ఉదయ బింబమ్ము తన రూపు నుత్సు కతను ఆత్ర పదుచును జూడగా నద్దమందు యేటి యద్దము లో గిరి చాటు గాను తొంగి చూచుచు నుండెను తొణక సిగ్గు
ఉదయ బింబమ్ము ప్రొద్దుటే నిదుర లేచి అంద మైనట్టి తన ముఖ మాత్ర పడుచు యేటి యద్దము లో గిరి చాటు గానుతొంగి చూచుచు నుండెను తొణక సిగ్గు
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి !సూర్యోదయము :01)_______________________________రేయి పవలును తిరుగాడు - రిక్కదారిరక్ష సేయును జగతిని - రశ్మి నిచ్చి !రాత్రి గడువగ, రమ్యంపు - లక్షణమునరవికి మ్రొక్కుల నిడెదము ! - రండు ! రండు !_______________________________రిక్కదారి = ఆకాశములక్షణము = దర్శనము
మిత్రులారా!అది సూర్యాస్తమయము అనే భావముతో వ్రాసిన పద్యము:ఆకాశవీధిలో స్యందనారూఢుడై....పయనమ్ము నొనరించి భాస్కరుండుపగలెల్ల నిద్ధరావాసుల నలరించి....విశ్రాంతి గైకొను వేడ్కతోడపశ్చిమాంబుధి జేరె బంగారు వన్నెలు....నా దిక్కు నిండుగా నలము కొనుచుకనుల విందై యొప్పె, కమలముల్ ముకుళించె,....కనులు విప్పుచు నుండె కలువ పూలుసంధ్య వార్చి కృతజ్ఞతాంజలులు పట్టభూజనులు, కిలకిలా రావముల నొనర్చిబయలు దేరగ గూళ్ళకు బక్షితతులునలరుచుండె సాయంసంధ్య హర్షదమయి
దూర తీరము నను మింటిదొర మునుగుచునుండగ గగన కామిని యోపలేకముఖమె యెఱుపెక్క రోసెను ముడుచుకొనుచుచీకటులనెల్ల చుట్టుచు చీర వలెను.
గుండు మధుసూదన్ గారి పద్యము....[సాయంసంధ్యాసమయవర్ణన] తే.గీ.చెలఁగె యుద్ధమ్ము లా కురు క్షేత్ర మందుఁబాండవులు కౌరవుల్ పరస్పరము రోషభీష ణాస్త్ర శస్త్ర తతులఁ బెనఁగి, చంప,రుధిర ధార లట్లుండె నా రుధిర సంధ్య!
గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య... నేమాని వారి పద్యం ఎత్తుగీతి రెండవ పాదంలో గణదోషం ఉంది. ‘కిలారా’ఆని యగణం వచ్చింది. సవరంచగలరు.
పండిత నేమాని వారూ, ఆ పాదాన్ని ‘భూమిజనులు కిలకిల రావము లొనర్చి’ అంటే ఎలా ఉంటుందంటారు?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అయ్యా శంకరయ్య గారూ!నిజమే. అది టైపు పొరపాటే. మనసులో నున్నది ఒకటి. టైపు అయినది మరొకటి. అయినా గుర్తు చేసినందులకు ధన్యవాదములు. ఈలోగా మరొక తప్పు కూడా చేసేను ఈ సర్దుబాటులో. పాదమును ఈవిధముగా మారుద్దాము: "భూజనులు కిల కిల రవములొనరించి" స్వస్తి.
మధుర స్వప్నాల రేయంత మత్తు గాను కరిగె యుగమైన క్షణముగ మురియు చుండ ఈసు జెందిన వెలుగులు హాస్య మాడ హద్దు మరలిచి రాగోరె బద్ధకము
కవిమిత్రులారా, ఈనాటి చిత్రం సూర్యోదయమా, సూర్యాస్తమయమా అన్న సందేహానికి తావిచ్చింది. ఏది స్వీకరించినా అంగీకరించవలసిందే...*గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘అద్దమందు + ఏటి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘అద్దమందె యేటి’ అందాం. *వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.*పండిత నేమాని వారూ, అత్యద్భుతంగా మనోహరంగా ఉంది మీ పద్యం. అభినందనలు.తొందరపాటులో నావ్యాఖ్యలోనూ దోషం ఉంది. మన్నించండి. *లక్ష్మీదేవి గారూ, మీ సూర్యాస్తమయ వర్ణన మనోరంజకంగా, సాలంకారమై విలసిల్లుతున్నది. అభినందనలు. *గుండు మధుసూదన్ గారూ, మీ రెండు విధాల వర్ణనలూ అలంకార శోభితాలై చాలా బాగున్నవి. అభినందనలు. *రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పద్యం. అభినందనలు.‘మధురస్వప్నాల’ అన్నప్పుడు ‘ర’ గురువై గణదోషం. ‘మధురమౌ కల’ అందామా?
సూర్యోదయం,అస్తమయం ,చిత్రంలో ఉన్నదిఏదో తెలియక రెండు పద్యాలు వ్రాస్తున్నాను.మొదటిది ఇంతకు ముందు నా రచనలలోనిది. 1. ఈ పదునాల్గు లోకములనెల్ల కిరణ్మయ దివ్యదీధితి న్నేపగిదిన్ వెలుంగులను నింపెదవట్టులె లోకబంధు,మా లోపలిచీకటుల్ కరగి లుప్తము గాగ మహత్త్వపూర్ణ ,మా పాపములెల్ల,నీ కృపను బాపుము,కేశవరూప ,సత్కృపన్ . 2.రాగరంజితమ్ము ప్రకృతి,సాగరమున, నస్తమించు భానుని దృశ్య మద్భుతమ్ము సంజె గాలులు వీచెను చల్లగాను క్రమ్ముకొనియుండ లేదు చీకటులు యింక . లక్ష్మీదేవిగారి పద్యం చక్కటి ఉపమానంతో,భావనా శక్తితో చాలా బాగున్నది.అభినందనలు.
కాల రధికుండుడై యుండి కడలిఁ గ్రుంగపమయమాసన్నమైనయస్తమయమనెడిసత్తెమునుదెలుపుసందేశ చిత్తరువునసూర్యనారాయణుండెంతసోయగాడు!
కాల రధికుండుగానుండి కడలిఁ గ్రుంగపమయమాసన్నమైనయస్తమయమనెడిసత్తెమునుదెలుపుసందేశ చిత్తరువునసూర్యనారాయణుండెంతసోయగాడు!
ఉదయ బింబమ్ము తన రూపు నుత్సు కతను
రిప్లయితొలగించండిఆత్ర పదుచును జూడగా నద్దమందు
యేటి యద్దము లో గిరి చాటు గాను
తొంగి చూచుచు నుండెను తొణక సిగ్గు
ఉదయ బింబమ్ము ప్రొద్దుటే నిదుర లేచి
రిప్లయితొలగించండిఅంద మైనట్టి తన ముఖ మాత్ర పడుచు
యేటి యద్దము లో గిరి చాటు గాను
తొంగి చూచుచు నుండెను తొణక సిగ్గు
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
సూర్యోదయము :
01)
_______________________________
రేయి పవలును తిరుగాడు - రిక్కదారి
రక్ష సేయును జగతిని - రశ్మి నిచ్చి !
రాత్రి గడువగ, రమ్యంపు - లక్షణమున
రవికి మ్రొక్కుల నిడెదము ! - రండు ! రండు !
_______________________________
రిక్కదారి = ఆకాశము
లక్షణము = దర్శనము
మిత్రులారా!
రిప్లయితొలగించండిఅది సూర్యాస్తమయము అనే భావముతో వ్రాసిన పద్యము:
ఆకాశవీధిలో స్యందనారూఢుడై
....పయనమ్ము నొనరించి భాస్కరుండు
పగలెల్ల నిద్ధరావాసుల నలరించి
....విశ్రాంతి గైకొను వేడ్కతోడ
పశ్చిమాంబుధి జేరె బంగారు వన్నెలు
....నా దిక్కు నిండుగా నలము కొనుచు
కనుల విందై యొప్పె, కమలముల్ ముకుళించె,
....కనులు విప్పుచు నుండె కలువ పూలు
సంధ్య వార్చి కృతజ్ఞతాంజలులు పట్ట
భూజనులు, కిలకిలా రావముల నొనర్చి
బయలు దేరగ గూళ్ళకు బక్షితతులు
నలరుచుండె సాయంసంధ్య హర్షదమయి
దూర తీరము నను మింటిదొర మునుగుచు
రిప్లయితొలగించండినుండగ గగన కామిని యోపలేక
ముఖమె యెఱుపెక్క రోసెను ముడుచుకొనుచు
చీకటులనెల్ల చుట్టుచు చీర వలెను.
