8, మే 2014, గురువారం

సమస్యాపూరణం - 1406 (విషమును మ్రింగె మాధవుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
విషమును మ్రింగె మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపగన్.
ఈ ప్రసిద్ధ సమస్యను సూచించిన డా. విష్ణునందన్ గారికి ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

  1. విషము మహావిపత్తగుచు వెల్వడ లోక వినాశ హేతువై
    ఋషులును దేవతల్ శరణు హే పరమేశ! యటంచు వేడ నా
    విషమ పరిస్థితిన్ గనుచు వేగమె శంభుడు లోక రక్షయై
    విషమును మ్రింగె, మాధవుడు, వేల్పులు, దైత్యులు సంతసింపగన్

    రిప్లయితొలగించండి
  2. విషమదె చుట్టె లోకములు భీతిగ జేరెను వెండి కొండకున్
    ధిషణుని వంటి దేవతలు దీనత నొందుచు వేడు కొన్నచో
    రుషితము జెంది మంగళయె రక్షణ జేయగ శంకరున్ గనన్
    విషమును మ్రింగె , మాధవుడు వేల్పులు దైత్యులు సంత సింపగన్

    ధిషణుడు = బృహస్పతి

    రిప్లయితొలగించండి
  3. కవిమిత్రులకు నమస్కృతులు.
    మా అమ్మాయికి ఈరోజు హైదరాబదులో ఆపరేషన్. అందువల్ల ఈరోజు, రేపు నేను బ్లాగుకు అందుబాటులో ఉండను. రేపటి సమస్యాపూరణ, పద్యరచన శీర్షికలను షెడ్యూల్ చేశాను. ఈ రెండు రోజులు దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. కృషిని సమిష్టిగా సలిపి కేవల మా సుధ పొందగోరగా
    విషము బయల్పడన్ గనిన వేల్పులు దైత్యులు భీతి జెందగన్
    విష భుజగమ్ములన్ మెడను వేడ్క ధరించు కపర్ది ప్రీతిమై
    విషమును మ్రింగె ;మాధవుఁడు, వేల్పులు, దైత్యులు సంతసింపగన్.

    రిప్లయితొలగించండి
  5. అమ్మా!రాజేశ్వరిగారూ 3వ పాదంలో రు-కి,ర-కి యతి కుదరట్లేదు.గమనించండి,ఫూరణం బావుంది.

    రిప్లయితొలగించండి
  6. విషధను త్రెచ్చ దేవతలు విష్ణుని యానతిబొంది వేగనా
    విషధరు త్రాడు గాకొని, పవిత్ర సువర్ణ నగమ్ము కవ్వమున్
    విషమును క్రక్కె పాము బహు భీతిని పొందజనంబు శూలి యా
    విషమునుమ్రింగ్రె, మాధవుడు వేల్పులు దైత్యులు సంతసింపగన్

    రిప్లయితొలగించండి
  7. చషకము చేతదాల్చి, మరిచర్చలు చేయక శంకరుండు తా
    విషమునుమ్రింగె;మాధవుడు,వేల్పులు దైత్యులు సంతసింపగన్
    విషమము తోడిదైన మరి విశ్వపు కీడిటు పోయినందునన్
    మిషలను మానివైచి తగ మీదగు తావుల యుండుడంచనెన్

    రిప్లయితొలగించండి
  8. మల్లెల సోమనాధ శాస్త్రి, హనుమాన్ జంక్షన్ వారి పూరణ
    విషమది పొంగ వార్నిధిని, పెద్దగ వేడిరి సర్వలోకులున్
    విషమపు కంటివాని, తగ వే ప్రజ సర్వుల గావ, నాతడే
    విషమును మ్రింగె, మాధవుడు వేల్పులు, దైత్యులు సంతసింపగా
    ధిషణను మారె మోహినిగ, దేవత పక్షమె కాచువాడునై

