తెలుగు వెలుగులు దశ దిశల్ - తేజరిల్లె తెలుసు కొనుమింక సోదరా - తెలుగు వెలుగు తెలివి తప్పక మసలుకో - తెలుగు నేల తెల్ల వారిని తరిమిన - తెలుగు గడ్డ తెల్ల వారి భాషను నేర్వ - నల్ల గాదు తెలుగు , మనతల్లి భాషని - తెలిసి, పెంచు తెలుగు భాషాభి మానము !- తొలగ వలెను తల్లి భాషను నిరసించు - ప్రల్లదనము అన్య భాషల పట్ల నీ - యసుర ప్రేమ ! _______________________________ నల్ల = తప్పు నిరసించు = అనాదరము ప్రల్లదనము =గర్వము , తిట్టు
భారతీమాతృ హృత్పద్మ సౌరభ రస ....ప్రాశస్త్య వైభవ భరిత భాష శబ్దార్థ వైచిత్ర్య సంభృతాలంకార ....సాహిత్య కలిత సువర్ణ భాష వేదవేదాంతాది విజ్ఞాన సర్వస్వ ....పరమార్థ రుచిర సంపన్న భాష సంగీత సత్కళా సముచిత రాగ వై ....విధ్యానుకూల ప్రవిమల భాష విశ్వభాషల మేటియై వెలుగు భాష సకల సౌభాగ్యమయ సుప్రసన్న భాష అద్వితీయమై యమలమై యలరు భాష అమృతతుల్యమౌ మధురమౌ ఆంధ్ర భాష
తెలుగు భాషాభిమానము తేజరిల్లు నిత్యమై నిర్మలంబయి నెమ్మనముల; తెలుగు భాషాభిమానము తొలగవలెను నలగవలెనన్న దుర్బుద్ధి తొలగవలెను
శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ, గురువుగారి సవరణలకు ధన్యవాదములు గురువు గారికి మరియు కవి మిత్రులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
తెలుగులో మాతనాడిన, శిక్షలు వేయు పంతుళ్ళు ఈ విధముగా జెప్పు ----- తెగులు బట్టి నట్టి తెలుగు బాషాభి మా నము తొలగ వలెను మనము తెలుగు తె లుగని గొంతు చించి రోగివలె నరచి బావినందు గప్ప గావ వలదు ------ తెలుగును తెంగ్లీసు జేసిన వారు బల్కు ---- లోక మొక్క కుగ్రామము రూక లున్న పనికి రాదు తేట తెనుగు "పబ్బు"లందు తెల్ల వారి బాషను బల్కు నల్ల వార్కి తెలుగు బాషాభి మానము తొలగ వలెను.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, నేమాని ప్రశంసను పొందిన మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘మాండలీక’ అన్నచోట ‘మాండలికపు’ అంటే బాగుంటుందని గుండు మధుసూదన్ గారి సూచన. * వసంత కిశోర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. `భాష + అని’ అన్నప్పుడు సంధి లేదు. ‘తల్లి భాషగా తెలిసి’ అందాం. * చంద్రశేఖర్ గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘భారతీయు’లందరికీ తెలుగు భాషాభిమానమా? తెలుగువారికి చాలదూ? ‘భ్రాతలార! మీ హృదయాల పదిల మగుత’ అందాం. * సహదేవుడు గారూ, ధన్యవాదాలు. మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘భాషల విజ్ఞాన’లో మధ్య అరసున్నా ఎందుకు? మీరు లేఖిని వాడుతున్నట్లయితే అరసున్నా కోసం ఁ టైప్ చేయండి. బరహా అయితే ~ం టైప్ చేయండి. * పండిత నేమాని వారూ, తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని గొప్పగా వర్ణించారు. అద్భుతమైన పూరణ. అభినందనలు, ధన్యవాదాలు. * ఊకదంపుడు గారూ, ‘పుట్టినప్పుడు వచ్చిన భాష పుడకలతోనే పోతుంది’ అంటారు. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. * సహదేవుడు గారూ, మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు. మొదటి పూరణ చివరి పాదాన్ని ‘బావిలోని గప్ప గా వలవదు’ అందాం.
అమ్మ మాట తెలుగు నాన్న యడుగు తెలుగు గుండె సవ్వడులు తెలుగు గూడు తెలుగు పొగడ కులకాంత కుంకుమ బొట్టు తెలుగు జీవధార తెలుగు మేటి చేవ తెలుగు ఊరి బడి గుడి గంటల హోరు తెలుగు పంటకాల్వల గలగల పరుగు తెలుగు ఉగ్గుపాలు తెలుగు కన్నె సిగ్గు తెలుగు బుజ్జి పాపాయి ముద్దుల బుగ్గ తెలుగు హాయి తెలుగు పున్నమినాటి రేయి తెలుగు తేనె తెలుగు తొలకరులు తెలు గెరుంగ ఎంకిపాట తెలుగు జొన్నకంకి తెలుగు పల్లెపదము తెలుగు పైరుపచ్చ తెలుగు జాతి తెలుగు చెరుగని మా ఖ్యాతి తెలుగు బ్రతుకు తెలుగు భుజియించు మెతుకు తెలుగు నేను తెలుగు నా వారలు తెలు గికేల తెలుగు భాషాభిమానము తొలగవలెను?
నిన్నటి చర్చలో ( ప్రమలు అనే పదము గురించి ) ఈ క్రింది లింక్ చూడమని మనవి. నేను చెప్పిన అర్థాలు కాకపోయినా దాదాపుగ అవే అర్థాన్ని సూచిస్తున్నయి. కానీ ప్రమలు అనే పదాన్ని ప్రమలంబయ్యెడు అని వ్రాయవచ్చా లేదా అనే అనుమానము కలుగుతోంది నాకిప్పుడు. సందేహ నివృత్తి చేయమని మనవి.
http://andhrabharati.com/dictionary/index.php
గురువర్యులకు నమస్సులు. శ్రీ మధుసూదన్ గారి సూచన భేషుగ్గా ఉన్నది. ధన్యవాదాలు.
గురువుగారికి ప్రణామములు.ధన్యవాదములు. భాషలలో విఙ్ఞాన ము అన్న భావం కోసం అలా అర సున్నా వాడాను. అరసున్నా టైపుచేయడం గురించి తెలియజేసినందులకు కృతఙ్ఞతలు. తమరు పొరపాటున మిత్రులు శ్రీవరప్రసాద్ గారి పద్యాన్ని నాదిగా భావించినట్లున్నారు.స్వస్తి.
మాదిమీదను ప్రాంతాభిమానమెసఁగి
రిప్లయితొలగించండిచిన్నపిల్లలవోలె పేచీలతోటి
మత్సరమ్ముల కలిగించు మాండలీక
తెలుఁగు భాషాభిమానము తొలఁగవలయు.
రాయలసీమ యాస, తెలంగాణ యాస, అంధ్ర యాస అంటూ మనలో మనమే పోట్లాడుకొంటూ తెలుగు జాతికి మనమే తూట్లు పెట్టే కుసంస్కృతి పోవాలని అభిలషిస్తూ.....
శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు వెంటనే స్పందించి చక్కని భావముతో ముచ్చటగొలిపే తేటగీతిని వ్రాసేరు. శుభాభినందనలు. స్వస్తి.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_______________________________
తెలుగు వెలుగులు దశ దిశల్ - తేజరిల్లె
తెలుసు కొనుమింక సోదరా - తెలుగు వెలుగు
తెలివి తప్పక మసలుకో - తెలుగు నేల
తెల్ల వారిని తరిమిన - తెలుగు గడ్డ
తెల్ల వారి భాషను నేర్వ - నల్ల గాదు
తెలుగు , మనతల్లి భాషని - తెలిసి, పెంచు
తెలుగు భాషాభి మానము !- తొలగ వలెను
తల్లి భాషను నిరసించు - ప్రల్లదనము
అన్య భాషల పట్ల నీ - యసుర ప్రేమ !
_______________________________
నల్ల = తప్పు
నిరసించు = అనాదరము
ప్రల్లదనము =గర్వము , తిట్టు
దేశదేశాంతరములందు తెలుగు వెలుగు
రిప్లయితొలగించండిచిమ్ము తెలుగుతేజములార! అమ్మవోలె
ప్రేమనింపు తెల్గు మనకు పెరగవలెను
తెలుఁగు భాషాభిమానము; తొలఁగవలెను
ద్వేషభావము తెలుగోడ వెలుగుమింక!
రిప్లయితొలగించండిభార తీ యుడ ! హృదయాన పదిల ప ఱు చు
తెలుగు భాషాభి మానము, తొలగ వలెను
ఆంగ్ల భాషాభి మానము నాంధ్ర ప్రజకు
తేనె లొ లి కె డి భాషయె తెనుగు భాష .
కవి మిత్రులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిగుండు మధుసూదన్ గారి పూరణ....
రిప్లయితొలగించండిమాతృ భాషయు, జనయిత్రి మనకు నెపుడు
స్వర్గమునకన్న మిన్నయ! వదల వలదు
తెలుఁగు భాషాభిమానము! తొలఁగ వలయు
నాంగ్ల భాషపై మోజంత, యాంధ్రులార!
భారతీమాతృ హృత్పద్మ సౌరభ రస
రిప్లయితొలగించండి....ప్రాశస్త్య వైభవ భరిత భాష
శబ్దార్థ వైచిత్ర్య సంభృతాలంకార
....సాహిత్య కలిత సువర్ణ భాష
వేదవేదాంతాది విజ్ఞాన సర్వస్వ
....పరమార్థ రుచిర సంపన్న భాష
సంగీత సత్కళా సముచిత రాగ వై
....విధ్యానుకూల ప్రవిమల భాష
విశ్వభాషల మేటియై వెలుగు భాష
సకల సౌభాగ్యమయ సుప్రసన్న భాష
అద్వితీయమై యమలమై యలరు భాష
అమృతతుల్యమౌ మధురమౌ ఆంధ్ర భాష
తెలుగు భాషాభిమానము తేజరిల్లు
నిత్యమై నిర్మలంబయి నెమ్మనముల;
తెలుగు భాషాభిమానము తొలగవలెను
నలగవలెనన్న దుర్బుద్ధి తొలగవలెను
ఉదర గోళమునందంటుకున్న భాష
రిప్లయితొలగించండిపాలతోఁబెంపునొందిన భాష, గాన
ప్రాణము కళేబరము విడివడు పిదపయె
తెలుగు భాషాభిమానము తొలగవలెను.
శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,
రిప్లయితొలగించండిగురువుగారి సవరణలకు ధన్యవాదములు
గురువు గారికి మరియు కవి మిత్రులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
తెలుగులో మాతనాడిన, శిక్షలు వేయు పంతుళ్ళు ఈ విధముగా జెప్పు
-----
తెగులు బట్టి నట్టి తెలుగు బాషాభి మా
నము తొలగ వలెను మనము తెలుగు తె
లుగని గొంతు చించి రోగివలె నరచి
బావినందు గప్ప గావ వలదు
------
తెలుగును తెంగ్లీసు జేసిన వారు బల్కు
----
లోక మొక్క కుగ్రామము రూక లున్న
పనికి రాదు తేట తెనుగు "పబ్బు"లందు
తెల్ల వారి బాషను బల్కు నల్ల వార్కి
తెలుగు బాషాభి మానము తొలగ వలెను.
అన్య భాషల( విజ్ఞాన మంత నుండ
రిప్లయితొలగించండిభాష లెన్నైన నేర్చిన( బండితునకు
మాతృ భాషాభి వృద్ధిని మఱచి, యేల
తెలుగు భాషాభిమానము తొలగ వలయు?
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండినేమాని ప్రశంసను పొందిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘మాండలీక’ అన్నచోట ‘మాండలికపు’ అంటే బాగుంటుందని గుండు మధుసూదన్ గారి సూచన.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
`భాష + అని’ అన్నప్పుడు సంధి లేదు. ‘తల్లి భాషగా తెలిసి’ అందాం.
*
చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘భారతీయు’లందరికీ తెలుగు భాషాభిమానమా? తెలుగువారికి చాలదూ? ‘భ్రాతలార! మీ హృదయాల పదిల మగుత’ అందాం.
*
సహదేవుడు గారూ,
ధన్యవాదాలు.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘భాషల విజ్ఞాన’లో మధ్య అరసున్నా ఎందుకు?
మీరు లేఖిని వాడుతున్నట్లయితే అరసున్నా కోసం ఁ టైప్ చేయండి.
బరహా అయితే ~ం టైప్ చేయండి.
