11, ఆగస్టు 2012, శనివారం

సమస్యాపూరణం - 789 (చీకాకులె సుఖము నొసఁగి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
చీకాకులె సుఖము నొసఁగి చింత బాపున్.

33 కామెంట్‌లు:

  1. అకస్మాత్తుగా కరెంట్ పోవడంతో ఈనాటి సమస్యను పోస్ట్ చేయడం ఆలస్యమయింది. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  2. చీకాకు లశాశ్వతములు
    చేకొని శివమంత్ర జపము చేయ శివకృపన్
    దేకువ యెసగును, తొలగుచు
    చీకాకులె, సుఖము నొసగి చింతలు బాపున్

    రిప్లయితొలగించండి
  3. చింతలెల్ల మదిని చీకాకు కల్పింప
    ధ్యాన ముద్రయందు తనువును మరిపింప
    వెతలు అయిననేమి వాటి జతలు అయిననేమి
    చీకాకులే సుఖము నొసగి చింతలుబాపున్

    రిప్లయితొలగించండి
  4. ఏకాకిగ నే వచ్చితి,
    లోకమ్మును నే నరయక లోపము గంటిన్.
    శోకమ్మది వీడి చనగ,
    చీకాకులె సుఖము నొసగి చింతలు బాపున్

    రిప్లయితొలగించండి
  5. ఏకాకి బ్రహ్మచారులు
    మూకలుమూకలుగపబ్బు జేరన్
    కేక,బయటి వారలకవి
    చీకాకులె,సుఖము నొసగి చింతలు బాపున్!

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ!
    మీ కంద పద్యము 2వ పాదములో కొన్ని అక్షరములు టైపు చేయుట మరిచినారేమో? సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా! శ్రీ పంతుల రాజారావు గరూ! మీరు వచన కవిత్వము వ్రాసినట్ట్లు ఉన్నది. మీరు కంద పద్యముగా వ్రాస్తే సమస్యను పూరించినట్లు అగుతుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. ఆకర మన్ని యిడుములకు
    చీకాకులె, సుఖము నొసగి చింతలు బాపున్
    ఏకాంత సేవ చేసిన
    లోకానికి సాయ పడిన లోకులు మెత్తుర్.

    రిప్లయితొలగించండి
  9. కాకుల రీతిగ పితరులు
    సాకారమునొంది వచ్చు సంరక్షింపన్
    శోకార్తికి వారలె పూ
    చీ! కాకులె సుఖము నొసఁగి చింతలఁ బాపున్!!

    రిప్లయితొలగించండి
  10. ఈనాటి సమస్య నాకు చాలా నచ్చింది. సృజనాత్మక పూరణలకి అవకాశం సౌలభ్యం ఉన్న సమస్య.
    లోకము మన క్రీడాంగణ
    మేకాగ్రత వీడక నెపుడెదిరిని నిలుపన్
    తోకముడిచి మరి తొలగున్
    చీకాకులె, సుఖము నొసఁగి చింతలఁ బాపున్.

    రిప్లయితొలగించండి
  11. గురువర్యులకు వందనములు.ఔనండి మరచిపోయాను.మన్నించండి.సరిచేసిన రెండవపాదం:
    మూకలుమూకలుగ పబ్బు ముంగిట జేరన్

    రిప్లయితొలగించండి
  12. శ్రీ సరస్వత్యై నమః:
    ఈనాటి పూరణలు వైవిధ్యముతో ప్రకాశించుచున్నవి. అందరికి అభినందనలు.

    శ్రీమతి లక్ష్మీదేవి గారు: మంచి వేదాంత ధోరణిలో పద్యమును చెప్పేరు. చాలా బాగున్నది.

    శ్రీ సుబ్బారావు గారు:
    మీ పద్యములో 3, 4 పాదములను ఈ విధముగా మార్చితే బాగుంటుంది:

    "ఏకాగ్రతతో ధ్యానము
    లోకహితార్థమగు సేవలోన జెలంగన్"

    శ్రీ జిగురు సత్యనారాయణ గారు:
    పితృకార్యములలో కాకుల పాత్రను ఉట్టంకించేరు. మీ పూరణ వైవిధ్యముగా చాలా బాగున్నది.

    The other .. ..
    క్రీడా రంగములోని మన వీరుల నైపుణ్యమును వ్యంగ్యముగా వర్ణించేరు. చాలా బాగున్నది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ సహదేవుడు గారు:
    మీ పూరణ చాలా బాగున్నది. పాపము బ్రహ్మచారుల, ఏకాకుల బాధలు మీకు తెలుసునో లేదో. వారి యెడల కాస్త చూచీ చూడకుండా ఉండాలి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _______________________________

    చీకాకులు కలిగిన యెడ
    కాకూడదు శోక వశము ! - కాంతులు వెలయున్
    శ్రీ కాంతుని ధ్యానించిన
    చీకాకులె సుఖము నొసఁగి - చింతలఁ బాపున్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  15. 02)
    __________________________________

    లోకాలను శాసించెడి
    లోకేశుని పాద సేవ - లోలుల కిలలో
    లోకువగును చింతలవే !
    చీకాకులె సుఖము నొసఁగి - చింతలఁ బాపున్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  16. అయ్యా శ్రీ వసంత కిశోర్ గారూ! అభినందనలు. మీ 2 పూరణలు ఉత్తమముగా నున్నాయి. (1) శ్రీకాంతుని ధ్యానించుట; (2) లోకేశుని పాదసేవ - చాలా మంచి భావములు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి, మిత్రబృందానికి
    కుశలానుయోగపూర్వక ప్రణామం!

    1) “లోకులు కాకు” లంటారు కదా, నిజానికి లోకుల కంటె కాకులే నయం!

    ఆకులపాటొదవింపక
    గైకొని పితృదేవకవ్యఘటఁ బారణవే
    ళాకృతి లోకుల కంటెను
    చీ, కాకులె సుఖము నొసఁగి చింతలఁ బాపున్.

    పితృదేవ – కవ్యఘటన్ - కైకొని = పితృకార్యవేళ సమర్పించే ఇష్టాహారరూప పిండములను స్వీకరించి; పారణవేళా-కృతి = పారణ సమయంలో ధన్యత నొందిన.

    2) చిన్నప్పుడు తెలియక ఎంత కష్టపెట్టినా, సువ్యక్తులైనాక ఆ పిల్లలే తల్లిదండ్రులకు సంతోషాతిశయాన్ని కలుగజేస్తారు.

    హ్రీకంబు నాట నెక్కటి
    శోకం బొడఁగూర్చి, పెరిగి, సువ్యక్తులు నౌ
    తోకము పేరిఁటి తొల్లిఁటి
    చీకాకులె సుఖము నొసఁగి చింతలఁ బాపున్.
    హ్రీకము = బాల్యము; తోకము = సంతానము.

    శ్రీకరమౌ పరమేశుని
    లోకైకారాధ్యపదవిలోకనప్రాప్తా
    స్తోకతరపుణ్యపరులకుఁ
    జీకాకులె సుఖము నొసఁగి చింతలఁ బాపున్.


    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  18. గుంటూరు జిల్లా నరసరావు పేట వద్ద నున్న కోటప్ప కొండ పై శివుడు' త్రికోటేశుని ' గా ప్రసిద్ధి. ఆ కొండ పైకి కాకులు రాక పోవటం ఆ స్థల మహాత్మ్యము.

    ఏకాకులు దరిజేరని
    యా కోటేశుని గిరి దరి యర్చన జేయన్
    లోకేశుడు తొలగించును
    చీకాకులె, సుఖము నొసఁగి చింతలఁ బాపున్.

    రిప్లయితొలగించండి
  19. డా. ఏల్చూరి మురళీధర రావు గారు ముచ్చటైన మూడు పూరణలు వ్యాఖ్యాసమేతముగా వ్రాసేరు. ప్రశంసనీయములు - ఉత్తమభావములు కలిగినవి. వారికి అభినందనలు. స్వస్తి

    రిప్లయితొలగించండి
  20. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు కోటప్ప కొండ విశేషాలను ఉట్టంకించేరు. అక్కడి శివుని ఆరాధిస్తే చీకాకులు పోవును, చింతలు దీరును అన్నారు -- చాలా బాగున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. యేకాకి వంటి బ్రతుకున
    రాకూడని యిడుము లనగ రావలదు మహిన్ !
    కాకుత్సుని వలె నోర్చిన
    చీకాకులె సుఖము నొసఁ గి చింతలఁ బాపున్ !

    రిప్లయితొలగించండి
  22. అమ్మా! రాజేశ్వరి గారూ! కాకుత్స్థుని జీవితమును ఆదర్శముగా తీసుకోవాలనిన మీ పద్యము, భావము చాల ఉత్తమముగా నున్నాయి. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. పూజ్య గురువులు శ్రీ పండితుల వారికి పాదాభి వందనములు. " ఈ మధ్య మనసు బాగుండక , కుస్తీ పట్టలేక వదిలేసాను . ఈ రోజు ఎందుకో వ్రాయాలని పించి వ్రాసి నందుకు తమరి ప్రశంస ఎంతో ఆనందాన్ని కిలిగిం చింది ధన్య వాదములు
    " క్షమించాలి .అన్ని విధాలా అల్పురాలనైన నన్ను...." గారు " ...అని అనుబంద్ధాన్ని దూరం చేయడం ప్చ్ ! బాధగా ఉంది ,రాజేశ్వరి అనో , సోదరి అనో పిలిస్తే ధన్యు రాలను సెలవు

    రిప్లయితొలగించండి
  24. అమ్మా సోదరి రాజేశ్వరీ!
    అందరినీ గౌరవించే సంస్కారము కలిగి ఉండాలి అనీ నా ఆకాంక్ష. మీ వంటి కొందరు నన్ను మీలాగే ఏకవచనముతో సంబోధించ మంటున్నారు. సరే. మీరు చాల అల్పురాలిని అని అనుట భావ్యము కాదేమో అనుకొనుచున్నాను. అట్టి భావము కేవలము భగవంతుని ముందే ఉండాలి. మనమంతా సమానులమే. భక్తిభావములో నేను చాల వెనుకబడి యున్నాను. అందుచేత నా సంస్కారము ప్రకారమే "మీరు" అనే సంబోధించుతాను - ఆనందముగా గ్రహించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  25. పంతుల రాజారావు గారి వచనకవితకు నా పద్యానుకృతి.....

    చీకాకు నొసఁగుఁ జింతలె
    యేకమ్ముగ ధ్యనముద్ర నెసఁగఁగ తనువే
    ప్రాకటముగ రెట్టింపగు
    చీకాకులె సుఖము నొసఁగి చింతలఁ బాపున్.

    రిప్లయితొలగించండి
  26. పండిత నేమాని వారూ,
    నా మనవిని మన్నించి కవిమిత్రుల పూరణ గుణదోషాలను పరామర్శిస్తున్న మీకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటున్నాను.
    *
    సరసంగా, సమర్థవంతంగా, సహృదయరంజకంగా, వైవిధ్యంగా పూరణలు చేస్తున్న
    పండిత నేమాని వారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సహదేవుడు గారికి,
    సుబ్బారావు గారికి,
    జిగురు సత్యనారాయణ (అప్పుడప్పుడు నల్లపూస అవుతుంటారు) గారికి,
    the other (ఇంకెవరు చంద్రశేఖర్?) గారికి,
    వసంత కిశోర్ (అయితే అతివృష్టి - లేకుంటే అనావృష్టి) గారికి,
    ఏల్చూరి మురళీధర రావు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    నేదునూరి రాజేశ్వరి అక్కయ్య గారికి,
    ............... అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. మొదటిది తమాషాగా--

    బాకాలనూది ఘనులకు,
    కాకాలను పట్టు నీదు కార్యము దీర్పన్
    మైకాసురుడవు కాగా ,
    చీకాకులె సుఖము నొసగి ,చింతల బాపున్.

    రెండవది సీరియస్గా--

    రాకాసుధాకరవదను
    డా కేశవుని స్థిరబుద్ధి నర్చింపంగా
    మాకీయండె కటాక్షము
    చీకాకులె సుఖమునొసగి చింతల బాపున్.

    రిప్లయితొలగించండి
  28. ఏకాంత సేవ జేయుచు
    రాకేందు వదనుని గొల్చి రక్షణ గోరన్
    తోకలు ముడుచుచు తొలగును
    చీకాకులె, సుఖము నొసఁగి చింతలఁ బాపున్?

    ప్రశ్న: ఏ కాంత?
    ఉత్తరం: నా కాంతయె!

    రిప్లయితొలగించండి
  29. భాజపా శకుని మామ:

    ఆకలిని తాళ జాలక
    కాకుల వోలుచును వ్రాలె కాంగ్రెసు నేతల్
    ప్రాకటముగ మన వైరుల
    చీకాకులె సుఖము నొసఁగి చింతలఁ బాపున్

    రిప్లయితొలగించండి