్

    రిప్లయితొలగించండి
  2. గురుసుతువీవుమాన్యుడవు ఘోరమునెట్లు నొనర్చినావొకో!
    కరముల నెత్తి బాలలను కారుణి జూపక జంపినాడవే!
    నరుడవొ! రాక్షసుండవొకొ! న్యాయమె ద్రోణసుతుండ ! బల్కవే!
    సరగున జంపజాలమిక , జాటుల ఖండన జేసి పంపుడీ!

    రిప్లయితొలగించండి
  3. పిల్లలని జూడకీతడు పంపె దివికి
    వీని హత మార్తు మని భర్త లశన మెత్త
    నడ్డు తగిలెను ద్రోవది యార్ద్ర యయ్యి
    వందనీయులు గురు పుత్రు లందరి కనె

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని వారూ,
    అద్భుతమైన పద్యమున కంజలి గూర్తును భక్తి నియ్యెడన్.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం చక్కని ధారతో శోభిల్లుతున్నది. బాగుంది. అభినందనలు.
    ‘గురుసుతు డీవు’ అంటే బాగుంటుంది. ‘కారుణి’ పదం లేదు. అక్కడ ‘క్రౌర్యము జూపియు’ అందాం. నా మానీటర్ లోపం వల్ల మీ పద్యంలో చివరి పాదంలో కొన్ని అక్షరాలు స్పష్టంగా కనిపించటం లేదు
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మొదటి రెండు పాదాల్లో యతి తప్పింది.
    పిల్లలని జూడ కితడు పంపెను దివికిని
    వీని హత మార్తు మని భర్తలే నిలువగ... అని నా సవరణ....

    రిప్లయితొలగించండి
  5. గురువు గారు,
    ధన్యవాదములండి. మీ సవరణలు శిరోధార్యములు.

    రిప్లయితొలగించండి
  6. హద్దులు లేని క్రోధమున నన్నెము పున్నెము నేరనట్టి యా
    నిద్దుర వోవు బాలకుల నిర్దయ జంపిన క్రూరు డీత డో
    ముద్దియ వీని మస్తకము మోదెద వ్రయ్యలు గాగ నిప్పుడే
    వద్దన కంచు భీముడన వానిని ద్రౌపది జూచి యిట్లనెన్.

    ఏమరి యున్న బాలకుల నేసెను నాకవ గర్భ శోకము
    న్నేమని యంద నర్హుడగు నీతడు జాలికి కాని ధర్మమే
    భూమి సురుండితండు గురు పుత్రుడు చంపిన వీనితల్లికిన్
    సేమమె పెట్ట గర్భమున చిచ్చును కూడదనంగ కృష్ణయున్.

    ద్రోణ పుత్రు బట్టి వేణిని దాగిన
    మణిని పెరకి విడువ మతిని గోలు
    పోయి తిరుగ జొచ్చ్హె భూసురు డవనిని
    చావు తప్పి కన్ను పోవ నపుడు.

    తల్లి బాధ యొక్క తల్లికె తెలియును
    కలను నైన నెపుడు తలప దామె
    యరులకైన గాని యటువంటి శోకము
    భరత నారి కృష్ణ బాగు బాగు.

    క్రూరుడైన సుతుడు ధారుణి నుండుట
    సహజ మగును తెలియ నహము వీడి
    క్రూర మాత భువిని నేరుట గలదొకో
    శంకర గురు వాక్కు సత్య మాయె.

    రిప్లయితొలగించండి
  7. దయచేసి unknown ను మిస్సన్నగా భావించండి.

    రిప్లయితొలగించండి
  8. కుమిలెన్ ద్రౌపది పుత్రశోకమున,నాక్రోశించగా గాంచుచున్
    యముడై భీముడు తీవ్రకంఠమున రోషావేశుడై యిట్లనెన్
    క్షమియింపందగువాడొకో కఠినశిక్షార్హుండు ,వధ్యుండె గా
    శమియింపన్ ,వధియింతు ,జేసెదను శీర్షమ్మున్ దునాతుంకలన్.
    అంత ద్రౌపది తన శోకమును సంబాళించుకొని యిట్లనెను.

    అశ్వత్థామను జంపగా వలవదీ హంతవ్యుడౌ విప్రునిన్,
    శశ్వత్కీర్తి పరాభవించి,విడువన్ జాలున్ ,మణిన్ గొంచనెన్,
    విశ్వాసమ్మున ద్రౌపదీ సతి మహావిజ్ఞాని యౌటన్ గదా
    అశ్వాసించెను పాండు సూనులను ,క్రోధావేశ సమ్రంభులన్ .

    ఇంతకు ముందొకసారి రాసాను.ఈనాటి సమస్యా పూరణలకీ ,పద్యరచనలకీ
    మర్నాటివరకు ఆగి అభిప్రాయాలు,సూచనలూ ఇస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  9. నిదుర నున్నట్టి పిల్లల నీచ వృత్తి
    గొంతు గోసిన వీడటే గురు సుతుండు
    ఉత్తరించెద నిప్పుడే కుత్తుకనగ
    వలదు వలదను పాంచాలి వందనీయ.

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారూ,
    ‘అశ్వత్థామ గర్వభంగము’ అనదగ్గ మీ ఖండిక సర్వశ్రేష్టంగా ఉంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ పద్యాలు (ముఖ్యంగా ‘శ్వ’ప్రాసతో శార్దూలం) చాలా బాగున్నవి. అభినందనలు.
    మీ సూచనను పాటించడానికి ప్రయత్నిస్తాను.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి