కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సిగ్గులేనివాఁడు శ్రీవిభుండు.
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సిగ్గులేనివాఁడు శ్రీవిభుండు.
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.
వష్ణు వెచట గలఁడొ వెదుకంగఁ బంపె హి
రిప్లయితొలగించండిరణ్యకశ్యపుండు రాక్షసులను
వానిఁ గనకఁ బలికె “పారిపోయె బెదరి
సిగ్గులేనివాఁడు శ్రీవిభుండు”
శంకరార్యా ! చక్కని పూరణ చేశారు..
రిప్లయితొలగించండిమొదటి అక్షరం టైపాటు ...
అయ్యా! శంకరయ్య గారూ! నమస్కృతులు.
రిప్లయితొలగించండిహిరణ్యకశిపుడు అని అంటారు కదా. హిరణ్యకశ్యపుడు అని కూడా అంటారా? మా సందేహ నివృత్తి చేయగలరు.
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. నా కంప్యూటర్ మానీటర్ చెడిపోయి అక్షరాలు స్పష్టంగా కనిపించడం లేదు.
పండిత నేమాని వారూ,
నిజమే, దోషమే! ధన్యవాదాలు.సవరిస్తాను.
సాలె పాము సామజమ్ము, సానికుడని
రిప్లయితొలగించండిచిన్న చూపు చూడ కెన్నగాను
వారి భక్తి మెచ్చి పరలోకగతిఁ జూప
సిగ్గు లేనివాఁడు శ్రీవిభుండు.
సవరించిన నా పూరణము.....
రిప్లయితొలగించండివిష్ణు వెచట గలఁడొ వెదకుఁ డనుచు హి
రణ్యకశిపుఁ డంపె రాక్షసులను
వానిఁ గనకఁ బలికె “పారిపోయె బెదరి
సిగ్గులేనివాఁడు శ్రీవిభుండు”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసిగ్గు లేని వాడు శ్రీవిభుం డనుచును
రిప్లయితొలగించండిదెప్పుచుండ నూరు తప్పులగుట
చక్రపాణి చేత సమసెను శిశుపాలు
డౌర! కృష్ణుతోడ వైరమేల?
చిన్న పెద్ద యనక చెయి చాపి యాచించు
రిప్లయితొలగించండిసిగ్గు లేని వాడు, శ్రీవిభుండు
శ్రీల నిచ్చు భక్త జాలము నకునిల
భక్త లోలుడు గద, పరమ శివుడు
కన్నె మోము వెల్గు కాంతి నేమందువు?
రిప్లయితొలగించండిజ్ఞానశూన్యత గల జడుడె యగును...
రమకు నాథుడైన రమణుడదెవ్వరు?
సిగ్గు; లేనివాడు; శ్రీవిభుండు.
కానిపనులజేసి కనకంబునార్జించి
రిప్లయితొలగించండితానుతినక పరులకివ్వలేని
వానికున్నపేరు వరుసగమారెను
"సిగ్గులేనివాఁడు శ్రీవిభుండు"
సిగ్గు, లేని వాడు శ్రీవిభుం డందువే?
రిప్లయితొలగించండిఅన్ని యున్న వాడు, నడుగు నెడల
నన్ని యిచ్చు వాడు నా విభుండే కదా!
తలప వలదు తప్పు, తప్పు లెపుడు
పాల కడలి లోన పవళించు హరియైన
రిప్లయితొలగించండిశరణు వేడి నంత కరగి పోవు
కరిని గాచి తుదకు కైవల్య పధమిడె
సిగ్గు లేని వాఁ డు శ్రీ విభుండు !
------------------------------------------
తన్ను లైన దినగ తగుదు ననెసత్యను
భక్త వత్స లుండు ప్రాపు గాన
సిరిని సైత మొదిలి శీఘ్రమే పరుగిడు
సిగ్గు లేని వాడు శ్రీ విభుండు !
విష్ణునింద చెవుల వినుచునుండెడువాడు
రిప్లయితొలగించండిసిగ్గులేనివాడు; శ్రీవిభుండు
కరుణతోడ కాచు, కమల నయనుడైన
ప్రభువు రక్షచేయు ప్రజలనెల్ల.
గుండా సహదేవుడు గారి పూరణ.....
రిప్లయితొలగించండిభృగువు వక్షమందు పొగరుగా తన్నినన్
పాదసేవ జేసి పాద మొత్త
అతివ సత్య తన్నె నటుపైన తలమీద
సిగ్గులేనివాడు శ్రీవిభుండు.
* * * * *
లక్ష్మీ నరసింహం గారి పూరణ.....
పట్టుపరుపుమీద పవళించి కరమును
చెలియకు తలగడగ జేసి నాదు
రాక నెరుగ డనుచు భృగువు దలచె “నెంత
సిగ్గులేనివాడు శ్రీవిభుండు”
* * * * *
గుండు మధుసూదన్ గారి పూరణ....
"భృగుఁడు తన్నినంత విష్ణుండు కాలొత్తె;
సిగ్గులేనివాఁడు శ్రీవిభుండు;
ఛీ!" యనంగ వలదు! శ్రీశుఁడీ నెపమున
భృగుని కాలి కన్నుఁ బెఱుక నెంచె!
కలసిరసుర సురలు కవ్వంబుజేయగా
రిప్లయితొలగించండినుద్భవించెనమృతముత్కటముగ,
సురలకియ్యదలచి సుదతివేషమునని
స్సిగ్గులేని వాడు శ్రీవిభుండు.
( నిస్సిగ్గు = సిగ్గుపడకపోవటము ) - వైరిసమాస పదము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబాల కృష్ణు రూపు పాలు వెన్నలు దొంగి
రిప్లయితొలగించండిలించినాడు నాడు పొంచి యుండి
జలకమాడు సఖుల వలువల తా దోచె
సిగ్గు లేని వాడు శ్రీ విభుండు.
సిరిని గలిగి యుండి శ్రీశుండు తానయ్యు
ఆలు వెడలి పోగ నాకలనుచు
అడవి బాట బట్టె నప్పడిగె కుబేరు
సిగ్గు లేని వాడు శ్రీ విభుండు.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిభాషాభిమానంతో, పద్యకవిత్వంపై ఆసక్తితో, ఉత్సాహంగా పూరణలను, పద్యాలను వ్రాస్తున్న అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
నా కంప్యూటర్ మానీటర్ చెడిపోయి బ్లాగులో చిన్న అక్షరాలు స్పష్టంగా కనపడటం లెఉ. అందువల్ల మీ పద్యాలను చదివలేకపోతున్నాను. మెకానిక్‌కు ఎన్నిసార్లు ఫోన్ చెదినా ఇదిగో వస్తున్నా అంటూ వారంరోజులుగా ఇబ్బంది పెడుతున్నాడు.
దయచేసి మరో రెందు మూడు రోజులు మిత్రులు పరస్స్పరం గుణదోష విచారణ చేసికొనవలసిందిగామనవ్.
ఇప్పుడు నేను టైప్ చేదినన్యాఖ్యుఅలో ఎన్ని తప్పులున్నాయో?
తనదునెలవు,పుష్పదామ రత్నమయంబు,
రిప్లయితొలగించండితన్నెనొకడు నరుడు ,తాల్మిదాల్చె,
నెట్టులోర్తు నంచు నీసడించెను లక్ష్మి.
సిగ్గులేని వాడు శ్రీవిభుండు.