13, ఆగస్టు 2012, సోమవారం

పద్య రచన - 80

 కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. మాస్టారూ, ఈ చిత్రం మొన్నీమధ్యనె ఇచ్చినట్లున్నది.

    రిప్లయితొలగించండి
  2. టకారవర్గ నిషేధంతో పద్యం వ్రాయమని ఇచ్చిన చిత్రం, గతంలో నా పూరణలు:
    ఆ ధీరాంధ్ర సుకేసరి
    మేధాకాశము తెలుగుల మేరు నగంబై
    క్రోధించి నిలపె సైమను
    యోధుల దుశ్చర్యలెల్ల నోయనఁగ సుధీ!

    ఇత నెదిరి తుపాకి కెదురు నిలచె తెల్ల
    వారి వైరి తెలుగు వారి కెల్ల
    గర్వ కారణము ప్రకాశము పంతులు
    ఆంధ్ర కేసరి సరి యాంధ్రులకును!

    రిప్లయితొలగించండి
  3. చంద్రశేఖర్ గారూ,
    గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
    ఏమిటో ఈమధ్య మతిమరుపు ఎక్కువైపోతున్నది. ఈ చిత్రాన్ని ‘నిషిద్ధాక్షరి’ శీర్షిక క్రింద రెండునెలల క్రితం ఇచ్చాను. సేవ్ చేసుకున్న ‘పద్యరచన’ శీర్షికలో ఈ చిత్రాన్ని డిలీట్ చెయ్యలేదు.
    సరేలెండి... అప్పుడు టవర్గ నిషేధం... ఇప్పుడు ఏ నిషేధమూ లేదు...

    రిప్లయితొలగించండి


  4. ఆంగ్ల పాలకు హృ దయాలు కలచి వైచి
    పార ద్రోలితి వీ వయ్య ! పం తు లయ్య !
    టం గు టూ రి వంశమునకు నగ్ర గణ్య !
    వేల కొలదిగ నతు లను నోలి నిత్తు .

    రిప్లయితొలగించండి
  5. అయ్యా! సుబ్బారావు గారూ!
    అభినందనలు. మీ పద్యములో 2 పాదములలో యతులు వేయుట మరిచిపోయేరు. కాస్త సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి


  6. ఆంధ్రులకు బ్రియతముడు నాయకుడు ధీరు
    డాంధ్ర కేసరిగా బిరుదందినాడు.
    నాయకత్వము వహియంచె నాడు దేశ
    దాస్య శృంఖలా మోచనోద్యమము నడుప.

    రిప్లయితొలగించండి
  7. డా. కమనీయం గారి పద్యము చాల బాగున్నది. శ్రీ ప్రకాశం గారిని చిన్న పద్యములో చక్కగా వర్ణించేరు. ధన్యవాదములు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారి పద్యము.....

    గుండున కెదురుగా గుండెను నిలిపిన
    గుండె నిబ్బరమున్న దండి వ్యక్తి!
    సైమన్ కమిషను రా సాఁగ, నాపియు, వెన్క
    కును వెళ్ళఁగొట్టిన గొప్ప వ్యక్తి!
    దొరల చేష్టఁ బ్రజల దరికిఁ జేర్చ స్వరాజ్య
    పత్రిక నడిపిన ప్రజల వ్యక్తి!
    దేశ స్వరాజ్యమే దేశ సౌభాగ్యమ్మ
    టంచుఁ జాటియు నిల్చు మంచి వ్యక్తి!
    భరతదేశమున్ స్వాతంత్ర్య పథమునందు
    నడిపి, యందఱ మేల్కొల్పు నాయకుండ!
    'యాంధ్రకేసరి'యన్ బిరు దాంచితుండ!
    టంగుటూరి ప్రకాశ! దండములు నీకు!!

    రిప్లయితొలగించండి
  9. ఇది గతంలో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రశేఖర్ గారికి,
    మనోహరమైన పద్యాలు వ్రాసిన
    సుబ్బారావు గారికి,
    కమనీయం గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి