కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మాటకు నిలబడనివాఁడె మాన్యుఁడు జగతిన్.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మాటకు నిలబడనివాఁడె మాన్యుఁడు జగతిన్.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూటకు పూటకు నేనిక
రిప్లయితొలగించండిమాటలనే మార్చ ననుచు మాటొ క్కటిగా
మాటలతో నేమా ర్చెడు
మాటకు నిలబడనివాఁడె మాన్యుఁడు జగతిన్.
ధాటిగ కవి శ్రీనాథుడు
రిప్లయితొలగించండిపాటవమున బొగడి యొక్క వసుధాధిపు నా
వాటమె మార్చె మరొకచో
మాటకు నిలబడని వాడె మాన్యుడు జగతిన్
(శ్రీనాథుడు సింగభూపాలుని యెదుట చెప్పిన పద్యమును చూడండి:
సర్వజ్ఞ నామధేయము
శర్వునకే రావు సింగ జనపాలునకే
యుర్విం జెల్లును తక్కొరు
సర్వజ్ఞుండనుట కుక్క సామజ మనుటే
(దీనిని 2 విధములుగ సమర్థించి(మొదటి సభలో పొగడుచు, తదుపరి సభలో ఆక్షేపించుచూ) 2 సభలలో కూడా బహుమతులు పొందెను కవి శ్రీనాథుడు).
ఓటమి చెందును నిరతము
రిప్లయితొలగించండిమాటకు నిల బడని వాడు, మాన్యుడు జగతిన్
సూటిగ రక్షణ సేయును
నూటికి మఱి నూరు పాళ్ళు నుడివితి నిజమున్
మూటలుగ ధనము పొందెడు
రిప్లయితొలగించండిబాటల నన్యాయముగను పరుగిడ తగునా?
వాటము మార్చుచు , తప్పుడు
మాటకు నిలబడని వాడె మాన్యుడు జగతిన్
ఘాటుగ చీవాట్లు తినును
మాటకు నిలబడని వాడె; మాన్యుడు జగతిన్
మాటను పాలించుటకయి
దీటుగ నిలబడు నెపుడును దృష్టాంతముగా.
ఆటకమైన జనోక్తుల
రిప్లయితొలగించండిపాటవమునబడక లౌక్యమాత్రమదనుచున్
బూటకనిందాస్తుతులను
మాటకు నిలబడనివాఁడె మాన్యుఁడు జగతిన్.
మాటలు కోటలు దాటును
రిప్లయితొలగించండిదాటవు చేతలు గడపలు దండుగ నేతల్
వాటా మ్రింగుచునిచ్చిన
మాటకు నిలబడనివాఁడె మాన్యుఁడు జగతిన్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమాటల గారడి చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
‘జనపాలునకే - యుర్విం జెల్లును’ అనీ, ‘జనపాలునకు + ఏ యుర్విం జెల్లును’ అని చమత్కరించిన చాటువును ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
నూటికి నూరు మార్కులు కొట్టేసిన పూరణ మీది. బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ రెండు పూరణలూ వైవిధ్యంగా బాగున్నవి. అభినందనలు.
*
చంద్రమౌళి గారూ,
మి పురణ బాగుంది. అభినందనలు.
‘ఆటకము...’ ?
*
చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమాటలు కోటలు దాటక
రిప్లయితొలగించండిపాటవమున పనులు జేయు ప్రాజ్ఞుని కంటెన్ !
ఈటెల మాటల నేర్పుగ
మాటకు నిలబడని వాఁ డె మాన్యుఁ డు జగతిన్ !
మాటకునిలబడుటెరుగని
రిప్లయితొలగించండికూటమి నందుండి కూలి గోతిన పడకన్
బాటది వీడి గతించిన
మాటకు నిలబడని వాడె మాన్యుడు జగతిన్!
మాటకు నిలబడుటేలా
రిప్లయితొలగించండిపాటులు బడుచుండి సత్యవాగ్ధనుడై,మో
మోటము లేకయె కలిలో
మాటకు నిలబడని వాడె మాన్యుడు జగతిన్.
లక్ష్మీ నరసింహం గారి పూరణ....
రిప్లయితొలగించండిచేటొనరించెడి వారలు
నాటకమాడెద రటుయిటు నైపుణ్యముతో
చాటుగ చెప్పెడు చెప్పుడు
మాటకు నిలబడనివాడే మాన్యుడు జగతిన్.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కమనీయం గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
లక్ష్మీ నరసింహం గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
ఘాటైన భాషణలతో
రిప్లయితొలగించండిదీటుగ పోట్లాడి తెలుగు దేశము నేతై
వోటరు దండుల కిచ్చిన
మాటకు నిలబడనివాఁడె మాన్యుఁడు జగతిన్
దీటుగ నెన్నిక లందున
రిప్లయితొలగించండిపోటుల నన్నిటికి నోర్చు పోరాటమునన్
వోటరు మూకల కిచ్చిన
మాటకు నిలబడనివాఁడె మాన్యుఁడు జగతిన్