గుండు మధుసూదన్ గారి పద్యము....
రిప్లయితొలగించండి[సాయంసంధ్యాసమయవర్ణన]
తే.గీ.
చెలఁగె యుద్ధమ్ము లా కురు క్షేత్ర మందుఁ
బాండవులు కౌరవుల్ పరస్పరము రోష
భీష ణాస్త్ర శస్త్ర తతులఁ బెనఁగి, చంప,
రుధిర ధార లట్లుండె నా రుధిర సంధ్య!
గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య...
రిప్లయితొలగించండినేమాని వారి పద్యం ఎత్తుగీతి రెండవ పాదంలో గణదోషం ఉంది. ‘కిలారా’ఆని యగణం వచ్చింది. సవరంచగలరు.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిఆ పాదాన్ని ‘భూమిజనులు కిలకిల రావము లొనర్చి’ అంటే ఎలా ఉంటుందంటారు?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్యా శంకరయ్య గారూ!
రిప్లయితొలగించండినిజమే. అది టైపు పొరపాటే. మనసులో నున్నది ఒకటి. టైపు అయినది మరొకటి. అయినా గుర్తు చేసినందులకు ధన్యవాదములు. ఈలోగా మరొక తప్పు కూడా చేసేను ఈ సర్దుబాటులో. పాదమును ఈవిధముగా మారుద్దాము: "భూజనులు కిల కిల రవములొనరించి" స్వస్తి.
మధుర స్వప్నాల రేయంత మత్తు గాను
రిప్లయితొలగించండికరిగె యుగమైన క్షణముగ మురియు చుండ
ఈసు జెందిన వెలుగులు హాస్య మాడ
హద్దు మరలిచి రాగోరె బద్ధకము
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండిఈనాటి చిత్రం సూర్యోదయమా, సూర్యాస్తమయమా అన్న సందేహానికి తావిచ్చింది. ఏది స్వీకరించినా అంగీకరించవలసిందే...
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘అద్దమందు + ఏటి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘అద్దమందె యేటి’ అందాం.
*
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
అత్యద్భుతంగా మనోహరంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
తొందరపాటులో నావ్యాఖ్యలోనూ దోషం ఉంది. మన్నించండి.
*
లక్ష్మీదేవి గారూ,
మీ సూర్యాస్తమయ వర్ణన మనోరంజకంగా, సాలంకారమై విలసిల్లుతున్నది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు విధాల వర్ణనలూ అలంకార శోభితాలై చాలా బాగున్నవి. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘మధురస్వప్నాల’ అన్నప్పుడు ‘ర’ గురువై గణదోషం. ‘మధురమౌ కల’ అందామా?
రిప్లయితొలగించండిసూర్యోదయం,అస్తమయం ,చిత్రంలో ఉన్నదిఏదో తెలియక రెండు పద్యాలు వ్రాస్తున్నాను.మొదటిది ఇంతకు ముందు నా రచనలలోనిది.
1.
ఈ పదునాల్గు లోకములనెల్ల కిరణ్మయ దివ్యదీధితి
న్నేపగిదిన్ వెలుంగులను నింపెదవట్టులె లోకబంధు,మా
లోపలిచీకటుల్ కరగి లుప్తము గాగ మహత్త్వపూర్ణ ,మా
పాపములెల్ల,నీ కృపను బాపుము,కేశవరూప ,సత్కృపన్ .
2.రాగరంజితమ్ము ప్రకృతి,సాగరమున,
నస్తమించు భానుని దృశ్య మద్భుతమ్ము
సంజె గాలులు వీచెను చల్లగాను
క్రమ్ముకొనియుండ లేదు చీకటులు యింక .
లక్ష్మీదేవిగారి పద్యం చక్కటి ఉపమానంతో,భావనా శక్తితో చాలా బాగున్నది.అభినందనలు.
కాల రధికుండుడై యుండి కడలిఁ గ్రుంగ
రిప్లయితొలగించండిపమయమాసన్నమైనయస్తమయమనెడి
సత్తెమునుదెలుపుసందేశ చిత్తరువున
సూర్యనారాయణుండెంతసోయగాడు!
కాల రధికుండుగానుండి కడలిఁ గ్రుంగ
రిప్లయితొలగించండిపమయమాసన్నమైనయస్తమయమనెడి
సత్తెమునుదెలుపుసందేశ చిత్తరువున
సూర్యనారాయణుండెంతసోయగాడు!