1, ఆగస్టు 2012, బుధవారం

సమస్యాపూరణం - 780 (తల్లి మగఁడు నాకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
తల్లి మగఁడు నాకు తమ్ముఁ డును.

15 కామెంట్‌లు:

  1. చిన్న నాటి చెలి చెప్పెద నిటు చూడు
    చిత్ర పటము నందు చేరినాము
    నన్ను గలిపి చూడ నలుగురు వరుసకు
    తల్లి మగఁడు నాకు తమ్ముఁ డగును.

    రిప్లయితొలగించండి
  2. చిన్న నాటి చెలి చెప్పెద నిటు చూడు
    చిత్ర పటము నందు చేరినాము
    నన్ను గలిపి చూడ నలుగురు వరుసగ
    తల్లి, మగఁడు, నాకు తమ్ముఁ డగును.

    రిప్లయితొలగించండి
  3. ఐదుగురు మరదళ్ళ కనుఁగు బావయ్యను
    చూడ నా కొమరిత ఈడుదాయె
    నాఖరిదిక వరుస లడుగంగ నాచిట్టి
    తల్లి మగఁడు నాకు తమ్ముఁ డగును!

    రిప్లయితొలగించండి
  4. శ్రీ హనుమచ్చాస్త్రిగారు,

    మొదటి పాదములో 3వ గణము సరిపోలేదు. చెలియ అని ఉండాలనుకుంటాను.

    మనతెలుగు గారూ,

    ఐ అనునది గురువండీ. గణము సరిపోదు.

    రిప్లయితొలగించండి
  5. శాస్త్రి గారూ ఐతే ఇంకో మరదలిని కలుపుకోండి:-)
    ఆర్గురు మరదళ్ళ కనుఁగు బావయ్యను
    చూడ నా కొమరిత ఈడుదాయె
    నాఖరిదిక వరుస లడుగంగ నాచిట్టి
    తల్లి మగఁడు నాకు తమ్ముఁ డగును!

    రిప్లయితొలగించండి
  6. నమ్ముడయ్య మీ రు నాన్న యగును గద
    తల్లి మగడు నాకు , తమ్ము డగును
    తోడ బుట్టి నతడు తొలిసారి మలిసారి
    బంధు రికము లిట్లు బంధ మగును

    రిప్లయితొలగించండి
  7. ఈమె పైడితల్లి మా మామకూతురు
    చదువులందు వాణి సద్గుణాఢ్య
    ప్రేమ మెరయ నితని పెండ్లాడె నీ పైడి
    తల్లి మగడు నాకు తమ్ముడగును

    రిప్లయితొలగించండి
  8. వసతి గృహపు చదువులందు వరుసల మర
    చితివొ, "అంకుల"ని పిలువ చెల్లుననుచు
    భ్రమసితొవొగాని, సుకుమార! తమరి పెద్ద
    తల్లి మగఁడు నాకు తమ్ముఁ డగును.

    మూడవపాదం యతి చెల్లిందో లేదో అనుమానమండీ

    రిప్లయితొలగించండి
  9. పాఠ శాల నుండి పై చదువు వరకు
    కలసి మెలసి చదివి కలయ దిరిగి
    చెలిమి జెసి తుదకు చిలిపియై దుర్గమ్మ
    తల్లి మగఁ డు నాకు తమ్ముఁ డగును !

    రిప్లయితొలగించండి
  10. నీదు యల్లుడెవరు?నిర్మలా యన రాజి
    మనువుకు నిను పిలువ మరువ, తప్పు
    లెంచ వలదె ననుచు నిట్లనె నాచిట్టి
    తల్లిమగడునాకుతమ్ముడగును !

    రిప్లయితొలగించండి
  11. కన్నతల్లి యనుచు గన్నకూతురు బిల్తు
    శుభముహూర్త మందు సోదరునకు
    తనర బెండ్లి సేయ దానిచే నాకన్న
    తల్లి మగడు నాకు తమ్ముడగును.

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు నమస్కారం.
    లోపం మానిటర్ లోనే ఉందు. అక్షరాలు అస్పష్టంగా ముద్దముద్దగా కనిపిస్తూ మేరేం వ్రాసారో టేళీయకుండా ఉంది. మరొ రెండు రొజులు ఈ అవస్థ తప్పదు. దినిని బాగు చేయించాలి. అంతదాకా దయచేసి పరస్పరం గునదొష విచారణ చేయవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  13. సంపత్ కుమార్ గారూ! ధన్యవాదములు. నిజమే అది చెలియ అనే వుండాలి. త్వరపాటు లో టైపాటు...

    చిన్న నాటి చెలియ చెప్పెద నిటు చూడు
    చిత్ర పటము నందు చేరినాము
    నన్ను గలిపి చూడ నలుగురు వరుసగ
    తల్లి, మగఁడు, నాకు తమ్ముఁ డగును.

    రిప్లయితొలగించండి
  14. చిట్టితల్లి నాకు చిననాటి స్నేహితు
    రాలు పెండ్లి జరిగె మేలుగాను
    వరస నరసి జూడ బంధువే యగు చిట్టి
    తల్లిమగఁడు నాకు తమ్ముఁ డగును.

    రిప్లయితొలగించండి