శశాంక మౌళి నిట్లు కోరె శంభు రాణి చెప్పవో విశేష మేమి యే కతాన విష్ణు వా వసుంధరన్ దశావతారముల్ ధరించె? త్ర్యంబకుం డుదారుఁడై యశేష విష్ణు దివ్య గాధ లయ్యెడన్ వచింపగన్. .
దశావతారం సినిమాతో విశేష ఖ్యాతి గన్న కమల్ హసన్ విశ్వ రూపం సినిమాతో ఇంకా యశస్సు పొందాలని ఆకాంక్ష..
విశేష ప్రజ్ఞ గల్గి నట్టి 'విశ్వ రూపు' డే కమల్ అశేష ప్రేక్ష కాళి మెచ్చ నాటి చిత్ర మందునన్ దశావతారముల్ ధరించె, త్ర్యంబకుండుదారుడై యశస్సు బెంచి బ్రోచు గాక యబ్దముల్మరెన్నియో
లక్ష్మీదేవి గారూ, మీ గేయం చాలా బాగుంది. అభినందనలు. మీ పూరణ బాగుంది. అయితే నాలుగవ పాదంలో రెండు అక్షరాలు తగ్గాయి. ‘వారకున్’ అనడమూ దోషమే. ‘కుశీలవర్తనంపు వారికెల్ల గూర్చెగా వరమ్ములన్’ అందామా? * మిస్సన్న గారూ, వాహ్! శివునితో విష్ణుకథలు చెప్పించారు. చాలా బాగుంది. మీ రెండవ పూరణ కూడా ప్రశస్తంగా ఉంది. అభినందనలు. రెండవ పూరణ రెండవ పాదంలో చివర రెండక్షరాలు తగ్గాయి. అక్కడ ‘వడిన్’ అనేది చేర్చితే బాగుంటుందని నా సూచన. మూడవ పూరణ చాలా బాగుంది. * వామన కుమార్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ధరించె తరువాత కామా పెడితే సుబోధకంగా ఉంటుంది. ‘కాంతు లీనుచూ’ అనకుండా ‘కాంతు లీనుచున్’ అందాం. * సహదేవుడు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * జిగురు సత్యనారాయణ గారూ, శివకేశవాద్వైత భావనతో చక్కని పూరణ చేసారు. అభినందనలు. అన్నట్టు మీరు ఈమధ్య తరచుగా కనిపించటం లేదు! * లక్ష్మీ నరసింహం గారూ, మీ ప్రయత్నం ప్రశంసార్హం. అయితే పద్యంలో చాలా దోషాలున్నాయి. రేపు తెలియజేస్తాను. * గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, వైవిధ్యమూ అనూహ్యమూ అయిన విధంగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. మీరు కాపీ, పేస్ట్ చేసినప్పుడు ఏదో పొరపాటు జరిగి మీ పద్యం తరువాత ఖాళీస్థలం ఎక్కువ మిగిలిపోయింది. అందువల్ల నేను కాపీ, పేస్ట్ చేయవలసి వచ్చింది.
నారాయణా నీ నామామృతం
రిప్లయితొలగించండినా నాలుక చేసిన కడు సుకృతం
దశావతారముల దివ్య చరితం
దరి చేర్చి మది జేయు ఆనంద భరితం ||నారాయణా||
చతుర్వేదముల పరిరక్షణకై
శతయోజనమ్ముల మత్స్య రూపాన కనిపించినా
అసురులొకవైపు సురలింకొకవైపు
ఆ పాలకడలి మథియింప కూర్మ రూపాన గిరి మోసినా
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||
అనుంగు భృత్యుని శాపాలు బాపంగ
అవనినే కావంగ వరాహ రూపమును ధరియించినా
ఎందెందు వెతికిన అందందే గలవన్న
చందాన పసివాని బ్రోవంగ నారసింహుడై గర్జించినా
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||
బాలవటువుగా ఇల జనియించి
బలి మహరాజుకడ యాచించి వామన మూర్తిగ విఖ్యాతినందినా
పరశువు కైదాల్చి నృపులను మర్దించి
పరమశివుని విల్విరుచు విరించిపితకే కైమోడ్చినా
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||
ధరణిని ఏలే మోహమె లేక
జనకుని మాటకై జనపదమొదలి జానకి తోడుగ కానలకేగినా
ముద్దార పెంచిన తల్లి యశోదకు
మురిపాల తేల్చిన సుందరాంగులకు
మోదము పంచి మోహము తెంచి మోక్షమునిచ్చినా
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||
బుద్ధుడు నీవై శాంతిని బోధించి
యుద్ధములొద్దని దయను, ప్రేమను కాంతిగ నింపేవు
కల్కివి నీవై అవతరించగా
కన్నుల నిండుగ నిన్ను చూడగా కలలోనైనా వరమునీయవా!
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||
- లక్ష్మీదేవి.
(రెండేళ్ళ క్రితం భగవంతుడు నాతో వ్రాయించుకున్న వ్రాతలు.)
శశాంక మౌళి నిట్లు కోరె శంభు రాణి చెప్పవో
రిప్లయితొలగించండివిశేష మేమి యే కతాన విష్ణు వా వసుంధరన్
దశావతారముల్ ధరించె? త్ర్యంబకుం డుదారుఁడై
యశేష విష్ణు దివ్య గాధ లయ్యెడన్ వచింపగన్.
.
విశాల విశ్వ నందనున్ తపించు జనుల బ్రోవ, నం
రిప్లయితొలగించండికుశంబు వంటి శస్త్ర ధారి, కోటి కాంతులీనుచూ
దశావతారముల్ ధరించె త్ర్యంబకుండుదారుడై
యశస్సు పెంచి మమ్ము గాచు నాప్త బంధు రాఘవా !
పై పద్యంలో చిన్న సవరణ :
రిప్లయితొలగించండివిశాల విశ్వ మందునన్, తపించు జనుల బ్రోవ, నం
కుశంబు వంటి శస్త్ర ధారి, కోటి కాంతులీనుచూ
దశావతారముల్ ధరించె త్ర్యంబకుండుదారుడై
యశస్సు పెంచి మమ్ము గాచు నాప్త బంధు రాఘవా !
పంచచామర వృత్తము:
రిప్లయితొలగించండినిశాచరాదులన్ వధించ నీరజాక్షుడీ మహిన్
దశావ తారముల్ ధరించె , త్ర్యంబకుండుదారుడై
యశంబునొందె సాయమిచ్చి యద్భుతాంశ ధారుడై
దశావతారకాలమందుఁ ధర్మ రక్షణంబుకై!
అశేష సాధు భక్తకోటి కచ్యుతుండిడున్ సదా
రిప్లయితొలగించండియశస్సమృద్ధి, సంహరింప నా దితేయులన్
దశావతారముల్ ధరించె, త్ర్యంబకుం డుదారుఁడై
శ్మశాన వాసియౌను పోవు సజ్జనాళి తోడుగా.
గురువుగారికి మరియు కవిమిత్రులకు నా నమస్సుమాంజలి.
రిప్లయితొలగించండిసర్వాత్మకుడైన పరమేశ్వరుడు పది దిక్కులలోను పది అవతారములతోనున్నాడని నా భావము.
విశుద్ధభక్తిభావముల్ సవిస్తరంబుఁజేయగా
శశాంకధారి సర్వమానసంబులందునిల్చెనే
విశేషరూపసంగుడై యభేద్యమైవెలుంగు ది
క్దశావతారముల్ ధరించె త్ర్యంబకుండుదారుఁడై.
అశేష జంతు కోటి జేసె నాదిజుండు స్రష్టయై,
రిప్లయితొలగించండివిశాల సృష్టి పోషకుండు విష్ణువెన్న రక్షకై
దశావతారముల్ ధరించె, త్ర్యంబకుం డుదారుఁడై
నశింప జేయు జీవకోటి నవ్య సృష్టి హేతువై.
లక్ష్మీ దేవిగారూ మీ యితఃపూర్వ దశావతార కీర్తన మేలుమేలు.
రిప్లయితొలగించండిఅశేష శక్తితో,విశేషమౌ దయా గుణమ్ముతో
రిప్లయితొలగించండియశస్వి యైన మాధవుండె,యౌర! ధర్మరక్షకై
దశావతారముల్ ధరించె;త్ర్యంబకుం డుదారుఁడై
కుశీలవర్తనంపు వారకున్ వరమ్ము నిచ్చుచో.
మిస్సన్న గారు,
రిప్లయితొలగించండిఅబ్బుర పరిచే ధారతో కొంగ్రొత్త భావాలతో పద్యాలు వ్రాసే మీ మెప్పు పొందడం సంతోషదాయకం.
త్రిశూల ధారి చక్ర ధారి తీరుఁ జూడ నొక్కటే
రిప్లయితొలగించండివిశాల సృష్టి యందు వీరు వేఱు వేఱు కాదులే
విశేష బుద్ది తోడఁ జెప్ప విష్ణు రుద్రులొక్కరే
దశావతారముల్ ధరించె త్ర్యంబకుం డుదారుఁడై!!
లక్ష్మీ నరసింహం గారి పూరణ...
రిప్లయితొలగించండివిశేష ప్రేమమూర్తి, సాంబశివుండు, యీశ్వరుండు, నా
గ శోభితుండు, లేనిహాసు, కపర్ధి, నీలకంఠుడున్,
యశేష భక్తకోటి పుణ్యమనంగ ధాత్రి విష్ణువై
దశావతారముల్ ధరించె త్ర్యంబకుం డుదారుడై.
గుండు మధుసూదన్ గారి పూరణ....
