చంద్రశేఖర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ సీసపద్యం ‘మస్తు’ బాగుంది. అభినందనలు. ‘దీర్ఘ నిద్దుర బొందెగా తెలిసి తెలిసి’ అన్నపాదాన్ని ‘దీర్ఘనిద్ర పొందెనుగదా తెలిసి తెలిసి’ అందాం. * పండిత నేమాని వారూ, కుంభకర్ణుడికి మేలుకొలుపుగా మీ పద్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, నిజమే! అద్భుతకథలను పిల్లలు ఇష్టపడతారు. కుంభకర్ణుని ఆకారం, అలవాట్లు, నిద్ర అన్నీ పిల్లలకు ఆసక్తిని కలిగించేవే... చక్కని పద్యం. అభినందనలు. * వసంత కిశో గారూ, మీకు కుంభకర్ణుడు కప్పలాగా కనిపించాడా? బాగు బాగు. మంచి పద్యం. అభినందనలు. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. ‘రావణుఁబంపెన్’ అని కాకుండా ‘రావణుఁ డంపెన్’ అనాలనుకుంటాను. * జిగురు సత్యనారాయణ గారూ, భారతీయునికి మీ ప్రబోధము చాలా బాగుంది. అభినందనలు. ‘దొంగలేలు చుండిరి’ అని ఉండాలి. ‘భద్రత + ఒసగని’ అన్నప్పుడు సంధి లేదు. ‘భద్రత నొసగనట్టి ప్రభుత’ అందాం.
కాయమా అది కల్ల గాదు కొండగు గాని .........నిద్దురా అది దీర్ఘ నిద్ర కాని బల్లెము లీటెలు పుల్లలాయెను వాన్కి ..........మదగజ మాయెను మశకమెన్న భేరీ నినాదమ్ము పిల్లి కూతాయెను ..........సేనానివహములు చీమలాయె గురక శబ్దము వార్ధి ఘోషగా మారెను ..........శ్వాస మారెను గాలి వానవోలె
రావణుని పంపునను వచ్చి రాక్షసాళి కుంభ కర్ణుని లేపు సంరంభ మిద్ది తప్పదిక లేవకను వాని ముప్పు డాసె లంక కిది చేటు కాలము శంక లేదు.
***** దర్దురము : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు n. 1. a frog; 2. a cloud; 3. a kind of musical instrument; 4. ancient name of a mountain in S. India close to the Malaya mountain.
***** దర్దురము = కప్ప , మేఘము
శంకరార్యా ! ధన్యవాదములు !
కుంభకర్ణుడు కప్పవలె కాదు ; మేఘము వలె (నల్లగా ) నున్నాడని నా భావం !
పనుల ఒత్తిడి వలన కొందరి పద్యాలను వ్యాఖ్యానించడం ఆలస్యమయింది. మన్నించండి... * మిస్సన్న గారూ, మీ సీసపద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * కమనీయం గారూ, మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు. * జిగురు సత్యనారాయణ గారూ, మీ ప్రబోధ పద్యాల కొనసాగింపు బాగుంది. అభినందనలు. ‘మైల, మయిల’ ఉన్నాయి. ‘మయల’ లేదు. అది బహుశా టైపాటు కావచ్చు. ‘శిశువు లసువులు బాసిరి’ అనండి. ‘తర్కపు + ఆలోచన’ తర్కపు టాలోచన అవుతుంది. ‘తర్కయోచన లవి నేడు...’ అందాం. * వసంత కిశోర్ గారూ, నేను కేవలం రూఢ్యర్థమే స్వీకరించాను. వివరణకు ధన్యవాదాలు.
కుండ చెవుల జోదు బండనిదుర పోవు
రిప్లయితొలగించండికొట్టి లేప వలెను జట్టు గాను
మేటి రణముఁ బోలు మేలుకొలుపతని
నిద్రలోన వలయు నింత మనకు!
ఏన్గుల రప్పించి యెక్కించి తొక్కించె
రిప్లయితొలగించండిఈటెల తో గ్రుచ్చె నిట్లు నట్లు
భేరి శబ్దము కర్ణ భేరులు పగులంగ
మ్రోగించె మ్రోగించె ముక్కు వద్ద
మద్య మాంస ములను మస్తు గా వేయించి
ఘుమ ఘుమలను జూపె గుప్పు మనగ
పర్వత కాయమ్ము పైకెక్కి కొందరు
వివిధ క్రియల జేసి విసిగి పోయె
నెట్ట కేలకు నిద్దుర నెటులొ వీడి
కునికి పాట్లను విదిలించి కుంభ కర్ణు
డన్న యానతి మీదనా యనికి సాగి
దీర్ఘ నిద్దుర బొందెగా తెలిసి తెలిసి
రాక్షస నాయకా! లంకేశ సోదరా!
రిప్లయితొలగించండి....కుంభకర్ణా! మేలుకొమ్ము స్వామి!
అచలాభ విగ్రహా! అమర భయంకరా!
....కుంభకర్ణా! మేలుకొమ్ము స్వామి!
అతి భోజనప్రియా! అమిత విక్రమశాలి!
....కుంభకర్ణా! మేలుకొమ్ము స్వామి!
నిత్య నిద్రాలోల! నిరుపమ గుణధీర!
....కుంభకర్ణా! మేలుకొమ్ము స్వామి!
ముట్టడించెను కోతుల మూకలెన్నొ
భీకరాహవమున వేగ విక్రమించి
రిపుల నెల్లర వడి సంహరింప వలెను
కుంభకర్ణాసురా! మేలుకొమ్ము స్వామి!
కుంభకర్ణుని నిద్రను కోరి వినుట
రిప్లయితొలగించండిపిల్ల వారలకెల్లను ప్రీతి కాదె?
కల్ల కాదిది నిజమగు,కలియుగమున
నిట్టి వింతలు లేవంచు నెంచి చూడ.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
కుంభకర్ణుడు :
01)
____________________________________
వ్యర్థము లాయె కోరికలు - వానికి నయ్యెడ మాట తూలుటన్
నిర్దయ కోరబోయి , పెను - నిద్రను గోరెను బ్రహ్మదేవునిన్ !
నిర్దయ బూన రాము డని; - నీల్గెను దారుణ బాణ వృష్టిచే
దర్దుర రూపువాడు , ఘన - దానవ ముఖ్యుడు, కుంభకర్ణుడే !
____________________________________
రిప్లయితొలగించండికుంభ కర్ణుని నిద్రయు , కునుకు పాట్లు
కలుగు మనుజుని వెంటాడు పలు ని డుములు
కుంభ కర్ణుడ ! నిన్నిదె గోరు చుంటి
నిదుర లెమ్మిక యుదయాన నేటి నుండి .
అనినారాముడు లక్ష్మణుల్ కపులు ధైర్యాధిక్యులై రాక్షసా
రిప్లయితొలగించండివని భేధించ హతాశుడయ్యెను భవత్భ్రాతుండు, నైరాశ్యమూ
నెను సైన్యంబుల శక్తిసన్నగిలె, నిన్నేదిక్కుగానెంచి రా
వణుఁబంపెన్ మము నీ పరాక్రమములన్ వర్ణింపగా శక్యమే.
అనిన్ = యుద్ధమందున
నల్ల బొగ్గుకు సిగ్గయి తెల్లబోయె
రిప్లయితొలగించండికల్లలాడెడి నేతల కతలు తెలిసి
కొల్ల గొట్టుటలో మేలు తెల్లవారు
భారతీయుడా! మానుము బండ నిద్ర!! (1)
సాగు నీరు లేక పొలము మూగబోయె
త్రాగు నీరు లేక జనులు తల్లడిల్లె
రత్న గర్భఁ జూడగ నేడు రాళ్లదిబ్బ
భారతీయుడా! మానుము బండ నిద్ర!! (2)
దొంగలేలు చుండెను నేడు దొరల రీతి
నంగనాచి మాటలు పల్కి రంగు మార్చి
పంగ నామములను బెట్టి మ్రింగు చండె
భారతీయుడా! మానుము బండ నిద్ర!! (3)
సెల్లు పోను మెసేజీకి ఘొల్లుమనుచు
తరలి పోయె కొలువు వీడి భరత సుతులు
భద్రతొసగ లేని ప్రభుత భారమయ్యె
భారతీయుడా! మానుము బండ నిద్ర!! (4)
ప్రాంత భావంబు హెచ్చించి బంతులాడి
తూలనాడి ప్రజ మదిని తూట్లు పొడవ
అన్నదమ్ములు బందులకల్లలాడె
భారతీయుడా! మానుము బండ నిద్ర!! (5)
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ సీసపద్యం ‘మస్తు’ బాగుంది. అభినందనలు.
‘దీర్ఘ నిద్దుర బొందెగా తెలిసి తెలిసి’ అన్నపాదాన్ని ‘దీర్ఘనిద్ర పొందెనుగదా తెలిసి తెలిసి’ అందాం.
*
పండిత నేమాని వారూ,
కుంభకర్ణుడికి మేలుకొలుపుగా మీ పద్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
నిజమే! అద్భుతకథలను పిల్లలు ఇష్టపడతారు. కుంభకర్ణుని ఆకారం, అలవాట్లు, నిద్ర అన్నీ పిల్లలకు ఆసక్తిని కలిగించేవే... చక్కని పద్యం. అభినందనలు.
*
వసంత కిశో గారూ,
మీకు కుంభకర్ణుడు కప్పలాగా కనిపించాడా? బాగు బాగు. మంచి పద్యం. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
‘రావణుఁబంపెన్’ అని కాకుండా ‘రావణుఁ డంపెన్’ అనాలనుకుంటాను.
*
జిగురు సత్యనారాయణ గారూ,
భారతీయునికి మీ ప్రబోధము చాలా బాగుంది. అభినందనలు.
‘దొంగలేలు చుండిరి’ అని ఉండాలి.
‘భద్రత + ఒసగని’ అన్నప్పుడు సంధి లేదు. ‘భద్రత నొసగనట్టి ప్రభుత’ అందాం.
శంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిధన్యోస్మి గురువుగారూ,
రిప్లయితొలగించండిఅది రావణుఁడంపెన్ అనే ఉండాలి.
కాయమా అది కల్ల గాదు కొండగు గాని
రిప్లయితొలగించండి.........నిద్దురా అది దీర్ఘ నిద్ర కాని
బల్లెము లీటెలు పుల్లలాయెను వాన్కి
..........మదగజ మాయెను మశకమెన్న
భేరీ నినాదమ్ము పిల్లి కూతాయెను
..........సేనానివహములు చీమలాయె
గురక శబ్దము వార్ధి ఘోషగా మారెను
..........శ్వాస మారెను గాలి వానవోలె
రావణుని పంపునను వచ్చి రాక్షసాళి
కుంభ కర్ణుని లేపు సంరంభ మిద్ది
తప్పదిక లేవకను వాని ముప్పు డాసె
లంక కిది చేటు కాలము శంక లేదు.
రిప్లయితొలగించండిమదకరీంద్రములచే మట్టించి యత్నింప
కదలింప డొక్కింత కాలు నైన
పటహభేరీ ధ్వనుల్ బ్రద్దలుగా చెవుల్
మ్రోయింప నేమాత్రమును వినండు ,
పదునైన శూలముల్,బరువైన గదలతో
బాధింప నొకకొంత ప్రక్కకొదగు,
పలువిధమ్ములుగ లేపంగ బ్రయత్నించి,
యోచింప ,నొక దారి తోచె నపుడు,
రుచికరమ్ముగ నప్పుడే పచనమైన
మత్స్య మాంస రాశులు ,పలు మద్యములను,
ముక్కుపుటముల దరిజేర్చ రక్కసుండు
తెలివిగాంచి కన్నులొకింత తెరచి చూచె.
కుంభకర్ణా,ప్రభూ ,లెమ్ము కొంప కూలె
లంకకే చేటు కలిగెడి నింక నిద్ర
లేచి రణమున వైరుల పీచమడచ
గలవు నీవసుర నాయకా ,కావుమమ్ము.
వెలకు న్యాయమ్మునమ్మగ కలత చెందె
రిప్లయితొలగించండిన్యాయ దేవత తానేమి జేయ లేక!
నలుపు బట్టల వారల విలువ తరిగె
భారతీయుడా! మానుము బండ నిద్ర!! (6)
వెతలు బాపక నేతలు కతలు సెప్పి
మతపు చిచ్చును రగిలించు మనుజులందు
మతము హితమును గూర్పక మయల పడెను
భారతీయుడా! మానుము బండ నిద్ర!! (7)
కులపు వాడైన చాలును కువలయమును
దోచినను కొంచమైనను దొసగు లేదు!
స్వంత కుల పిచ్చి హెచ్చెను వింత రీతి
భారతీయుడా! మానుము బండ నిద్ర!! (8)
ప్రాణ వాయువు కొరతతో ప్రాణమాగె
శిశువులసువులు బాసెను, సిగ్గు!సిగ్గు!
వెజ్జు నెలవుకు నవినీతి గజ్జి పట్టె
భారతీయుడా! మానుము బండ నిద్ర!! (9)
తర్కపాలోచనలు నేడు తగ్గి పోయి
రిప్లయితొలగించండిమూఢ నమ్మకమ్ములు మరి ముదిరి పోయె
చంటిది పలికెనని వీడె కంట నిదుర
భారతీయుడా! మానుము బండ నిద్ర!! (10)
*****
రిప్లయితొలగించండిదర్దురము : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
n.
1. a frog;
2. a cloud;
3. a kind of musical instrument;
4. ancient name of a mountain in S. India close to the Malaya mountain.
*****
దర్దురము = కప్ప , మేఘము
శంకరార్యా ! ధన్యవాదములు !
కుంభకర్ణుడు కప్పవలె కాదు ;
మేఘము వలె (నల్లగా ) నున్నాడని నా భావం !
పనుల ఒత్తిడి వలన కొందరి పద్యాలను వ్యాఖ్యానించడం ఆలస్యమయింది. మన్నించండి...
రిప్లయితొలగించండి*
మిస్సన్న గారూ,
మీ సీసపద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
కమనీయం గారూ,
మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీ ప్రబోధ పద్యాల కొనసాగింపు బాగుంది. అభినందనలు.
‘మైల, మయిల’ ఉన్నాయి. ‘మయల’ లేదు. అది బహుశా టైపాటు కావచ్చు.
‘శిశువు లసువులు బాసిరి’ అనండి.
‘తర్కపు + ఆలోచన’ తర్కపు టాలోచన అవుతుంది. ‘తర్కయోచన లవి నేడు...’ అందాం.
*
వసంత కిశోర్ గారూ,
నేను కేవలం రూఢ్యర్థమే స్వీకరించాను. వివరణకు ధన్యవాదాలు.