పూజ్యశ్రీ నేమాని
గురుదేవులకు
ప్రణతిపురస్సరంగా,
దాదాపు నెలన్నరపాటు
ఏదో ఒక కారణాన ఇంటర్నెట్ చూడటం వీలయింది కాదు. ఈ రోజే శంకరాభరణంలో మీరు వ్రాసిన అధ్యాత్మ రామాయణం రచనాదీక్షను గుఱించిన విశేషాలను సాకల్యంగా
చదివాను. చదివినందుకు ఎంతో ఆనందం కలిగింది.
మీ రచనావ్యాసంగాన్ని
శీర్షికలోనే మీరు తపోయోగంతో రూపించడం ఎంతో సముచితంగా ఉన్నది. కామేశ్వరీ శతకంలో “కవనార్థం బుదయించితిన్” అన్న చెళ్ళపిళ్ళ
వారి అభిజ్ఞానం, రామాయణ కల్పవృక్షంలో
“కవితారూప తపస్సు చేసితిని శ్రీకంఠా!” అన్న విశ్వనాథ వారి వినివేదనం జ్ఞప్తికి వచ్చాయి.
మీ రసన తీయనైనది.
మీ రచన హృద్యమైనది. ధారాశుద్ధి అపురూపం. చిత్రకవిత్వం వచ్చినప్పుడు సైతం ప్రసన్నతను
నిలుపుకొనటం నిజంగా ప్రశంసనీయం. మూలంలోని ఆ అతిప్రౌఢమైన శైలిని,
అద్వైతశాస్త్రం లోతులను తడవి చూచిన ఘట్టాలను, దర్శనాంతసాహిత్యదృష్టిని, పాదుకాంతమంత్రసాధనరహస్యాలను, సాలంకృతమైన అభివ్యక్తికౌశలిని, పారాయణయోగ్యతను అనురణింపజేసి రాణింపజేయటం ఎంతటివారికైనా దుస్సాధమైన మహావిషయం.
పూర్వం నారు నాగనార్య మహాకవి రచించిన అధ్యాత్మ రామాయణము
పద్యానువాదం ఒకటి నా వద్ద ఉన్నదానిని ఒకప్పుడు చదువుకొన్నాను. ఆ తర్వాత వావిళ్ళ వారు
ప్రకటించినది, శ్రీ మలయాళస్వాముల వారు ప్రకటించినది వచనానువాదాలను
చదివాను. మనస్సులో అక్కడక్కడ వాటితో సరిపోల్చుకొంటూ చదివినప్పుడు ప్రసన్నసరస్వతీకమైన
మీ అభినవానువాదం రమణీయమైన ధార మూలాన హాయిగా సాగిపోయినదని అనిపించింది. ఇది నిశ్చితమైన
నా అభిప్రాయం.
పంక్తిపావనమైన మీ
రచన నేపథ్య-రచనను శంకరాభరణంలో ప్రకా శింపజేసినందుకు శ్రీ శంకరయ్య గారికీ హార్దికాభినందనలను తెలియజేస్తున్నాను.
దీనిని ఏతత్ప్రకటనకాలంలో వెంటనే పంపలేకపోయినందుకు మన్నింప ప్రార్థన.
వినమ్రంగా,
ఏల్చూరి మురళీధరరావు
శ్రీ పండిత నేమాని వారికి నమస్కారములు. మీ తప:ఫలము "అధ్యాత్మ రామాయణము"ను చదువ వలెనను కోరిక చాలా రోజుల నుండి యున్ననూ శ్రీ ఏల్చూరి వారి వ్యాఖ్యలతో అది ఇనుమడించినది.
రిప్లయితొలగించండిదానిని పొందుటకు గల అవకాశమును తెలుపగలరు. నా చిరునామాను మీ mail ID కి పంపవచ్చా.... తెలుపగలరు.
హనుమచ్చాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅది తప్పక చదువవలసిన గ్రంథం. మీరు మీ చిరునామాను నేమాని వారికి తెలిపితే వారు పంపిస్తారు. నాకు తెలిపినా నేను పంపిస్తాను. నా వద్ద ఒక ప్రతి అదనంగా ఉంది.
నామాని వారి అంతర్జాల చిరునామా
nrsrao@gmail.com
ayyaa!Sree gOli hanumaCCaastri gaaroo! kindly write your postal address. I will definitely send a copy of my adhyaatmaraamaayanam to you by post. Best wishes.
రిప్లయితొలగించండిచేసితి దీక్షతో తపము శ్రీరఘురాము చరిత్ర నంతయున్
రిప్లయితొలగించండివ్రాసితి పద్య కావ్యముగ పాఠక మానస రంజకమ్ముగా
భాసిలు రీతి తత్త్వ రస బంధురమై పరమార్థ దీప్తితో
నా సుకృతిన్ సదాశివు దయా ఫలితమ్ముగ ప్రస్తుతించెదన్