25, ఆగస్టు 2012, శనివారం

సమస్యాపూరణం - 803 (కల్కి వచ్చు ననుట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కల్కి వచ్చు ననుట కల్ల సుమ్ము.

12 కామెంట్‌లు:

  1. ఏదో సరదాకి

    వీధిలోన జనుచు వెర్రి నవ్వును నవ్వి
    కన్ను గీటి నావు కాంత జూచి
    ఏమి సుందరుడవె ఇకిలింపు లాపుమా
    కల్కి వచ్చు ననుట కల్ల సుమ్ము

    రిప్లయితొలగించండి
  2. కల్కి వచ్చు ననుట కల్ల సుమ్మనుమాట
    నమ్మ వలదు రక్షణమ్మొనర్ప
    వచ్చు నవ్విభుండు బాధలు దీర్చును
    కలి నశించును త్రిజగమ్ము లలరు

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !


    01)
    _______________________________

    కల్కి వచ్చు నయ్య - కలియుగాంతము నందు
    కాల మింక చాల - గడువ వలయు !
    కలియుగపు మొదలిది - గాన , నీ తరుణంబు
    కల్కి వచ్చు ననుట - కల్ల సుమ్ము !
    _______________________________

    రిప్లయితొలగించండి
  4. తమిళనాట కల్కి ఇప్పటికే వచ్చాడని పిచ్చి నమ్మకం, ఆ వార్తను వ్యంగ్యంగా :
    కంటిరి గద యపర కల్కియె విచ్చేసి
    చెన్నపట్న మందు చేరి యున్న
    వార్త టీవి యందు వచ్చెనుగద కాన
    కల్కి వచ్చుననుట కల్ల సుమ్ము!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,

    గురువుగారి సవరణలకు ధన్యవాదములు .
    కలియుగపు కల్కి భగవానుని అవతారముపై
    ---
    కల్కి భగవానుడను నేను కలియుగమున
    ముక్తి నిచ్చెద జనులార ముడుపు గట్టి
    జేర వచ్చు "దాసాజీ" గ సేవలోన
    మరులు గొనిన మీరు మరల మరల రండి |

    దాసాజిల మాటలు వినిన వారు జెప్పు మాటలు నిజము కాదని
    ------
    మహిమ లెల్ల జూపి మనుజుల మధ్యన
    గూరి, వారము లిచ్చు వారి శక్తి
    కొలది ,పరమ పుణ్య ఫలము లిచ్చు
    కల్కి వచ్చు ననుట కల్లసుమ్ము |

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారూ,
    చమత్కార భరితమైన మీ పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    కల్కి వచ్చే కాలం ఇంకా రాలేదన్న మీ పూరణ వైవిధ్యంగానూ, ప్రశస్తంగానూ ఉంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    ‘ఆల్రెడీ కల్కి వచ్చేసాడు. ఇక వస్తాడన్న డన్నమాట కల్లయే కదా’ అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పద్యంలో ‘వరము లిచ్చు’ అనేది ‘వారము లిచ్చు’ అని టైపాటు.
    మూడవ పాదంలో గణదోషం. ‘కొలది ,పరమ పుణ్య ఫలమివ్వ నింటికే’ అని నా సవరణ...

    రిప్లయితొలగించండి
  7. కల్ల బొల్లి ప్రేమ కాంతల పాలిట
    చెల్ల దన్న మాట దెలియ కుంటి
    చెంప చెళ్ళు మనగ చెక్కిట చెయిజేర్చి
    కల్కి వచ్చు ననుట కల్ల సుమ్ము !
    ---------------------------------------------
    కల్కి మహిమ లనగ కనరావు మన కంట
    మనిషి మనిషి లోన పెనగి యుండు
    కలుష హరము కలుగు కాలమే గతినైన
    కల్కి వచ్చు ననుట కల్ల సుమ్ము !

    రిప్లయితొలగించండి
  8. కన్ను మిన్ను గనక గనులన్ని దోచుచుఁ
    న్యాయదేవతఁగొను నైచ్యుడయ్యు
    కర్త కర్మ క్రియల కారణుండిట్లను
    "కల్కి వచ్చు ననుట కల్ల సుమ్ము!"

    రిప్లయితొలగించండి
  9. 2012 కలియుగాన్తమని మాయన్ కేలండరు ద్వారా తెలుసుకున్నామని చేసిన ప్రచారం తప్పని ఋజు వయ్యింది కదా...

    గడచు వత్సరమ్ము కలియుగ మంతమ్ము
    మాయ తెగల వలన మనకు తెలిసె
    నేడు రేపు లందు నిక్కముగా జూడ
    కల్కి వచ్చు ననుట కల్ల సుమ్ము

    రిప్లయితొలగించండి
  10. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణలు రెండూ బాగున్నవి. ఆభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. లక్ష్మీ నరసింహం గారి పూరణ....

    లలితభావభరిత లావణ్య ప్రచలిత
    దివ్య నవ్య కుసుమ కావ్య లతిక
    భరతమాత మదిని భారతి యుండగా
    కల్కి వచ్చు ననుట కల్ల సుమ్ము!

    రిప్లయితొలగించండి
  12. లక్ష్మీ నరసింహ గారూ,
    పద్యం శబ్దలాలిత్యంతో మనోహరంగా ఉంది. అభినందనలు.
    కాని భారతికి, కల్కి ఆగమనానికి ‘లింక్’ ఏమిటో అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి