30, ఆగస్టు 2012, గురువారం

సమస్యాపూరణం - 807 (నిద్ర చేకూర్చు సంపదల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
నిద్ర చేకూర్చు సంపదల్ భద్రముగను. 

20 కామెంట్‌లు:

  1. జీవితమ్మున సగపాలు చెల్లిపోవు
    నిద్ర యందున, కావున నియమమెంచి
    తగిన కాలమ్ము నందున తగు పరిమిత
    నిద్ర చేకూర్చు సంపదల్ భద్రముగను.

    రిప్లయితొలగించండి
  2. కుంభకర్ణుడు చేసెను గొప్ప తపము
    బ్రహ్మ ప్రత్యక్షమయ్యెను వరము నీయ
    నసురుడుండనె నాకీయు మయ్య నిద్ర
    నిద్ర చేకూర్చు సంపదల్ భద్రముగను.

    రిప్లయితొలగించండి
  3. పనుల వేళల నిద్రయె? పగలు నిద్ర
    పాడుచేయు నారోగ్యము; పనికి రాదు
    మనము , దేహమ్ము పాడగు మనకిక, మిత
    నిద్ర చేకూర్చు సంపదల్ భద్రముగను.

    రిప్లయితొలగించండి

  4. ఆయు రారోగ్య సంపద లాత్మ తృప్తి
    నిద్ర చేకూర్చు, సంపదల్ భద్రముగను
    దాచు కొనుమయ్య ! వేగమె దైర్యముగను
    చోర భయములు లేనట్టి చోటు లందు .

    రిప్లయితొలగించండి
  5. ఓరి కుంభ కర్ణా! యేల పోరు నీకు?
    నిద్ర చేకూర్చు సంపదల్ భద్రముగను!!
    సరిసరి! నిశాచరా! రమ్ము, శాశ్వతమగు
    నిద్ర చేకూర్చు సంపదల్ భద్రముగను!!

    రిప్లయితొలగించండి
  6. యమ నియమ ఆసనాదులు సమయపాల
    నలిడు నాయురా రోగ్య౦బు నయవినయము
    తగు మన శ్శాంతి మనలకొసగునిక సుఖ
    నిద్ర; చేకూర్చు సంపదల్ భద్రముగను
    నిజంగా నిద్ర మంచి సంపద; నిద్ర పట్టనప్పుడు దాని విలువ తెలుస్తుందని పెద్దలు అంగీకరిస్తారనే అనుకొంటాను.

    రిప్లయితొలగించండి
  7. గుండు మధుసూదన్ గారి పూరణ....

    ధనముఁ దొలఁగించుఁ గుంభకర్ణు నటువంటి
    నిద్ర! చేకూర్చు సంపదల్ భద్రముగను,
    బరిమితముగాను నిద్రించవలసినంత
    నిద్రపోవ! నిదియ మంచి నియమ మిలను!!

    రిప్లయితొలగించండి
  8. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    కుంభకర్ణుడి కోరికగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    సుఖనిద్రాదాయకాలను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    కుంభకర్ణుని అధిక్షేపించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. మేలు కలుగును దొంగకు మీరు వినుడు
    కలిసి యందరు నింటిలో గాలి లేక
    మేడ పైకెక్కి నిద్రించ మేలు కొనని
    నిద్ర, చేకూర్చు సంపదల్ భద్రముగను.

    రిప్లయితొలగించండి
  10. నమస్కారం.
    నేను ఆలస్యంగా ఒక పద్యం వరాహావతారం మీద ప్రయత్నించాను. ఆ పద్యం అదే పేరు క్రింద పోస్ట్ చేస్తున్నాను. చదివి సలహా చెప్ప ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  11. ఆ త్రిమూర్తులే ధ్యానమ్ము నాచ రింప
    మానసిక పురోగతు లీయ మనుజు లెల్ల
    నిత్యసాధనా. సత్సంగ, నియమ యోగ
    నిద్ర చేకూర్చుసంపదల్ భద్ర ముగను!

    రిప్లయితొలగించండి
  12. శ్రీగురుభ్యోనమః,
    రెండవ పాద సవరణ:

    మానసిక పురోగతులిచ్చి మనుజునకును

    రిప్లయితొలగించండి




  13. పవలు కష్టించి పనిచేసి బ్రతుకు సాగ
    బంధుమిత్రులతో బాలు పంచుకొనుచు
    మనము శాంతమ్ముగా నుండ మంచి సుఖపు
    నిద్ర చేకూర్చు సంపదల్ భద్రముగను.

    రిప్లయితొలగించండి
  14. చేయ నేకాంత,పవళింపుసేవలు,వర
    మిచ్చు నుచితనిత్యానంద మింతులార!
    యింటికిఁ బిలువ, "స్వామివారొంటిరాత్రి
    నిద్ర" చేకూర్చు సంపదల్ "భద్రముగను".

    రిప్లయితొలగించండి
  15. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    నిజపు సరిహద్దు భద్రతా దళము(BSF) :

    01)
    _______________________________

    నేల సౌభాగ్య సీమగా - నిలచు కొరకు
    నెత్తురోడిన , ప్రాణముల్ - నిలుచు దాక
    నిజపు సరిహద్దు భద్రతా - నీకమందు
    నియమ మైనట్టి వంతుల; - నెల్ల వేళ
    నిద్ర పోకుండ సైనికుల్ - నియతి తోడ
    నిలచి, కాపాడ కుండిన - నేది రక్ష ?
    వంతు వంతుల కాపలా - వలన , రాని
    నిద్ర ; చేకూర్చు సంపదల్ - భద్రముగను !
    _______________________________
    వంతు = వరుస(SHIFT)

    రిప్లయితొలగించండి

  16. దినమునకు ఏడు ఘడియలు కునుకుదీయ
    కున్న అలసినట్టి తనువు కుదుట పడదు
    బుల్లి తెరని కట్టి శయనింపుము సరిపడు
    నిద్ర చేకూర్చు సంపదల్ భద్రముగను

    ఇంచుమించుగా ప్రతిరోజు రాత్రి నేను మా పిల్లలకు చెప్పే విషయము :-)

    రిప్లయితొలగించండి
  17. లక్ష్మీ నరసింహం గారి పూరణ....

    పప్పు, కూర, రసము, జీడిపప్పులున్న
    పాయసము, పులిహోర, బొబ్బట్లు, లడ్లు,
    సుష్టుగా భుజింపగలిన సోమరికిని
    నిద్ర చేకూర్చు సంపదల్ భద్రముగను.

    రిప్లయితొలగించండి
  18. కవిమిత్రులారా,
    పనుల ఒత్తిడి వలన మీ పూరణలను వ్యాఖ్యానించడానికి అవకాశం దొరకలేదు.
    ఆలస్యానికి మన్నించండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మన నిద్ర దొంగకు మేలు కలిగిస్తుందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    వ్యంగ్యభరితమైన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పుష్యం గారూ,
    మీరు చెప్పింది మీ పిల్లలకే కాదు సార్వజనీయం. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీ నరసింహం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి