సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. "నిజము + అవని" అన్నప్పుడు నుగాగమం రాదు. "నిజము భువిని" అంటే సరి. * చంద్రశేఖర్ గారూ, మీ రడిగాక సందేహం వచ్చి వెదికితే నాకు ఏ నిఘంటువులోనూ "పొడుగరి" శబ్దం కనిపించలేదు. "సొగసరి, గడసరి" శబ్దాల్లాగా స్వీకరిద్దాం. :-) * పండిత నేమాని వారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ఇప్పుడంటే యుక్తవయస్సు వచ్చాక పెళ్ళిళ్ళు చేస్తున్నారు కాని, వెనుకట పొత్తిళ్ళలోని బిడ్డలకే పెళ్ళిళ్ళు జరిగేవి. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యేసరికి భర్త కంటే భార్య పొడుగు ఎదగడం జరిగేది. అలాంటి జంటలను నేను చూసాను కూడ. మీ పూరణ బాగుంది. అభినందనలు.
రిప్లయితొలగించండిపొట్టి వాని భార్య పొడుగ రియట యను
మాట నిజము నవని ,మామ భార్య
పొడుగు మామ కంటె ,గడు సరిది యునౌను
నింతు లుందు రట్లు వింత గాను .
మాస్టారూ, మీ దగ్గరే నా సందేహాలన్నీ వ్యక్తమవుతాయి, తీర్చే మీకు ధన్యవాదాలు. పొడుగరి అనే మాట పుంలింగ పదమనిపిస్తోంది. ఏమంటారు?
రిప్లయితొలగించండిపొట్టివాడు చాల గట్టివాడందురు
రిప్లయితొలగించండివాని మించు పొట్టివాని భార్య
పొడుగరి యట చాల గడుసరి బాపురే
వానినేని మించు వాని భార్య
గుండు మధుసూదన్ గారి పూరణ....
రిప్లయితొలగించండిదుష్ట శిక్షకుండు; శిష్ట రక్షకుఁడైన
హరియ, వామ నావతరణమునను
బొట్టి! వాని భార్య పొడుగరి యఁట! లక్ష్మి,
వామనునకుఁ బొడవు భార్య కాదె?
విశ్వమెత్తుకలిమి వేల్పైన లక్ష్మిని
రిప్లయితొలగించండివిశ్వరూపుడైనవిష్ణువంద
వామనునిగ బలిని పాతాళ మంపిన
పొట్టివానిభార్యపొడుగరియఁట!
అద్దె యింటి కొరకు నచట జేరెను వాడు
రిప్లయితొలగించండిపొట్టి, వానిభార్యపొడుగరి, యఁట
అమ్మ లక్క లంత హవ్వవ్వ యనుచును
బుగ్గ నొక్కు కొనిరి సిగ్గు యనుచు.
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
"నిజము + అవని" అన్నప్పుడు నుగాగమం రాదు. "నిజము భువిని" అంటే సరి.
*
చంద్రశేఖర్ గారూ,
మీ రడిగాక సందేహం వచ్చి వెదికితే నాకు ఏ నిఘంటువులోనూ "పొడుగరి" శబ్దం కనిపించలేదు. "సొగసరి, గడసరి" శబ్దాల్లాగా స్వీకరిద్దాం. :-)
*
పండిత నేమాని వారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఇప్పుడంటే యుక్తవయస్సు వచ్చాక పెళ్ళిళ్ళు చేస్తున్నారు కాని, వెనుకట పొత్తిళ్ళలోని బిడ్డలకే పెళ్ళిళ్ళు జరిగేవి. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యేసరికి భర్త కంటే భార్య పొడుగు ఎదగడం జరిగేది. అలాంటి జంటలను నేను చూసాను కూడ.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
కుట్టి మామ కొడుకు పొట్టిని మరదలు చిట్టి పెళ్ళాడితే :
01)
_______________________________
కుట్టి పట్టి పొట్టి ! - చిట్టికి బావౌను !
చిట్టి కన్న పొట్టి - పొట్టి బావ !
చిట్టి , పొట్టి ,చెట్ట - బట్టిరి ప్రేమంబు !
పొట్టివాని భార్య - పొడుగరి యఁట !
_______________________________
చెట్టపట్టు = పెండ్లి
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండివృత్యనుప్రాసతో మీ పూరణ అలరిస్తున్నది. అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండి