3, మే 2014, శనివారం

సమస్యాపూరణం - 1401 (కులతత్త్వ మెఱింగి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.
(ఆశాకవాణి వారి సమస్య)

36 కామెంట్‌లు:

  1. కులపథము ననుసరించుచు
    జలజము లారిటిని దాటి సాధకులు మహా
    జలజాటవి జేరెదెరట
    కులతత్త్వ మెరింగియున్న గూడును సుఖముల్

    రిప్లయితొలగించండి
  2. కులమత భేదము లెంచక
    కులతత్వ మెఱింగి యున్న గూడును సుఖముల్
    మలినము మనసును వీడిన
    ఫలితము లభియించు ననగ పాప హరంబౌ

    రిప్లయితొలగించండి
  3. కలుషితవాతావరణము
    పలు రుగ్మత లందఁజేయుఁ బర్యావరణం
    బిలఁ గాపాడు మనెడి పలు
    కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.

    రిప్లయితొలగించండి

  4. లేదు మరి కులము మతము అనుట కల్ల
    వద్దు మరి కులము మతము అనుట డొల్ల
    లౌక్యమున సమయానుసారముగ జనులెల్ల
    కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్



    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. జిలేబీ గారి భావానికి పద్యరూపం....

    కులమతభేదము వలదని
    పలుకుట మఱి కల్ల గాదె పలువురు తమ కో
    ర్కెల సాధించుటకొఱకై
    కులతత్త్వ మెఱింగియున్న గూడును సుఖముల్.

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    ఆధ్యాత్మికభావంతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. వెలుగొందె వాస్త్రుశాస్త్రము
    ఫలితమ్ములనొసఁగి జనుల భయమును ద్రుంచున్
    కలియుగమున తప్పదు, ది
    క్కులతత్త్వమెఱింగియున్నఁ గూడునుసుఖముల్.

    రిప్లయితొలగించండి
  8. ఇల వృత్తి ధర్మము వెలసె
    కులతత్వంబై, కులానుగుణమా గుణముల్ ?
    తెలియన్ లౌక్యంబులు నా
    కులతత్వ మెఱింగి యున్నఁ గూడును సుఖముల్

    రిప్లయితొలగించండి
  9. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ వివిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. చెలిమిని నటించి వెనుకన్
    కలుషితమగు బుద్ధిజూపి కయ్యము జేయన్
    ఖలులై వర్తించెడి పా
    కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.

    ( ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన సమస్యా పూరణ కార్యక్రమమునకు తే19/03/1972 దీ నాటి సమస్యకు ఇది నా పూరణము)

    నేటి పూరణ :--
    కలిమిని గడించ కొందరు
    బలిమిని పదవులను పొంద వాయసములవన్
    కలలను గన నేతలు , కా
    కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.

    రిప్లయితొలగించండి
  12. కలతలు రావుగ యెప్పుడు
    కుల తత్త్వమెరింగి యున్న, గూడును సుఖము
    ల్గలుగును శివు నర్చించిన
    మెలకువగా నుండు మెపుడు మేదిని యందున్

    రిప్లయితొలగించండి
  13. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    దయచేసి మీ దగ్గర ఆకాశవాణి వారి సమస్యలేమైనా ఉంటే పంపించండి. shankarkandi@gmail.com
    *
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    కులములు నాల్గని నయ్యవి
    జలజాక్షుని యంగములని జ్ఞాతమ్మయి పూ
    జలు సేతురు పదముల కీ
    కులతత్వ మెరింగి యున్న గూడును సుఖముల్

    రిప్లయితొలగించండి
  15. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘నాల్గని యయ్యవి’ అని యడాగమం రావాలి.

    రిప్లయితొలగించండి
  16. పలువిధ కార్యము లందున
    కలసిమెలసియె పనులన్ని కావింపవలెన్
    పలువురు కూడినచో సభి
    కుల తత్వమెఱింగి యున్న గూడును సుఖముల్

    రిప్లయితొలగించండి
  17. ఇలకున్ గాలికి నీటికి
    కులమన్నదిలేనెలేదు కువలయమందున్
    కలుషితమతి వలదను కవి
    కులతత్త్వ మెరింగియున్న గూడును సుఖముల్

    రిప్లయితొలగించండి
  18. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో....
    సవరణకు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదముల తో...
    =============*=================
    కకవిక లైనట్టి విపణి,కంఠ పాశము వలె నుండ
    సకల జీవుల శాంతి కొఱకు సంఘ జీవనమున జనుల
    కు కులతత్వ మెరింగి యున్న గూడును సుఖములు,నేటి
    మకిల మకరముల మధ్య మత్యము వోలె దిరుగగ !

    రిప్లయితొలగించండి
  19. చెలిమే కలుగును నిజముగ
    కులతత్త్వ మెరింగియున్న, గూడును సుఖముల్
    పలువురి మంచిని గోరిన
    జలశయనుడు మెచ్చు గాదె జన్మతరించున్

    రిప్లయితొలగించండి
  20. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    మరియొకపూరణ:బలమొక్కటి చాలదు తన
    బలగము నధికార బలము పార్టీ బలమున్
    కులభేదము లేదను బొం
    కుల తత్వ మెరింగి యున్నగూడును సుఖముల్

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు
    1.కులమన సమూహమగుగా
    కులవృత్తులు లేకయున్న కువలయమందున్
    కలుగదు జీవన సరళి యె
    కులతత్వ మెరింగి యున్న గూడును సుఖముల్
    2.కులమేదైనను మానవ
    కులమది యొకటే,కనుగొన గొప్పది లేదే
    కులమున,సమాజమందీ
    కులతత్వ మెరింగి యున్న గూడును సుఖముల్

    రిప్లయితొలగించండి
  22. బలహీనత వీడిన నీ
    దలచిన కార్యమున జయము దక్కుననెడు గో
    కుల కృష్ణుని గీతా వా
    క్కుల తత్వమెఱింగియున్నఁ గూడును సుఖముల్!

    రిప్లయితొలగించండి
  23. పలు రుగ్మతలకు హేతువు
    చల చిత్తము, దాని గట్టి సంయమనమునన్
    మెలగుట మేలు, మనోవ్యా-
    కులతత్త్వ మెరింగియున్న గూడును సుఖముల్.

    పలుకుల కలుపుచు, మంచిగ
    నలువురిలో గానబడుచు, నయవంచకులై
    వలపన్నుచుండు పలుగా-
    కులతత్త్వ మెరింగియున్న గూడును సుఖముల్.

    రిప్లయితొలగించండి
  24. శైలజ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    కందుల వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మత్స్యము... టైపాటువల్ల మత్యము అయినట్టుంది.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.
    మల్లెల సోమనాథ శాస్త్రి గారిని బ్లాగుకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు సంతోషంగా స్వాగతం పలుకుతున్నది.
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. మిస్సన్న గారూ,
    మీ వ్యాకుల, పలుగాకుల పూరణలు రెండూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. కలకాలము మావవ ఈ
    కులమత వైరమును గలిగి కుజనునిరీతిన్
    ఇల మనుదువెన్ని యేడులు
    కులతత్వమెరింగి యున్న గూడును సుఖముల్

    రిప్లయితొలగించండి
  27. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘రీతిన్ + ఇల’ అని విసంధిగా వ్రాయరాదు కదా! ‘కుజనుని వలె నీ / యిల...’ అనండి.

    రిప్లయితొలగించండి
  28. పూజ్యగురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు.వైద్యుని దగ్గరకు వెళ్ళే హడావిడిలో కందము పూరించి నాను. తమరు చూచి నట్టులేరు.
    మూడు రక్త నాళమ్ములు పూడి పోవ
    కోయుటయొ లేక స్టంటుల నేయుటౌనొ
    తెలిసి కొనుటకై సుతునితో కలసి నేడు
    వెళ్ళుచున్నాను వెజ్జుకై భీతితొడ

    రిప్లయితొలగించండి
  29. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    నిజమే! మీ పూరణ నా దృష్టికి రాలేదు. మీ ‘సభికుల’ పూరణ బాగుంది. అభినందనలు.
    మీ అస్వస్థత గురించి తెలిసి బాధపడుతున్నాను. ఇంతకూ డాక్టరుగారు ఏమన్నారు?

    రిప్లయితొలగించండి
  30. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. ఈ రోజు సోమరాజు గారిని కలిశాను. ఏంజియోగ్రాము సి.డి పరిశీలించారు. సర్జనులతో మాట్లాడి మూడు రోజులలో అభిప్రాయం తెలియ జేస్తామన్నారు.

    రిప్లయితొలగించండి
  31. సత్యనారాయణ రెడ్డిగారూ! స్వస్థత చేకూరుతుంది. చిన్తపడకండి.

    రిప్లయితొలగించండి
  32. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
    మీ సవరణకు ధన్యవాదములు
    నీ /యిల అనడానికికంటె నీ /విల అంటె భాగుంటుందేమో నని నా సందేహము

    రిప్లయితొలగించండి
  33. ఇల జీవన యానములో
    పలు పలు విధముల నుడివిన పథముల గతిలో
    అలవేమన చెప్పిన పలు
    కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.

    రిప్లయితొలగించండి
  34. కులములు పలుపలు రకములు
    వెలమలు కాపులు రజకులు బెస్తలు బోయల్
    జిలిబిలి కోటా కొఱకై
    కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్

    రిప్లయితొలగించండి


  35. విలవిల లాడకు రమణీ
    విలువల మరువక జగత్తు వివరంబిదియే
    చెలువము మీర మృదుల పలు
    కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  36. అలవోకగ గెల్చుటకై
    యెలమంచిలి సీటునందు నేడవకుండన్
    పిలిచిన పలికెడు వోటరు
    కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్

    రిప్లయితొలగించండి