రిప్లయితొలగించండిఅశేష భూ జనాళికిన్ సహాయ మందఁ జేయ, శ
త్రు శేష ముండకుండ, శౌరి, తోయజాక్షుఁడే వెసన్
దశావతారముల్ ధరించెఁ! ద్ర్యంబకుం డుదారుఁడై
విశిష్టమౌ వరమ్ము లిచ్చెఁ బ్రీతి రాక్షసాళికిన్!
గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ....
రిప్లయితొలగించండిదశావతారం సినిమాతో విశేష ఖ్యాతి గన్న కమల్ హసన్ విశ్వ రూపం సినిమాతో ఇంకా యశస్సు పొందాలని ఆకాంక్ష..
విశేష ప్రజ్ఞ గల్గి నట్టి 'విశ్వ రూపు' డే కమల్
అశేష ప్రేక్ష కాళి మెచ్చ నాటి చిత్ర మందునన్
దశావతారముల్ ధరించె, త్ర్యంబకుండుదారుడై
యశస్సు బెంచి బ్రోచు గాక యబ్దముల్మరెన్నియో
కవిమిత్రులు సంపత్ కుమారుల దిక్దశావతార భావము కడుంగడు ప్రశంసనీయం.అభినందనలు.
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ గేయం చాలా బాగుంది. అభినందనలు.
మీ పూరణ బాగుంది. అయితే నాలుగవ పాదంలో రెండు అక్షరాలు తగ్గాయి. ‘వారకున్’ అనడమూ దోషమే. ‘కుశీలవర్తనంపు వారికెల్ల గూర్చెగా వరమ్ములన్’ అందామా?
*
మిస్సన్న గారూ,
వాహ్! శివునితో విష్ణుకథలు చెప్పించారు. చాలా బాగుంది.
మీ రెండవ పూరణ కూడా ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
రెండవ పూరణ రెండవ పాదంలో చివర రెండక్షరాలు తగ్గాయి. అక్కడ ‘వడిన్’ అనేది చేర్చితే బాగుంటుందని నా సూచన.
మూడవ పూరణ చాలా బాగుంది.
*
వామన కుమార్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
ధరించె తరువాత కామా పెడితే సుబోధకంగా ఉంటుంది.
‘కాంతు లీనుచూ’ అనకుండా ‘కాంతు లీనుచున్’ అందాం.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
శివకేశవాద్వైత భావనతో చక్కని పూరణ చేసారు. అభినందనలు.
అన్నట్టు మీరు ఈమధ్య తరచుగా కనిపించటం లేదు!
*
లక్ష్మీ నరసింహం గారూ,
మీ ప్రయత్నం ప్రశంసార్హం.
అయితే పద్యంలో చాలా దోషాలున్నాయి. రేపు తెలియజేస్తాను.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వైవిధ్యమూ అనూహ్యమూ అయిన విధంగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
మీరు కాపీ, పేస్ట్ చేసినప్పుడు ఏదో పొరపాటు జరిగి మీ పద్యం తరువాత ఖాళీస్థలం ఎక్కువ మిగిలిపోయింది. అందువల్ల నేను కాపీ, పేస్ట్ చేయవలసి వచ్చింది.
శంకరార్యా ! కడుంగడు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురువుగారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలండి.
అక్షరాలు సరిపోయినాయనే అనిపిస్తున్నది. గురువుగారు.
ఈ సవరణ చూడండి.
కుశీల వర్తనమ్ము గాంచ కుండ బ్రోచు వేళలో
గురువుగారూ మీరన్నట్లు రెండక్షరాలు తక్కువయ్యాయి . ధన్యవాదాలు .
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
మిస్సన్న మహాశయుల స్ఫూర్తితో :
01)
_______________________________
దశాశ్వుధారి జూచి , కోర - ద్వాదశాక్షు మాతయే
దిశాపతీ , సదాశివా , య - దేలనయ్య విష్ణువే
దశావతారముల్ ధరించె ? - త్ర్య్యంబకుం డుదారుడై
దశాననాది బారినుండి - ధారుణీ సురక్ష కై
దశావతారముల్ ధరించి - ధర్మ రక్షణార్థమై
నిశాచరుల్ వధించి బ్రోచి -నిత్య సత్య భక్తులన్
యశస్సు గాంచె విష్ణు వంత - యంచు చెప్పె నామెతో
యశేష హేమశంఖు గాథ - యంతరార్థ మంతయున్ !
_______________________________
దశాశ్వుడు = చంద్రుడు
ద్వాదశాక్షుడు = కుమారస్వామి
దశాననాది = రావణాది
దిశాపతీ = దిక్పాలకుడు =ఈశ్వరుడు
హేమశంఖుడు = విష్ణువు
రిప్లయితొలగించండివిశాల పృథ్వినిన్ భరించె విష్ణుదేవుడున్నతిన్,
ప్రశాంతమూర్తియై ధరిత్రి పాలనన్ వహించెగా
దశావతారముల్ ధరించె; త్ర్యంబకుండుదారుడై
ప్రశంస జేసెనచ్యుతున్ నభావభేద బుద్ధితో.