5, మే 2014, సోమవారం

సమస్యాపూరణం - 1403 (రవి యుదయింపఁగా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రవి యుదయింపఁగా తమిపరంపర గ్రమ్మె ధరాతలంబునన్.
(ఆశాకవాణి వారి సమస్య)

21 కామెంట్‌లు:

  1. భువిచవిజూచె చీకటిని పుంతలు గుంటలు కానరాక నా
    దివిగల చుక్కలేనిశిని దిక్కయె, వేకువ కాశజెందగా
    దివినరుదెంచు చుండగనే దిన్కరుమూసెనురాహు,వంతలో
    రవి యుదయింపఁగా తమిపరంపర గ్రమ్మెధరాతలంబునన్.

    రిప్లయితొలగించండి
  2. రవి యుదయింపఁగా తమిపరంపర గ్రమ్మె ధరాతలంబునన్.

    రిప్లయితొలగించండి
  3. పవనము వీచుచో సుమము పైచరియించెడు తేనెటీగలున్,
    కువకువలాడు పిట్టలను కోకిలలన్ , తరుశాఖలందునన్
    వివిధములైన పుష్పముల వింతగ వ్రాయుచునుంటి; చిత్రమున్
    రవి యుదయింపఁగా తమిపరంపర గ్రమ్మె ధరాతలంబునన్.

    రిప్లయితొలగించండి
  4. భువి విడి పోయె చీకటులు భూరి దృశానపు కాంతిచేత శ్రీ
    రవి యుదయింపఁగా; తమిపరంపర గ్రమ్మెధరాతలంబునన్
    సవిత నిజేచ్చ బశ్చిమపు సాగర మందున గ్రుంక పూర్తిగా
    సవినయ ధర్మ కర్మముల సాక్షి మహోన్నత సూర్యు డొక్కడే.

    రిప్లయితొలగించండి
  5. దివిజులకెల్ల శత్రువయి ధీనిధిమూర్తులఁగష్టబెట్టి తా
    భువనవిజేతగా నిలచి భూరిపరాక్రమకీర్తిమంతుఁడై
    భువినిటు రావణాఖ్యుఁడయి పొల్చగ భీకర దైత్యవంశ భా
    రవి యుదయింపగా తమి పరంపర గ్రమ్మె ధరాతలంబునన్.

    దైత్యవంశభారవి = రావణుఁడు

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    భువిని చరాచరమ్ము లగు భూతము లన్నియు ఘోష జేసె నా
    దివిజుల గుండె ఝల్లుమనె దిక్కులు ఘూర్ణిలె రావణుండు నీ
    భువి జనియించె కైకసికి పుత్రుడు,మైకము నొందినట్టి యా
    రవి యుదయి౦పగా తమి పరంపర గ్రమ్మెధరాతలమ్మునన్

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    మరియొక పూరణ:శివుడు నటించె రుద్రుడయి స్వీయ సతిన్ తను కోలుపోయి యా
    హవనపుటగ్ని యందు బడ నానతిజేయగ వీరభద్రుడున్
    జవమున జేరె వాటికకు జన్నము ధ్వ౦సమొనర్చె కాలభై
    రవి యుదయి౦పగా తమి పరంపర గ్రమ్మెధరాతలమ్మునన్

    రిప్లయితొలగించండి
  8. రవి యుదయింపగా తమి పరంపర గ్రమ్మె ధరాతలంబునన్
    కువలయముల్ కృశించగను, కోయల గానము విందుజేయగా
    పవనము చల్లగా మెదలి పారవశత్వము గల్గ జేయగా
    భవనము శుద్ధి జేసి వెస పల్లెల స్రీలు పొలంబు కేగెడిన్

    రిప్లయితొలగించండి
  9. క్రమాలంకారము
    నవకమలమ్ములెన్నొ నవనాట్యపు దీధితి వెల్గునెయ్యెడన్?
    రవిగమియింపగా భువిని రాజ్యము చేయునదేమియౌను?మా
    నవులిటు పెంపుగాంచుచును నాగరికమ్మెట వృద్ధిగాంచునో?
    రవి యుదయింపఁగా తమిపరంపర గ్రమ్మె ధరాతలంబునన్.

    రిప్లయితొలగించండి
  10. కువలయ నాథు కైక తను కోరగ కానల కంప రాముడిన్
    వివశత జెంది దాశరథి వేడిన కాదని కోపగించ నా
    యవనిజ నాథుడా జనకు నానతి గైకొని బోవ జూడగన్
    రవి యుదయింపగా తమి పరంపర గ్రమ్మె ధరాతలంబునన్

    రిప్లయితొలగించండి
  11. రవి కిరణమ్ములన్ వెలుగు రాగము నిండెను మెల్ల మెల్లగా
    నవనిని, జీవజాలములు హాయిగ పల్లవి పాడె, పండగా
    దివసకరుండు డస్సి నలుదిక్కుల తారల తోరణాల సౌ-
    రవి యుదయింపఁగా తమిపరంపర గ్రమ్మెధరాతలంబునన్.


    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు మల్లెలసోమనాధశాస్త్రి గారి పూరణ
    రవి యుదయమ్మున౦దగను రాజిత పద్మమునవ్వి విచ్చగా
    చవిగొన నందుతేనెలకుచాలగనాతమితోడు తుమ్మెదల్
    గవయును వానిచుట్టునటు గాంచగ వానిని దోచె నాకు నా
    రవి యుదయింపగా తమి పరంపర గ్రమ్మె ధరాతల౦బునన్

    రిప్లయితొలగించండి
  13. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘దినకరు’ని ‘దిన్కరు’నిగా చేయడం దోషమే... ‘దివి నరుదెంచుచుండగనె త్విట్పతి మూసెను...’ అనండి. (త్విట్పతి = సూర్యుడు)
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ చిత్రలేఖన పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణలో కాలభైరవి అన్నారు. కాలభైరవుడున్నాడు కాని కాలభైరవి లేదు... భైరవి శబ్దానికి పార్వతి అనే అర్థం ఉంది. దక్షాధ్వరధ్వంసంలో సూర్యుడున్నాకూడ చీకట్లు క్రమ్మాయనే అర్థంలో ‘ధ్వంస మొనర్చె నయ్యెడన్/ రవి యుదయింపగా...’ అంటే బాగుంటుందేమో చూడండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీరు తమి శబ్దానికి ‘ఆసక్తి’ అనే అర్థాన్ని గ్రహించారా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు మహదానందంతో స్వాగతం పలుకుతున్నది.
    మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘రాముడిన్’ అన్నదాన్ని ‘రామునిన్’ అనండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పోవగన్ అవిరళమైన’ అని విసధిగా వ్రాశారు. ‘పోయె నా/ యవిరళమైన...’ అనండి.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ ‘సౌరు + అవి’ విరుపుతో వైవిధ్యంగా ఉంది. మంచి పూరణ. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    భారవి అంటే ఒక సంస్కృత కవి అనియే అర్థము కలదు. మీరు ఏ విధముగా వాడేరో తెలియుట లేదు.
    స్వస్తి.

    శ్రీ మిస్సన్న గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    సౌరు + అవి అని చక్కగా విరిచేరు -బాగుగ నున్నది. మరి యతి గురించి ఆలోచించేరా?
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    ‘భారవి’ శబ్దాన్ని గురించి నేను ఆలోచించలేదు.
    మిస్సన్న గారి పూరణలో అక్కడ అఖండ యతికి అవకాశం ఉన్నది కదా.

    రిప్లయితొలగించండి
  16. శ్రీనేమాని గురువర్యులకు నమస్సులు.

    భారవి అంటె ప్రకాసమానమైన అనే అర్థము ఉన్నదికదాండీ.

    భారవుల భారవులనాత్మ బ్రస్తుతింతు - పూర్వకవిప్రయోగము...........

    రిప్లయితొలగించండి
  17. Guruvaryulaku dhanyavadamulu. savarincina padyam:
    కువలయ నాథు కైక తను కోరగ కానల కంప రామునిన్
    వివశత జెంది దాశరథి వేడిన కాదని కోపగించ నా
    యవనిజ నాథుడా జనకు నానతి గైకొని బోవ జూడగన్
    రవి యుదయింపగా తమి పరంపర గ్రమ్మె ధరాతలంబునన్

    రిప్లయితొలగించండి
  18. కవివర! భూమి గుండ్రముగ కమ్మని బొంగరమంచు చుట్టగా
    రవియటు నిశ్చలమ్మవగ రాత్రి దినమ్ములు సంభవించగా
    భువనపు పశ్చిమమ్ముగను పుట్టిన ప్రోలు మిసోరి నందునన్
    రవి యుదయింపఁగా తమిపరంపర గ్రమ్మె ధరాతలంబునన్

    రిప్లయితొలగించండి
  19. భవముగ మోడివర్యుడట భారత మాతను కీర్తినిచ్చెడిన్
    చవిగొను మాటలాడగను చల్లగ మెల్లగ హ్యూస్టనందునన్
    రవి యుదయింపఁగా, తమిపరంపర గ్రమ్మె ధరాతలంబునన్
    చెవులను మూసి నిద్దురిడు చీకటి రాత్రుల రాహులయ్యకున్

    రిప్లయితొలగించండి