21, ఆగస్టు 2012, మంగళవారం

పద్య రచన - 88


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. మా శ్రీమదధ్యాత్మరామాయణమునుండి:

    శ్రీమదినాన్వయ క్షీరసాగర చంద్ర!
    ధారుణిజా హృచ్చకోరచంద్ర!
    వాయునందనముఖ్య భక్త తారాచంద్ర!
    అమృతాశనసమూహ కుముదచంద్ర!
    రామ నామామృత రసిక శారదచంద్ర!
    సంసార తాపోపశమనచంద్ర!
    కువలయానంద వైభవ వివర్ధక చంద్ర!
    వైరివీరానీక పద్మచంద్ర!
    రక్షవీవె కృపాచంద్ర! రాజచంద్ర!
    నతులొనర్తు యశశ్చంద్ర! జ్ఞానచంద్ర!
    విమలగుణ చంద్ర! నిష్కళంకముఖ చంద్ర!
    రామచంద్ర! సర్వకళాభిరామచంద్ర!

    రా మార్తాండ కులాబ్ధి శీతకిరణా! రా మానవేంద్రాగ్రణీ!
    రా మాయామయ విశ్వ నాటక మహారంగ ప్రధానేశ్వరా!
    రా మా మానస సారసోదయ రవీ! రా మాన్య భావోజ్జ్వలా!
    రా మా దైవశిఖామణీ! రఘువరా! రా రమ్ము రామప్రభూ!

    రిప్లయితొలగించండి
  2. దశరథ సుతుడై బంటుగ
    దశబాహుని పంచ ముఖుని దరిజేరిచి యా
    దశకంఠుని పరిమారిచి
    దశదిశలను ఖ్యాతి గనిన త్రాతకు జేజే !

    రిప్లయితొలగించండి
  3. రాముని నామమున్ పలుక రక్తిని వీడుచు, భక్తితోడ నా
    రాముని సేవలో, తనువు రాలగ జేయ వరమ్ముకోరగా,
    రాముని రూపమున్ మదిని రమ్యముగా గని వేడినంతనే,
    రాముని కంఠమే పిలిచె రమ్మని, బిడ్డను చెంతజేర్చెనే.

    రిప్లయితొలగించండి

  4. ఇల డొంకరాయి పురమున
    వెలసిన యా రామ చంద్రు వేడుక మీ రన్
    కొలిచిన నిచ్చును శుభములు
    కొలువగ వే రండు మీరు కొలుతును నేనున్ .

    రిప్లయితొలగించండి
  5. గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ
    ----
    పుడమి భరమునెల్ల నుడుపగా వచ్చిన
    వామనుడవు నీవు భక్తపాల!
    మర్మములను దెల్పు కూర్మమూర్తివి భవ
    వార్ధి దాటగజేయు భక్తపాల!
    సాధు జనుల కెల్ల సద్యోగములు గూర్చు
    పరమ గురుడవీవు భక్తపాల
    దేవదానవులకు మావటి వీవు ద్వేషమ్ము
    బాపు చుండు సకల భక్తపాల
    వైరి తతులకేని కూరిమి మీరగ
    ముక్తి పదము నిచ్చు భక్తపాల
    దురితములను దీర్చి ధర ప్రాణికోటికి
    పరమ సుఖము గూర్చు భక్తపాల


    వైభవాస్పదమగు వైకుంఠనగరిలో
    సేవజేయు సిరికి చెప్పకుండ
    శంఖ చక్ర గదల వంకజూడక పరు
    వెత్తి మకరి నోట వెతల నొందు
    కరి మొరలను విన్న కంజనేత్రుడు నిజ
    గృహము విడిచి సాధు బృంద రక్ష
    కుడు ముముక్షువులను వడివడిగా గాచు
    భద్ర గుణ పయోధి భవ్యమూర్తి
    ఆర్త రక్షకుడు మురారి దశావతా
    రములు దాల్చెనల ధరాతలమున
    రాక్షస తతి గూల్చి రక్షించు శ్రీహరి
    నామ మంత్ర మహిమ నరుల నెల్ల

    రిప్లయితొలగించండి

  6. గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,
    గురువు గారు మీరు ఒకానొక దినమున సవరించిన సీస పద్యమును బ్లాగులో పెట్టుచున్నాను
    --------
    రవికుల దశరథ రాజసుతునిగ జ
    న్మించె విష్ణువు ముని జనగణము
    రక్షింప ధరణిపై రాక్షసులను జంపి
    తపసి యాగము గాచి తమముదీర్చి
    శివుని విల్లు విరచి సీతనుబెండ్లాడి
    దారతోడ నయోధ్య జేరి, తండ్రి
    మాటకై యడవికి మరలెను తా సతి
    తమ్మునితోగూడి త్వరితగతిని
    మారీచుడు మృగమై మాయజేయగ రావ
    ణాసురునకు జిక్కె నాడు సీత
    కిష్కింధ జేరి సుగ్రీవ హనుమ జాంబ
    వంతుల తోగూడి వాలిని వధి
    యించి రాజ్య మతని కిచ్చి రాజుగ జేసె;
    లంకిణి జంపి, జలధిని దాటి
    గనుగొనె సీతను కపిరాజు వనమందు
    నంగుళీయకమును నమ్మకిచ్చి

    వాయు నందన దెచ్చెన వార్తలు విని
    వారధిని గట్టె, కడలిపై వానరులు స
    కాలమున నటు లంకకు కాలు మోపి
    రావణాదుల గూల్చిరి రణముజేసి

    రావణానుజు మన్నించి రాజ్యమిచ్చి
    పుష్పకవిమానమందున పురముజేరి
    రాజ్యమేలెను పురజనరంజకముగ
    రక్తి నాదర్శ పురుషుడై రాము డవని.

    రిప్లయితొలగించండి
  7. ఉత్సాహ:
    శ్రీహరీ యటంచు నిన్ను చేరి, నేను గొలిచెదన్,
    పాహి రామచంద్ర యనుచు, ఫలముకై నిరీక్షతో,
    దేహి యంటి, కాదనకుము, దివ్య బలమునివ్వు, ను
    త్సాహ పద్య రచన జేతు, ధన్య రీతి రాఘవా !

    రిప్లయితొలగించండి
  8. 1. అష్టాక్షరిమంత్రమునకుఁ
    శ్రేష్టపు పంచాక్షరినటుఁజేరిచి గూర్చన్
    గష్టాలఁదీర్చు నామము
    శిష్ఠుల కింపైన 'రామ' శివుడే మెచ్చెన్!

    2.రామ నామము ముమ్మారు ప్రేమఁబల్క
    వేయిమారులుపాడిన విలువ యనరె!
    ఆకు కూడ తిరిగె మూడు లోకములను
    రామ నామమ్ముధరియించి రమ్యముగను
    దివ్య నామమ్ము పాడగ తీపి మెండు!

    రిప్లయితొలగించండి
  9. దశరథ పుత్రుడై తాటకి బరిమార్చి
    ..........తపసి జన్నము గాచె ధర్మమూర్తి!
    శంభుని విల్ద్రుంచి జానకి చేబట్టి
    ...........గురుగౌరవము బెంచె కురు కృపాబ్ధి!
    తల్లికి వరమిడి తండ్రి దు:ఖింపగ
    ...........వనవాసమును జేసె నినకుల మణి!
    వానర సేనతో వారధి కట్టించి
    ...........రావణు ద్రుంచెను రామ మూర్తి!

    మానవునిగ ప్రవర్తించి మహిని రూపు
    దాల్చినిలచిన ధర్మమై తనరె నితడు
    రామ చంద్రుడు కోదండ రాఘవుండు
    శరణు వేడిన జనులకు సతము శుభము.

    రిప్లయితొలగించండి
  10. దశరధ తనయుడు రాముడు
    దశ కంఠుని తలలు గూల్చి దర్ప మడంచెన్ !
    యశమును బొందెను దశదిశ
    వశు డయ్యెను హనుమ భక్తి వాల్ల భ్యమునన్

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రామావతారము :

    01)
    _______________________________

    రక్కసుల యాట కట్టించి - చక్క బరచి
    రక్ష సేయగ జనులను - లచ్చిమగడు
    రత్నగర్భను జన్మించె - రఘుకులంబు
    రాముడను పేర దశరథు - రాజ్య మందు !
    రమ్య రమ్యాతి రమ్యము - రామ చరిత !

    రాతబిసి(రాజర్షి) కోర వెడలెను - రాముడపుడు
    రాజు నానతి యాగపు - రక్ష కొరకు !
    రక్కసుల పీచ మడగించె - చక్కజేసె !
    రాజశేఖరు ధనువును - రవ(ముక్క)లు జేసి
    రమణి సీతను పెండ్లాడె - రాగ మెగయ !
    రమ్య రమ్యాతి రమ్యము - రామ చరిత !

    రాజు గావింప భరతుని - రాజ్యమునకు
    రాణి కోరిక మేరకు - రాఘవుండు
    రాజ్య భోగమ్ము విడచి, వై - రాగి రూపు
    రమణి , సోదరు తోడుగా - సమజ(అడవి) మరిగె !
    రమ్య రమ్యాతి రమ్యము - రామ చరిత !

    రమణి సీతను మ్రుచ్చిల - రావణుండు
    రమణి వెదకుచు కదిలిన - రాముడపుడు
    రాజ(ఇంద్రుడు) కొమరుని(వాలి) వధియించి; - రాజు జేసె
    రవికుమారుని(సుగ్రీవుడు) కిష్కింధ - రాజ్యమునకు !
    రమ్య రమ్యాతి రమ్యము - రామ చరిత !

    రమణి జాడను కనిపెట్ట - రామబంటు
    రణము సేయగ వెడలెను - లంక పైకి !
    రావణాసురు వధియించి - రమణి బ్రోచె !
    రాజ్య పాలన గావించె - లలితముగను !
    రమ్య రమ్యాతి రమ్యము - రామ చరిత !
    రాము కంజలి ఘటించ - రండు ! రండు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని వారూ,
    రవికులాబ్ధిచంద్రుడైన రామచంద్రుని గురించిన మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    భక్తజన త్రాత రామునిపై మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘రామనామాన్ని పలికే రక్తిని వీడుచు’...? ‘వీడక’ అని ఉండాలేమో?
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ఇంతకీ ఈ ‘డొంకరాయి రామచంద్ర క్షేత్రం’ ఎక్కడుంది?
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.
    మొదటి విడత పద్యాలు నాలుగు రోజుల తరువాత దశవతారముల చిత్రం క్రింద ప్రకటిస్తే బాగుంటాయి.
    మొదటి సీసంలో ‘మావటి వీవు ద్వేషమ్ము’ ఆన్నపుడు గణదోషం. ‘మావటివై పగ’ అంటే సరి!
    ‘వాయు నందన దెచ్చెన వార్తలు’ అన్నదాన్ని ‘వాయుపుత్రుడు దెచ్చిన వార్తలు’ అని సవరిద్దాం.
    *
    వామన కుమార్ గారూ,
    మీరు ఉత్సాహంగా వెలిబుచ్చిన ‘సకామభక్తి’ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    రామ నామ మహిమను చక్కగా తెలిపారు. పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    రమ్యాతి రమ్యములైన పద్యాలలో రామచరితను చెప్పారు. చాలా బాగున్నవి. అభినందనలు.
    ‘రాముకంజలి’ అనరాదు కదా. ‘రామునకు’ అని ఉండాలి. ‘ఘటించ’ అన్నప్పుడు గణదోషం... ‘రామునకు నంజలి ఘటించ’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  13. dear sankarayya garu! namaste.,
    Donkarayi is in the middle of the
    Seeleru and bhadrachalam.District is East godavari.Agency area. i worked as a grade one telugu pandit in Donkarai high school.

    రిప్లయితొలగించండి
  14. ధన్యవాదములు శంకరయ్య గారూ.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ వసంత కిశోర్ గారి రామావతారం కడు హృద్యం గాను, రమ్యం గాను ఉన్నది. నాకు ఈ బ్లాగులో పాఠాలు చెప్పిన మా గురువు గారు శ్రీ వసంత కిశోర్ గారికి శత శత నమో వాకములు.

    రిప్లయితొలగించండి
  16. వామనకుమారా ! ధన్యవాదములు !
    మీ ఉత్సాహ కూడా చాలా ఉత్సాహముగా నున్నది !
    పద్య రచన పట్టు బడినట్టే !

    రిప్లయితొలగించండి