1, ఆగస్టు 2012, బుధవారం

పద్య రచన - 68

 
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

  1. గీత లోనె గలదు గెలుపోటముల తీర్పు
    'గీత' నెరిగి బ్రతుక గెలుపు మనదె
    వెనుక శక్తు లెన్ని వేధించి లాగిన
    గీత దాక చాపు చేతులనిక.)
    ('గీత' దలచి చూపు చేతలనిక.)

    రిప్లయితొలగించండి
  2. కబ డి యాటను నాడుట కాని పించె
    కబడి కాబడి యనుచును గలయ బడిరి
    గీ త ముట్టిన వారలు గెలిచి నట్లు
    లెక్క జూతురు పాయిం ట్లు నొక్కొ కటిగ

    రిప్లయితొలగించండి
  3. బుడతలకు యువజనులకును
    కడుప్రీతినిగూర్చుకబడి కనుమరుగాయెన్
    చెడుగుడు లాడుచు క్రీడల
    నొడిదుడుకులపాలొనర్పనుచితంబౌనే?

    బడిపిల్లలకూరిప్రజకు
    కడు బ్రీతిని గూర్చునట్టి కబడిని నేడా
    డెడువారులేరు;కనబడె
    చెడుగుడు నేటికినిట చిరుచిత్రమునందున్!!!

    రిప్లయితొలగించండి
  4. జీవిత చదరం గంబున
    నేవిధి గాంచిన నటునిటు నేలిక యైనన్ !
    ఈ విధి కబడీ యాడగ
    కావరము తొలగు ననుచును కాలుని కైనన్ !

    రిప్లయితొలగించండి
  5. కబడి యాట లోన కనిపించు జీవితం
    గమ్య మందు కొనెడు గట్టి కృషిని
    సడల జేయవె యరిషడ్వర్గ మనునవి
    విజయ మంద కుండ వెనుక కీడ్చు!

    రిప్లయితొలగించండి
  6. కబడి యాట చూడ కాలేదు కనుమరు
    గాసియాను జనులు అన్ని చోట్ల
    పందెములను పెద్ద బహుమతు లిచ్చుచు
    ఆడుచుందు రిప్పు డమితప్రీతి.

    రిప్లయితొలగించండి
  7. కవిమిత్రులకు నమస్కారం.
    లోపం మానిటర్ లోనే ఉందు. అక్షరాలు అస్పష్టంగా ముద్దముద్దగా కనిపిస్తూ మేరేం వ్రాసారో టేళీయకుండా ఉంది. మరొ రెండు రొజులు ఈ అవస్థ తప్పదు. దినిని బాగు చేయించాలి. అంతదాకా దయచేసి పరస్పరం గునదొష విచారణ చేయవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి