31, ఆగస్టు 2012, శుక్రవారం

పద్య రచన - 98

 కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. ఓంకారమ్మది తుమ్మెద
    ఝుంకారము వోలె నుండు జూడగ మదిలో
    సంకాశము గలిగించున
    హంకారములే నశించు నానాదముతో.


    రిప్లయితొలగించండి

  2. ఓం నమశ్శివాయ ,శివాయ నమః

    ఓం కారము బ్రహ్మాయెను
    హ్రీం కారము విష్ణు వయ్యె నిజముగ నిలలో
    ఐం కారము శ ర్వా ణిగ
    శ్రీం కారము లక్ష్మి గాగ శ్రేయం బయ్యెన్ .


    రిప్లయితొలగించండి
  3. ఓంకారమే బ్రహ్మ మోంకారమే విశ్వ
    ....మోంకారమే సర్వ మోం నమోస్తు
    ఓంకారమే జ్ఞాన మోంకారమే నాద
    ....మోంకారమే యాద్య మోం నమోస్తు
    ఓంకారమే సర్గ మోంకారమే స్థితి
    ....యోంకారమే లయ మోం నమోస్తు
    ఓంకారమే దైవ మోంకారమే గురు
    ....డోంకారమే హితు డోం నమోస్తు
    ఓం సమస్త మంత్ర ప్రాణ మోం నమోస్తు
    ఓం సమస్త మాయాతీత మోం నమోస్తు
    యోగివర్య సదా ధ్యేయ మోం నమోస్తు
    యోగసిద్ధి ప్రదాయక మోం నమోస్తు

    రిప్లయితొలగించండి
  4. మురళీధరులకూ నేమాని పండితులకూ సాదర ప్రణామములు. ప్రణవ తత్త్వాన్ని ఆద్భుతంగా ఆవిష్కరించారు. ఇక్కడ నాలాటి పామరుడు పద్యాన్ని పెట్టడం హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ సాహసం నేను చేయలేను వారి ఆశీస్సులను కోరడంతప్ప.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ గురువులకు, పెద్దలకు
    విహితానేకప్రణామములు.

    ఏ మంత్రోపాసనమున
    ధీమంతులు భవజలధి నతిగమించి మహా
    భూమానందము నొందెద
    రా మంత్రము మా కభయనిరత్యయ మొసఁగున్.

    మూఁడు సుఖంబులు మూఁడు గుణంబులు
    మూఁడు కాలంబులు మూఁడు గతులు
    మూఁడు దేహంబులు మూఁడు విరక్తులు
    మూఁడు తాపంబులు మూఁడు ధృతులు
    మూఁడు లోకంబులు మూఁడు స్థానంబులు
    మూఁడు జీవంబులు మూఁడు స్థితులు
    మూఁడు కర్తృత్వముల్ మూఁడు కర్మంబులు
    మూఁ డైన దీక్షలు మూఁడు మతులు

    మూఁడు వర్ణంబు ల-ఉ-మ ల మేలనమున
    వెలసి జన్మకర్మాత్మనిర్బీజ మగుచు
    జీవమును బ్రహ్మమును పరదైవతమును
    నయిన యోంకారమంత్రంబు నాత్మఁ గొలుతు.

    ఓంకారాభిధమంత్రబంధశుభవర్ణోర్జస్వలప్రౌఢిమా
    లంకర్మీణ! భవార్తభక్తజనకళ్యాణైకపారీణ! భా
    వాంకూరశ్లథనైకదక్ష! దురితవ్యాఘ్రాశిహర్యక్ష! య
    స్తుంకారమ్మును జూపి బాపవె మనోదుఃఖమ్ము నాత్మేశ్వరా!

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  6. ఓంకారమేప్రణవమది
    సంకరముగ సర్వదైవ సాకారంబున్
    సంకీర్తనాళిఁ బాడగ
    నో౦కారమునాదిను౦డి నుచ్చ్వాసంబౌ!

