20, ఆగస్టు 2012, సోమవారం

పద్య రచన - 87


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. ధరణిపై పలు క్షత్రియుల్ తమ ధర్మమున్ విడనాడుచున్
    దొరతనమ్మును జూపుచున్ గడు దుష్టులౌచు జెలంగ న
    త్తరుణమందు సముద్ధరింపగ ధర్మమున్ భృగురాముడై
    పరశువూనుచు విక్రమించిన స్వామి! నిన్ బ్రణుతించెందన్

    రిప్లయితొలగించండి
  2. శివధనువది విఱిగిన తఱి
    శివునారాధించు నీవు శివమెత్తితివే,
    భవహరుడగు రాముండన
    నవగాహన గల్గ తొలగె నారాటములే!

    జనకుని యాన బాలనము చక్కగ జేసెడు వాడవీవుగా
    జననిని జంపి, తండ్రికడ సత్తు నిరూపణ జేసియుంటివే!
    ఘనముగ తల్లి జీవనము కానుక గోరియు తెచ్చిజూపుచున్,
    జననము సార్థకమ్ముగను సాయుధు వై నిల నిల్చినాడవే!

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    పరశురామావతారము :

    01)
    _______________________________

    తండ్రి యానతి తలదాల్చి - తల్లి తలను
    తలిరుటాకును త్రుంచెడు - దంతి రీతి
    తరిగి వేసెను పరశువు - దాల్చి చేత !
    తల్లి , యన్నల బ్రతికించె - తండ్రి గోరి !

    పరశువును చేతబూనిన - పరమ కోపి
    పగయె రగులగ పలుమార్లు - పట్టు బట్టి
    ప్రభువులను మట్టు బెట్టిన - పరశురాము
    ప్రస్తుతించగ రారండి - ఫలము లొసగు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  4. ఇరువది యొక్కటి మారులు
    ధర దిరుగుచు నరపతులను దండించావే
    పరశువు చేకొని, వినగను
    పరవశ మిడు చరిత యున్న బాపడ జేజే !

    రిప్లయితొలగించండి

  5. అవతారము లన్నిట నీ
    యవతారమె గొప్ప దనిరి యార్యా ! రామా !
    యవని గల దుష్ట రాజుల
    పవ రంతయు పీ కి నావు పరశువ తోడన్ .

    రిప్లయితొలగించండి
  6. ధర్మ మతిక్రమించి వసుధంగల క్షత్రియులెల్ల నీచ దు-
    ష్కర్మల సల్పు వేళలను సంఘహితమ్మును కోరి వారలన్
    ఖర్మము బాపి గొడ్డలిని కాలుడవై పలుమార్లు ద్రుంచవే
    ధర్మము నుద్ధరించగను ధాత్రిని భార్గవ నందనా బళీ.

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    మీ తరళ వృత్తం ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    ‘సాయుధువై యిల’ అనడం సరి!
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.
    ‘దండించావే’ అనే వ్యావహారికం బదులు ‘దండించితివే’ అంటే సరి!
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    కాకుంటే ‘పవరు’ అనే అన్యభాషా పదాన్ని ప్రయోగించారు.
    *
    మిస్సన్న గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
    *

    రిప్లయితొలగించండి
  8. పరశు చేత బూని, వెంట పరుగులెత్తి రాజులన్,
    ఇరువదొక్క మారులు ధర, తిరుగుతూ వధించుచూ
    ధరణి భారమెంతయైన తగ్గునట్లు జేయగా,
    పరశురామ జన్మమీవు బడసినావు రాఘవా !

    రిప్లయితొలగించండి
  9. వామన్ కుమార్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘పరశువు’ అనాలి కదా. ‘పరశు వొనర బూని’ అందాం. ‘తిరుగుతూ,వధించుచూ’ అనేవి వ్యావహారికాలు కదా. ‘తిరుగుచున్, వధించుచున్’ అంటే సరి!

    రిప్లయితొలగించండి