1, మే 2014, గురువారం

సమస్యాపూరణం - 1399 (శోభనంపు రాత్రి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శోభనంపు రాత్రి సుతుఁడు పుట్టె.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

  1. శోభనంపు రాత్రి సుతుడు పుట్టెను క్రొత్త
    జంట యూహలందు సరసగతుల
    చందమామబోలు నందాల బాలుండు
    వంశ వర్ధనుండు భద్రమూర్తి

    రిప్లయితొలగించండి
  2. శివుని పూజ జేసె శివరాత్రి గానెంచి
    శోభ నంపు రాత్రి సుతుడు బుట్టె
    చక్క నైన కబురు సంతసం బుగవిని
    భర్గు పేరు బెట్టె భాగ్య మనుచు

    ఇక్కడ శోభనము = మంగళము , శుభము ,సుందరము

    రిప్లయితొలగించండి
  3. చక్క నైన వాడు పెండ్లాడి సత్యవతిని
    జీవితమ్ము గడుప చెలిమితోడ
    పూజ్యులైన వారి పుణ్యఫలముగాను
    శోభనంపు రాత్రి సుతుడు పుట్టె

    రిప్లయితొలగించండి
  4. చెలియ రూపుజూచి చెలియలు బొగడిరి
    శోభనంపు రాత్రి; సుతుఁడు పుట్టె
    నామె రూపు మించి నలకూబరుండన
    వత్చరాంతమందు వరుని బోలి .

    రిప్లయితొలగించండి
  5. తనకొడుకుతో కోడలిని ( శోభ ను ) పంపమని ఒక తండ్రి చెప్తున్నట్లుగా......

    నీదుసోదరికిని, నెలలునిండగ నిన్న
    ప్రసవమయ్యెనయ్యె పనులకొఱకు
    నాడువారు వలయు నాలోచనకుబోక
    శోభనంపు, రాత్రి సుతుఁడు పుట్టె.

    శోభను + అంపు = శోభనంపు

    రిప్లయితొలగించండి
  6. పుత్ర సంతతికయి పూబోడి తపియించె
    కలలు పండె నామె కలత దీరె
    నిండు చందమామ పండు వెన్నెల రోజు ,
    శోభనంపు రాత్రి సుతుడు పుట్టె

    రిప్లయితొలగించండి
  7. క్రొత్త జంటకు నిడె కొంగ్రొత్త కానుక
    అన్న రాజు పత్ని అరుణ తార
    మురిసిననుజుడైన మురళితోననె నీదు
    శోభనంపు రాత్రి సుతుడు పుట్టె !!!

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    విభవమొప్పపెండ్లి వేడుక జరిగె నా
    నంద మిచ్చె శోభ నంపు రాత్రి.
    సుతుడు పుట్టె వధువు సోదరి కనుచును
    వధువు,వరుడులెస్స వార్త వినిరి

    రిప్లయితొలగించండి
  9. కోరుకున్న వరుని కొంగున ముడివేసి
    పెండ్లి జేసి పంపె పెద్దవారు
    శ్రీజ కలలు పండి శ్రీరామ నవమిన
    శోభనంపు రాత్రి సుతుడు బుట్టె

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. మరులు గొన్న వరుడు మాఘ మాసంబున
    పెద్ద వారు మెచ్చ పెనిమిటైన
    సరస సౌరభాన శరదృతు పౌర్ణమి
    శోభ నంపు రాత్రి సుతుడు బుట్టె

    రిప్లయితొలగించండి
  12. ఆలు మగలిరువురు హాయి కులుకుదురు
    శో భనం పు రాత్రి, సుతుడు పుట్టె
    నెట్టకేలకు మఱి యేసు దాసునకట
    చూచి వత్త మార్య సూతు రండి

    రిప్లయితొలగించండి
  13. మీరె దిక్కననుచు మిక్కిలి ప్రార్థింప
    ప్రక్కనూరు వెడలె వధువు వసుధ
    వరుని ననునయించి ప్రసవమ్ము జేయగా
    శోభనంపు రాత్రి, సుతుడు బుట్టె

    రిప్లయితొలగించండి
  14. మిత్రులకు శుభాశీస్సులు.
    ఈ నాటి పద్యములు చాల బాగుగ నున్నవి. కొన్ని సూచనలు:
    శ్రె అన్నపరెడ్డి సత్యనారయణ రెడ్డి గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. 1వ పాదములో గణములు సరిగా లేవు. చూడండి.

    శ్రీ మంద పీతాంబర్ గారు: మీ పద్యము బాగుగ నున్నది.

    మురిసి ననుజుడైన అన్నారు - మురిసి యనుజుడైన అందామా?
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులు మన్నించాలి. నిన్నకూడా రోజంతా నేను బ్లాగుకు అందుబాటులో లేను.
    మంచి పూరణలను అందించిన మిత్రులు....
    పండిత నేమాని వారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    భాగవతుల కృష్ణారావు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    కెంబాయి తిమ్మాజీరావు గారికి,
    శైలజ గారికి,
    సహదేవుడు గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    మిత్రుల పద్యాలను సమీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు.
    *
    అన్నపరెడ్డివారూ,
    మీ మొదటి పాదాన్ని ‘చక్కనౌవాడు చేపట్టి సత్యవతిని’ అందామా?

    రిప్లయితొలగించండి