16, ఆగస్టు 2012, గురువారం

పద్య రచన - 83


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. సురలునసురులును నొకటిగ
    త్వరపడి రమృతము కొఱకయి; దయగని యపుడే
    హరి యా కూర్మపు రూపున
    గిరి యడుగున జేరి మోసె, కీలకమగుచున్.

    రిప్లయితొలగించండి
  2. క్షీరసాగరమందు నావుడు జేరిరెల్లరు కాంక్షతో
    వారలచ్చట మంథరమ్మను పర్వతమ్మును నిల్పుచున్,
    ధీరులై నొక సర్పరాజును దెచ్చికట్టిరి చిల్కగా
    జారుచుండె మహీధరమ్మది సాగరమ్మున నయ్యహో!

    నారాయణుడత్తఱి జని
    వారల గాచుటకు నపుడు పరుగున వచ్చెన్
    తీరుగ కూర్మము దానై
    వారధి నిల్చుచు ననంత భారము మోసెన్.

    రిప్లయితొలగించండి

  3. మంధ ర గిరిని సంద్రాన మధన జేయ
    కమట రూ పంబు దాలిచి కంస రిపుడు
    నదిమి పట్టెను మంధర నయ్య దున న
    చిలుక సాగిరి ముదమున శే షు తోడ .

    రిప్లయితొలగించండి
  4. పరమామ్నాయ స్తుత్యా!
    పరమాద్భుత కూర్మరూప! పరితాపహరా!
    పరమానందప్రద! శ్రీ
    కర! కరుణాకర! ముకుంద! కమఠాధిపతీ! .. 1.

    సుర లసురులు పాథోధిని
    గిరి తోడనె ద్రచ్చు వేళ గిరి కూలగ వే
    సరి జేసి వహించిన శ్రీ
    కర! కరుణాకర! ముకుంద! కమఠాధిపతీ! .. 2

    స్థిరముగ నిల్పితివి గిరిని
    హరి! హరి! ధన్వంతరివయి అమృతమొసగి, సుం
    దరివై సుధ పంచితి శ్రీ
    కర! కరుణాకర! ముకుంద! కమఠాధిపతీ! .. 3.

    భరమయినది జీవితమిది
    పరితాపముతోడ దుఃఖ వార్ధి మునుగు స
    త్వర ముద్ధరింపుమా శ్రీ
    కర! కరుణాకర! ముకుంద! కమఠాధిపతీ! .. 4.

    ఎరుగను కద లోనికి నే
    మరలించుట నింద్రియముల మము కృప గని యా
    వెరవు నెరిగింపుమా శ్రీ
    కర! కరుణాకర! ముకుంద! కమఠాధిపతీ! .. 5.







    రిప్లయితొలగించండి
  5. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యాలు చాలా బాగున్నాయి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ‘శ్రీకర! కరుణాకర! ముకుంద! కమఠాధిపతీ!’ అన్న మకుటంతో మీ పద్యాలు ప్రశస్తంగా ఉన్నాయి. ‘దుఃఖవార్ధిలో మునిగే జీవితాన్ని ఉద్ధరింపు’మనడం చాలా బాగుంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. గుండు మధుసూదన్ గారి
    పద్య రచన: -:క్షీరసాగరమథన వృత్తాంతము:-
    ఆ.వె.
    దేవ దానవులును దీవ్రమౌ యుద్ధాన
    మరణ మందుచుండ; మాధవునకు
    విన్నవించఁగాను విష్ణుండు "క్షీర సా
    గర మథనము సేయఁగా వలె" ననె!(1)
    తే.గీ.
    పాల సంద్రాన మంథర పర్వత మిడి,
    వాసుకినిఁ గవ్వముగఁ జేసి, దేవ దాన
    వులుఁ జిలుకఁగఁ బూన; మునిఁగి పోవ నదియుఁ;
    గలఁతఁ జెంది, హరినిఁ జేరి, తెలుపఁ గాను;(2)
    కం.
    చిఱు నగవున విష్ణు వపుడు
    కరుణను దాఁబేటి మేటిగా మాఱియు, మం
    ధరమును వీపున మోయఁగఁ;
    దరచిరి యా పాలకడలిఁ ద్వరితోత్సుకతన్!(3)
    తే.గీ.
    కలశ పాధోధిఁ ద్రచ్చఁగఁ దొలుతఁ బుట్టె
    హాలహల; మది దహియించ; నందఱు హరు
    శరణ మర్థించ; నప్పుడు శంకరుండు
    గరళముం ద్రాగి, యంత శ్రీ కంఠుఁ డయ్యె!(4)
    తే.గీ.(పంచపాది)
    ముదముతో వారుఁ ద్రచ్చంగ మొదట కామ
    ధేను వుదయించఁగ వశిష్ఠుఁ డెలమిఁ గొనియెఁ;
    ద్రచ్చ నుచ్చైశ్శ్ర వైరావతములు, కల్ప
    వృక్షము న్నప్సర లింద్రుఁ డా క్షణమ్మె
    కొనఁగ; లక్ష్మిఁ గౌస్తుభమునుఁ గొనియె హరియు!(5)
    కం.
    చివరకు దేవతలును దా
    నవులుం గోరిన యమృతము నా ధన్వంతరియే
    ధవళ రుచులుఁ బ్రసరించఁగ
    నవు మోమున విష్ణు మ్రోల నప్పుడ యుంచెన్!(6)
    ఆ.వె.
    దేవ దానవులును దీవ్రమౌ తమితోడ
    "మాకు మాక"టంచు మత్సరించి,
    వాదు లాడుచుండ వైకుంఠుఁ డప్పుడు
    మోహినిగను మాఱి ముందు నిలిచె!(7)
    తే.గీ.
    వారి కప్పుడు మోహిని పలికె నిట్లు,
    "వినుఁడు! నే నీ యమృతమునుఁ బ్రేమ మీఱ
    మీకు నందఱకును వంచి, మిమ్ము నమరు
    లనుగఁ జేసెద! నాసీను లగుఁడు నిచట!"(8)
    కం.
    ఇది విన్న దేవ దానవు
    "లదియే వర"మనుచు నటులె నటఁ గూర్చుండన్;
    సుదతి యమృతము సురల కిడె;
    నిది రాహు కేతువులుఁ గనిరిటు సురల కిడన్! (9)
    ఆ.వె.
    కనియు సురల చివరఁ జని, వారు కూర్చుండ;
    మోహినియును వంపె మోద మలర!
    సూర్య చంద్రు లిదియు సూచించ నా చక్రి,
    గొంతు దిగక మునుపె, గొంతుఁ ద్రెంచె!(10)
    ఆ.వె.
    కంఠమం దమృతము గల రాహు కేతుల
    తలలు బ్రతికె! మొండె మిలనుఁ జచ్చె!
    గ్రహణ మందు చుండ్రు రాహు కేతువు లెప్డు
    శశిని, రవిని! కాని, వశులు కారు! (11)
    తే.గీ.
    ఇటుల దేవత లమరులై పటు తరముగ
    రాక్షసులతోడ యుద్ధమ్ము ప్రబలముగను
    జేసి, దనుజుల నిర్జించి, జేత లైరి;
    క్షీర సాగర మథనమ్ము క్షేమ మిడఁగ!! (12)

    (ఇది క్షీరసాగరమథన వృత్తాంతము)
    -:శుభం భూయాత్:-

    రిప్లయితొలగించండి
  7. గుండు మధుసూదన్ గారూ,
    క్షీరసాగర మథన వృత్తాంతాన్ని మనోహరంగా ఖండకృతి రూపంలో చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! శ్రీ గుండు మధుసూదన్ గారి ఖండిక చాల బాగున్నది. ఈ క్రింది విషయములను పరిశీలించగలరు:

    1. 2వ పద్యము 2వ పాదములో యతి లేదు.
    2. 5వ పద్యము వృక్షమున్ + అప్సర = వృక్షమున్నప్సర అనుట సరియైన సంధికార్యమేనా?
    3. 5వ పద్యములో 3వ పాదములో గణభంగము.
    4. 9వ పద్యములో 4వ పాదములో జగణమును వేయరానిచోట వేసేరు.
    5. 11వ పద్యములో "పటుతరముగ" అనునది ద్విరుక్తియా లేక టైపు పొరపాటా?
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. పాల కడలిని మునిగిన పర్వతమును
    కూర్మ రూపము దాలిచి కూర్మి దేల్చి
    యమృత మథనమ్ము కనువుగా నమర జేసి
    నట్టి యచ్యుత నీకిదే యంజ లింతు.

    భవ సముద్రమ్ము నందున భవ విదూర
    బితుకుగా సాగు చున్నది బ్రతుకు నావ
    మునుగునో యేమొ దరిజేర్చు పుండరీక
    నయన యొక కంట కనిపెట్టి భయము బాపి.


    రిప్లయితొలగించండి
  10. పాల కడలి చిల్కెడు తరి
    బేలగ దైత్యులు సురలును పిల్వగ విని తా
    బేలుగ మారి గిరిని హరి
    లీలగ వీపున నిలిపిన రీతికి జేజే!

    రిప్లయితొలగించండి



  11. అమృత మథనవేళ నమరులు నసురులు
    మందరాద్రి మునుగ గ్రుందుచుండ
    కమఠ రూపమూని కావవే గిరినెత్తి
    ధైర్యమొసగి వారి దయను బ్రోవ.

    రిప్లయితొలగించండి
  12. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    కూర్మావతారము :

    01)
    _______________________________

    క్షీర సాగర మథనపు - కీడు మాన్ప
    కొండ క్రిందకు చేరిన - కూర్మ రూపు
    కోటి రీతుల కొనియాడి - కొలిచె సురలు !
    కూర్మ రూపుని కొలువగా - కూర్మి తోడ
    కోరి జేరరె ! తప్పక - కోర్కి దీర్చు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  13. పాపుల సంరక్షిం పగ
    మూపున మంధరము దాల్చి పురుషో త్తముడై !
    ప్రాపుగ లోక హితమ్మున
    గోపాలుడ వనగ నీవు గోవింద యనన్ !

    రిప్లయితొలగించండి
  14. పొంత లేని సురలసురులు పొదిలి కార్య శూరులై
    మంథర గిరి సంద్రమంత మథన జేయు సమయమం
    దింత తడవు పర్వతమ్ము స్థిరముగాను మనుటకున్
    చెంత కూర్మ రూపమునను చెలమినావు రాఘవా !

    రిప్లయితొలగించండి