20, ఆగస్టు 2012, సోమవారం

సమస్యాపూరణం - 798 (పరశురాము నోడించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...

పరశురాము నోడించె రావణుఁడు గినిసి.

11 కామెంట్‌లు:

  1. లంకలో రాక్షసాళి పర్వముల జరిపి
    రొక్క నాటకమందట నూకదంపు
    మాట నేర్పరి పలికె నీ వాటముగనె
    పరశురాము నోడించె రావణుడు గినిసి

    రిప్లయితొలగించండి
  2. కరము బట్టిన రాముడు కరుణతోడ
    పరశు రాము నోడించె; రావణుఁడు గినిసి
    చేయ కూడని పనుల జేసినపుడు
    జీవహరణము జేసియు జేర్చె దనను.

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _______________________________

    భీషణంబైన యుద్ధాన - భీష్ము డంత
    పరశురాము నోడించె ! రా - వణుడు గినిసి
    పడతి సీతను మ్రుచ్చిలి - పదము పన్ని
    ప్రభువు రాముని చేతిలో - పతనమాయె !
    _______________________________
    పదము = మోసము

    రిప్లయితొలగించండి
  4. శివ ధనుస్సును విరిచిన సీత భర్త
    పరశురాము నోడించె, రావణుడు గినిసి
    సీత నెత్తుకు వెడలగ చెలగి వాని
    గూల్చి వేసెను రణమున కుపితు డగుచు.

    రిప్లయితొలగించండి

  5. కరము కోపించి రాముడు శరము తోడ
    పరశు రాము నోడించె, రావణుడు గినిసి
    యాంజనేయుని దునుమాడ నాన తీ య
    లంక గాల్చెను రాముని లెంక యపుడు

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    ఊకదంపు మాటగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    విరుపుతో చక్కని పూరణ చేసారు. అభినందనలు.
    మూడవ పాదంలో ‘పనులను’లో ‘ను’ టైపు చేయడం మరిచినట్టున్నారు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. ఔనండి గురువు గారు,
    గమనించకుండా వదిలేశాను. ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  8. జానకిని బెండ్లియాడెను జనకునింట
    పరశురాము నోడించె రావణుడు గినిసి
    చెల్లి మాటకు సీతను చెరను బట్ట
    రాఘవుడు ద్రుంచి జగతికి రక్ష నిడెను.

    రిప్లయితొలగించండి
  9. పరశురాముని,రావణ పాత్రధారు
    లిర్వురికలహమదిమీఱి హెచ్చి వారు
    లేచి కొట్టుకొనగ తెర లేచి నంత
    పరశురామునోడించె రావణుఁడు గినిసి

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
    మీ పద్యము బాగున్నది. దాని అన్వయము మాత్రము సులభముగ లేదు. భావము ఎక్కువ - పద్యము చిన్నది అయి కుదించుట జరిగినది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. "జనకునింట" అనవచ్చా లేక "జనకుని యింట" అనవలెనా? లేదా రెండూ కరక్టేనా?

    రిప్లయితొలగించండి