*
పండిత నేమాని వారూ,
తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని గొప్పగా వర్ణించారు. అద్భుతమైన పూరణ. అభినందనలు, ధన్యవాదాలు.
*
ఊకదంపుడు గారూ,
‘పుట్టినప్పుడు వచ్చిన భాష పుడకలతోనే పోతుంది’ అంటారు. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.
మొదటి పూరణ చివరి పాదాన్ని ‘బావిలోని గప్ప గా వలవదు’ అందాం.
లక్ష్మీ నరసింహం గారి పూరణ....
రిప్లయితొలగించండిఅమ్మ మాట తెలుగు నాన్న యడుగు తెలుగు
గుండె సవ్వడులు తెలుగు గూడు తెలుగు
పొగడ కులకాంత కుంకుమ బొట్టు తెలుగు
జీవధార తెలుగు మేటి చేవ తెలుగు
ఊరి బడి గుడి గంటల హోరు తెలుగు
పంటకాల్వల గలగల పరుగు తెలుగు
ఉగ్గుపాలు తెలుగు కన్నె సిగ్గు తెలుగు
బుజ్జి పాపాయి ముద్దుల బుగ్గ తెలుగు
హాయి తెలుగు పున్నమినాటి రేయి తెలుగు
తేనె తెలుగు తొలకరులు తెలు గెరుంగ
ఎంకిపాట తెలుగు జొన్నకంకి తెలుగు
పల్లెపదము తెలుగు పైరుపచ్చ తెలుగు
జాతి తెలుగు చెరుగని మా ఖ్యాతి తెలుగు
బ్రతుకు తెలుగు భుజియించు మెతుకు తెలుగు
నేను తెలుగు నా వారలు తెలు గికేల
తెలుగు భాషాభిమానము తొలగవలెను?
లక్ష్మీ నరసింహం గారూ,
రిప్లయితొలగించండితెలుగుదనం మూర్తీభవించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
నేమాని గురువర్యా,
రిప్లయితొలగించండిధన్యోస్మి.
నిన్నటి చర్చలో ( ప్రమలు అనే పదము గురించి ) ఈ క్రింది లింక్ చూడమని మనవి. నేను చెప్పిన అర్థాలు కాకపోయినా దాదాపుగ అవే అర్థాన్ని సూచిస్తున్నయి. కానీ ప్రమలు అనే పదాన్ని ప్రమలంబయ్యెడు అని వ్రాయవచ్చా లేదా అనే అనుమానము కలుగుతోంది నాకిప్పుడు. సందేహ నివృత్తి చేయమని మనవి.
http://andhrabharati.com/dictionary/index.php
గురువర్యులకు నమస్సులు. శ్రీ మధుసూదన్ గారి సూచన భేషుగ్గా ఉన్నది. ధన్యవాదాలు.
గురువుగారూ,
రిప్లయితొలగించండిలింక్ copy pase కావడము లేదు. మన్నించాలి.
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిఅరసున్నా కోసం లేఖినిలో @m టైప్ చేయండి. బరహాలో ~M టైప్ చేయండి...
అయ్యా సంపత్ కుమార శాస్త్రి గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
"ప్రమలు" అనే పదము గురించి నిర్ణయమును మీకే వదలి వేయుచున్నాము. స్వస్తి.
తెలుగు లెస్సని బలికిరి వెలిగె నాడు
రిప్లయితొలగించండితెలుఁగు భాషాభిమానము, తొలఁగవలయు
తెలుగు లెస్సని (less ) బలికెడు తేలికైన
భావ జాలము యాంగ్లపు పంచ విడుము.
గురువుగారికి ప్రణామములు.ధన్యవాదములు. భాషలలో విఙ్ఞాన ము అన్న భావం కోసం అలా అర సున్నా వాడాను. అరసున్నా టైపుచేయడం గురించి తెలియజేసినందులకు కృతఙ్ఞతలు. తమరు పొరపాటున మిత్రులు శ్రీవరప్రసాద్ గారి పద్యాన్ని నాదిగా భావించినట్లున్నారు.స్వస్తి.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండితీయనౌ మన తెలుగున సోయగమ్ము
తెలిసి తెలుపంగ , వలయు వర్ధిల్లవలెను
తెలుగు భాషాభిమానమ్ము ; తొలగవలయు
భావదాస్యమ్ము ,నింగ్లీషు బాస మోజు.