28, ఫిబ్రవరి 2013, గురువారం

సమస్యాపూరణం – 980 (కారమె మత్సరముఁ గూర్చి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

36 కామెంట్‌లు:

  1. పరపతి పెరుగుట గనుచును
    కురు రాజుకు పాండవులన కునుకున్ లేకన్
    దురభిప్రాయపు దురహం
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్.

    రిప్లయితొలగించండి
  2. అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గారు మీ పద్యమును మార్చండి.
    ప్రాస నియమమును పాటించలేదు కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. క్షీరార్ణవ మథనము తఱి
    యా రాక్షస సురల నడుమ యంతర మెసగన్
    శౌరి ధరించిన మోహా
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్.

    రిప్లయితొలగించండి
  4. శర్మగారూ, శ్రీనేమానివారి యుద్దేశం నాలుగుపాదాల్లోనూ ప్రథమంగా గురువు నుంచవలెననొ చెప్పటం అనుకుంటాను. సమస్యాపాదంలో ప్రథమాక్షరం గురువు కదా. ఇలా ప్రాసనియమం గల పద్యాల్లో ప్రధమాక్షరాలన్నీ ఐతే గురువులైనా కావాలి లేకుంటే లఘువులైనా కావాలనేది సాధారణనియమం.

    రిప్లయితొలగించండి
  5. రారాజు మును మయసభా
    గారమ్మున భంగపడెను కట్టలిగిన యా
    కౌరవపతికిన్ దురహం
    కారమె మత్సరము గూర్చి కలహము రేపెన్

    రిప్లయితొలగించండి
  6. శ్రీ పండితులవారికి, శ్రీ శ్యామలరావు గారికి ప్రణామములతో పద్యమును సవరించుచూ

    కౌరవపతి పాండవులకు
    గౌరవమర్యాదలొప్ప కాఠిన్యముతో
    దారుణ రీతిని దురహం
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్.

    రిప్లయితొలగించండి
  7. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శ్యామల రావు గారూ,
    శ్రీ నేమాని వారి ఉద్దేశ్యాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ తోపెల్ల వారి పద్యానికి సంస్కరణం అనుకోవాలా లేక స్వకీయపూరణగా స్వీకరించాలా?
    మొత్తానికి హృద్యంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
    శ్రీ తోపెల్ల వారి భావము నా భావము ఒకటే అగుట కాకతాళీయము వంటిది. ఎవరి పద్యము వారిదే. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. కౌరవ పాండవు లిరువురి
    కారయగా జదువు నేర్పె యా ద్రో ణు డెగా
    వారిలొ కర్ణుని దుర హం
    కారమె మత్సరము గూ ర్చి కలహము రేపెన్

    రిప్లయితొలగించండి
  10. కూరిమితో నుండక యధి
    కారము దుర్యోధనుండు కాంక్షించెనుగా
    పారము లేనిదగు నహం
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్.

    రిప్లయితొలగించండి
  11. నారదుడు ముళ్ళయతి గద !
    శ్రీరమణుకు దానవులకు చిచ్చును బెట్టున్
    వారలు రాక్షసుల కహం
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్.

    రిప్లయితొలగించండి
  12. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "నేర్పె నా ద్రోణుడె" అవుతుంది. అక్కడ యడాగమం రాదు. "లో" ప్రత్యయాన్ని హ్రస్వంగా వాడరాదు. అక్కడ .. వారికి.. అందాం.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. ధన్యవాదములు ।శ్రీ శంకరయ్యగురుదేవులకు, శ్రీ నేమాని పండితవర్యులకు ,పెద్దలకు వినమ్రవందనములు
    రైతులు కష్టములకు క్రుంగు చున్నారు, వారిని కప్పము గట్టమని యడుగ
    ========*========
    కారెము లో నీరు దరిగి
    కారాగారమును జేర కర్షకు లెల్లన్
    కారుణ్యము జూపకడుగ
    కారమె,మత్సరము గూర్చి కలహము రేపెన్।
    (కారము = కప్పము )

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకరయ్యగురుదేవులకు,శ్రీ నేమాని పండితవర్యులకు ,పెద్దలకు వినమ్రవందనములు
    ========*=========
    దారుణ బాధల కోర్వక
    శ్రీరాముని దిట్టి రామ రామా యనుచున్
    కారుణ్యము జూపు స్వామీ।
    కారమె ,మత్సరము గూర్చి కలహము రేపెన్ ।
    భారము నీదని వేడితి
    శ్రీరామా। దారుణముగ సేవక తతిచే
    కారాగారము జేరితి।
    కారమె,మత్సరము గూర్చి కలహము రేపెన్ ।
    (కారము = కప్పము )

    రిప్లయితొలగించండి
  15. శ్రీ రామ దాసు గారు బాధల కోర్వక
    ========*=========
    ఘోరము ,భక్తుల కెల్లను
    భారము నీ నామము కడు పాపము రామా।
    దారుణ బాధలు ద్రుంచవు
    కారమె,మత్సరము గూర్చి కలహము రేపెన్ ।
    కారుణ్య మూర్తివందురు
    కారాగారమున కష్ట కాలమునందున్
    యేరా । వేడిన జూడవు
    కారమె, మత్సరము గూర్చి కలహము రేపెన్ ।

    రిప్లయితొలగించండి
  16. వీరము నందున రాక్షస
    రారాజులమేరువైన రావణుమదిలో
    దూరిన ఘోరపు మోహవి
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్!!!

    రిప్లయితొలగించండి
  17. ఏరయ్య మత్స్యయంత్రపు
    తీ రెరిగిన వారు నరునదే జయ మనగా
    వీరుడు దాల్చిన విప్రా
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్.

    రిప్లయితొలగించండి
  18. ఓరిమి కొంతైనను మరి
    కౌరవపతి కల్గడాయె గణనీయంబౌ
    కౄరత్వమమితదురహం
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్.

    రిప్లయితొలగించండి

  19. కౌరవ పాండవ యుద్ధము
    ఘోరముగను జరిగె నందు గూలెను సేనల్
    రారాజు మూర్ఖ దురహం
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్.

    రిప్లయితొలగించండి
  20. చారలు పడిన శరీరం
    బూరిన పొట్టయును చాల యుబ్బిన ముఖముం
    జేరిన క్షణమున తన యా
    కారమె మత్సరము గూర్చి కలహము రేపెన్.

    రిప్లయితొలగించండి
  21. నారదుడు కలహాశను డట
    యా రుక్మిణి కొసగె విరియని సత్యకు దెలుపన్ !
    వారిరువురి నడుమ నహం
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్ !

    రిప్లయితొలగించండి
  22. వరప్రసాద్ గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    "కారుణ్యము జూపు స్వామీ" అన్నచోట గణదోషం. "కారుణ్యము జూపుము దొర!" అందామా?
    *
    మంద పీతాంబర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    శ్యామలరావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    అన్నట్టు... అది క్రూరత్వమే.. కౄరత్వము కాదు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం.
    యా రుక్మిణి కొసగెను విరియని సత్య వినన్... అని సవరిద్దాం.

    రిప్లయితొలగించండి

  24. బాబ్లి పై మహారాష్ట్ర ప్రభుత్వ వాదన
    ========*========
    వారికి భారము గాదుగ
    వారి జలము వారికిచ్చు వారము సుమ్మీ।
    వారధి పై గట్టిన ప్రా
    కారమె,మత్సరము గూర్చి కలహము రేపెన్।

    ఆంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాదన
    ========*========
    వారధి నీటన గట్టిరి
    వారధి।వరముల నొసగెడి వారధి పాడై
    ఘోరకలి మిగుల్చెడి యా
    కారమె,మత్సరము గూర్చి కలహము రేపెన్।

    రిప్లయితొలగించండి
  25. కారము తగు పాలు పడిన
    కూరకు రుచి, ప్రక్క యింటి కోమలి చెంతన్
    జేరి తెలిసి వండుమనిన
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్!!

    రిప్లయితొలగించండి
  26. సారపు ధర్మముఁ దప్పిన
    కౌరవ పతి సుతులు జేయు కార్యంబులకున్
    నోరాడక జూపిన మమ
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్!!

    రిప్లయితొలగించండి
  27. క్రూరుండై సద్దాం మితి
    మీరి నిరంకుశ విధము నమెరికా ప్రభుతన్
    వారించ జూచెడు నహం
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్!

    రిప్లయితొలగించండి
  28. ధీరత తోడ నొక యువతి
    కోరి విదేశములు బోయి కూరిమి తోడన్
    తేరగ తెచ్చిన సొమ్ము "ల
    కారమె" మత్సరము గూర్చె కలహము రేపెన్.

    రిప్లయితొలగించండి
  29. చిన్న మార్పుతో

    ధీరత తోడ నొక యువతి
    కోరి విదేశములుబోయి కూరిమి తోడన్
    కోరగ తెచ్చిన సొమ్ము "ల
    కారమె" మత్సరము గూర్చె కలహము రేపెన్.

    రిప్లయితొలగించండి
  30. గురువుగారికి ధన్యవాదాలు.

    ఇదివరకే రెండుసార్లు క్రూరత్వాన్ని (క్రూ ) సవరించినారు. అయినా మళ్ళీ అదే తప్పు.

    దిద్దుకుంటానండీ. ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  31. వరప్రసాద్ గారూ,
    బాబ్లీ ప్రాజెక్ట్ విషయంగా మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ రెండు పూరణలూ వైవిధ్యంగా అలరించాయి. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    సద్దాం హుస్సేన్ విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. జోరుగ వానలు కురియగ
    కోరిక మీరంగ పండి కూలగ విలువల్
    బారుల గోనెల మిరపల
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్

    రిప్లయితొలగించండి
  33. మీరిన మైత్రిని రేతిరి
    తీరికగా నావకాయ తినితిని చోరుల్
    దూరగ నింటిని కడుపున
    కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్

    రిప్లయితొలగించండి