    రిప్లయితొలగించండి
  7. అయ్యా! మిస్సన్న గారూ! శుభాశీస్సులు. మీకు మాయందున్న అభిమానమునకు గౌరవమునకు చాల సంతోషము. మీ వంటి వారి పద్యరచన రీతి మెరుగు పడాలనే మన బ్లాగు లక్ష్యము కదా. మేము పద్యములను వ్రాయుట మీవంటి వారికి మార్గ దర్శకులుగా ఉండాలనియే కాని వేరొక్క భావములేదు. అందుచేత మీరు మీ శక్తికి తగినట్లు పద్యములు వ్రాయాలనియే మా ఆకాంక్ష. చక్కగా వ్రాయుటను కొనసాగించండి. ఈ మధ్య నేను గమనించుచున్నాను - మీ పద్య రచన భేషుగా నున్నది. ఈరోజు కూడా పద్యము(ల)ను వ్రాయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. డా. ఏల్చూరి వారి మూడు పద్యములు బాగున్నవి. మూడుతో సీసపద్యము వారి మూడు(mood) బాగుగ నున్నది అనుటకు నిదర్శనము. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. అ ఉ మ మాత్రల కూడిక యగు ప్రణవము
    మరొక దెసనుండి గనుచు ఉ మ అ ల జేర్చ
    నలరుచుండు "ఉమా" జగదంబ యగుచు
    అందుచే నుమా యనిన బ్రహ్మమ్మె సుమ్ము

    రిప్లయితొలగించండి
  10. అయ్యా సుబ్బారావు గారూ! శుభాశీస్సులు. మీ పద్యమును చూచేను. మీ ప్రయత్నము బాగున్నది. 2 వ పాదములో యతి మైత్రిలేదు. ఓం ఐం హ్రీం శ్రీం లను గురించి నాకు తెలిసిన ఒక్క విషయము వ్రాయుచున్నాను.

    ఓం = పరంబ్రహ్మ తత్త్వము
    ఐం = జ్ఞాన బీజము (సరస్వతి)
    హ్రీం = శక్తి బీజము (ఆదిశక్తి)
    శ్రీం (శ్రియం) = లక్ష్మీ తత్త్వము

    ఓం అనే పరబ్రహ్మములో మిగిలిన మూడు బీజములు (ఐం, హ్రీం, శ్రీం) అంతర్లీనమై యుంటాయి.

    మహాకవి బమ్మెర పోతన ఈ 4 మంత్రములను మహత్త్వ, కవిత్త్వ, పటుత్త్వ, సంపదల్ అని తమ పద్యములో పేర్కొనెను.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ఇంతకీ మదిలో దేనితో సంకాశం కలిగిస్తుంది?
    *
    సుబ్బారావు గారూ,
    బీజాక్షరాలు విన్యాసం మీ పూరణలో ప్రశంసనీయం.
    ‘బ్రహ్మ యయెను’ అందాం. రెండవ పాదంలో ‘నిజముగ’ను ‘హితముగ’ అని మార్చితే యతిదోషం తొలగుతుంది.
    నేమాని వారి సూచన ప్రకారం పద్యాన్ని మార్చి వ్రాస్తానన్నారు. ఎదురు చూస్తున్నాను.
    *
    పండిత నేమాని వారూ,
    ‘ఓం’ శబ్దానికి వెయ్యి అర్థాలట! మిస్సన్న గారన్నట్లు ప్రణవ తత్వాన్ని చక్కగా వివరించారు. ధన్యోస్మి!
    కవిమిత్రుల పద్యాలపై వ్యాఖ్యానిస్తూ వారికి సముచితమైన సూచనలను ఇస్తున్నందుకు కృతజ్ఞుడను.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ఓంకార ప్రాశస్త్యాన్ని అద్భుతంగ వర్ణించారు. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    భావం కొద్దిగా తికమక పెడుతున్నా పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    నేమాని వారి ప్రోత్సాహక వ్యాఖ్యను చూశారు కదా! పదండి ముందుకు...!

    రిప్లయితొలగించండి
  12. శ్రీ లలితా పరమేశ్వరీ దేవిని పరబ్రహ్మ స్వరూపిణిగా వర్ణించుచు నేను సర్వమంగళ స్తోత్రములో వ్రాసిన పద్యము:

    ఓమ్మను పుండరీకమున నొప్పెడు పద్మభవాండ పాలినీ!
    ఐమ్మను జ్ఞానమందిరమునందు జెలంగెడు వేదసంస్తుతా!
    హ్రీమ్మను క్షేత్రరాజమున హృద్యముగా విహరించు నీశ్వరీ!
    శ్రీమ్మను నీ పదాంబురుహ సీమను మ్రొక్కెద సర్వమంగళా!

    తాత్పర్యము: సర్వమంగళ స్వరూపిణియైన ఓ! లలితా పరమేశ్వరీ దేవి:
    ఓమ్మను పుండరీకమున (పద్మమునందు) (సహస్రదళ పద్మస్థా!) ఉండుదానా;
    ఐమ్మను జ్ఞానమందిరము నందు తిరిగెడు వేదస్తుత్యయైన దానా! (సరస్వతీ దేవి);
    హ్రీమ్మను క్షేత్రరాజమున విహరించు దానా! (క్షేత్రేశి) (పార్వతీ దేవి);
    శ్రీం (శ్రియం)(లక్ష్మీ దేవి) అను నిను జేరి నీ పాద పద్మసీమను మ్రొక్కెదను.

    రిప్లయితొలగించండి
  13. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఓంకారము :

    01)
    _______________________________

    ఆది శంకరు జనితమై - యలరుచున్న
    శబ్దముల లోన నత్యంత - శక్తి యున్న
    ఆది శబ్దము; నోంకార - మవని లోన
    ఉచ్ఛరించిన పాపము - లెల్ల తొలగు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  14. నేమాని పండితార్యా వెన్ను తట్టే మీ ప్రోత్సాహానికీ, సూచనకూ ధన్యవాదములు. అంటే యిక్కడ నీయబడిన అంశం విశేష తత్త్వముతో కూడుకొన్నదగుట చేత అంత పరిజ్ఞానము లేని నేను పద్యం వ్రాస్తే పేలవంగా ఉంటుందని అభిప్రాయ పడ్డాను. అయినా మీ సూచననుసరించి నా ప్రయత్నం:


    ప్రణవము నందకారమగు బ్రహ్మము చేయగ సృష్టినెల్ల పో
    షణుడగు నచ్యుతుండయి సదా విలసిల్లు నుకార మింక శో
    షణుడగు కాలుడౌను తుది నుండు మకారము నిట్లనంతమౌ
    ప్రణవము మూల శక్తిగను భాసిలునందురు పండితోత్తముల్.

    రిప్లయితొలగించండి




  15. ఓంకారమ్మె స్వరూపము,
    శంకర నారాయణులకు ,శక్తికి సర్వా
    లంకారము,సత్యమ్ము శి
    వంకరమును,సుందరమ్ము ,ప్రణవ స్వరమై.
    ఓం,సత్యం,శివం,సుందరం.

    రిప్లయితొలగించండి
  16. శంకరార్యా !ధన్యవాదములు. నా పూరణలో చిన్న సవరణ చేయు చున్నాను.

    ఓంకారమ్మది తుమ్మెద
    ఝుంకారము వోలె నుండు జూడగ నదియే
    శాంకరి పుత్రుని రూపమ
    హంకారములే నశించు నానాదముతో.

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి గారు మీ పద్యం బాగుంది.
    ఓంకారమ్మది తుమ్మెద
    ఝుంకారము వోలె నుండు జూడగ నదియే

    రిప్లయితొలగించండి
  18. అయ్యా! మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    నా సూచనను మన్నించి మంచి పద్యమును వెలువరించినారు. శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారు,
    నిన్నంతా బ్లాగు దర్శనము కాలేదు.

    నాదమె బ్రహ్మమయ్యె, శ్రవణమ్ముల కింపగు మంత్రమియ్యదే!
    వేదపు సారమయ్యెను, వివేకము మేల్కొను దారి జూపదే!
    మోదము కూర్చుచుండునిది, ముప్పది మూడగు కోటి దేవతల్
    సాదరమొప్పగా నతుల సల్పుదురెప్పుడు నట్టి రూపమే!

    రిప్లయితొలగించండి
  20. పండిత నేమాని వారూ,
    మీ సర్వమంగళా స్తోత్ర పద్యం మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కాని ఓంకారం ఆదిశంకరజనిత మెలా అయింది?
    *
    మిస్సన్న గారూ,
    ప్రణవాన్ని మూలశక్తిగా వర్ణించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యా ! ధన్యవాదములు
    ఓంకారమంటే -ప్రణవనాదం-అదే ఆదినాదం !
    నాదానికి మూలం శంకరుడే గదా !
    *****
    http://te.wikipedia.org/wiki/%E0%B0%93%E0%B0%82

    ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు.
    ఇదొక ఏకాక్షర మంత్రము.
    ****

    రిప్లయితొలగించండి