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు 
    శ౦కరయ్య గారికి వందనములు
    నిషధపు క్షీర సాగరము నిట్టసురాసురులున్ మథించగా
    విషము జనించ లోకములు వేడి భరించగ లేక కాలగా
    వృషపతి కాలకూటమును వేడ్కను చేతనుబూని తాను యా
    విషమును మ్రింగె.మాధవుడు,వేల్పులు,దైత్యులు సంతసి౦పగన్

    రిప్లయితొలగించండి
  10. మల్లెల సోమనాధ శాస్త్రి గారి మరొక పూరణ

    విషము భవాంబుధే తలప, వేగమ తేర్పగ విష్ణునైన, యా
    విషగళునైన కొల్వదగు; వెల్గెడి యా గరళంబొ, యా సుధో
    ధిషణను నెంచియిచ్చుగద, తేర్పగ భేదములేదు నిద్ధరన్
    విషమును మ్రింగె మాధవుడు, వేల్పులు, దైత్యులు సంతసింపగన్

    రిప్లయితొలగించండి
  11. నేమాని పండితార్యా! పూరణ అద్భుతంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  12. విషధను త్రెచ్చ దేవతలు విష్ణుని యానతిబొంది వేగనా
    విషధరఁ ద్రాడుగాకొని, పవిత్ర సువర్ణ నగమ్ము కవ్వమున్
    విషమును క్రక్కె పాము బహు భీతిని పొందజనంబు శూలి యా
    విషమునుమ్రింగ్రె, మాధవుడు వేల్పులు దైత్యులు సంతసింపగన్

    రిప్లయితొలగించండి
  13. మిత్రులకు శుభాశీస్సులు.
    గత 5 వారములుగా నాకు స్వస్థత లేదు. మొదట 7 రోజులు viral fever వచ్చినది. దాని పిదప విపరీతముగ దగ్గు వచ్చినది. దగ్గుతోబాటే కుడి భుజము నొప్పి కుడి చాతీ ప్రక్క ఎముకల నొప్పి వచ్చి నేటికిని తగ్గక నిరంతరముగ బాధించుచున్నవి. మందుల వలన ఉపశమనము కలుగుట లేదు. ప్రారబ్ధ కర్మల ఫలితములు అనుభవింప వలసినవే కదా. కొద్ది రోజులలో స్వస్థత చేకూరు ననుకొందాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. కృషి యొనరించి దానవులు ఖేచర వ్రాతము త్రచ్చ నీరధిన్
    గషణము చేత వెల్వడెను గౌరుడు, లక్ష్మి,హలాహలంబు నా
    విషమును గాంచి వేల్పు లతి భీతిని జెందిరి భర్గుడ ప్పుడా
    విషమును మ్రింగె, మాధవుడు ,వేల్పులు ,దైత్యులు సంతసింపగన్

    రిప్లయితొలగించండి
  15. కృషి నడరించుచున్ ఖచర ఖేచరు లబ్ధిని జిల్కుచుండగా
    విషము బయల్పడన్ సురలు భీతిలి వేడగ దేవదేవు డా
    విషయము నాలకించి తన వేల్పుల రక్షణ జేయగోరి యా
    విషమును మ్రింగె, మాధవుడు, వేల్పులు, దైత్యులు సంతసింపగన్!

    రిప్లయితొలగించండి
  16. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి పూరణలు అన్నియును బాగుగ నున్నవి.
    అందరికి అభినందనలు.

    శ్రీమతి రాజేశ్వరి గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    మీ పద్యము 3వ పాదమును ఇలాగ మార్చుదాము:
    వృషవరవాహనుండు జగదీశ్వరి సమ్మతి గొంచు రక్షయై -- అని.


    శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    సమిష్టి అనుట సరికాదు. సమష్టి అనుట సాధువు.

    శ్రీ నాగరాజు రవీందర్ గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    వాసుకి సపీడితుడై కి బదులుగా నాగపతి పీడితుడై అందామా?
    జర్గగా కి బదులుగా సాగగా అందామా?

    శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
    మీ 2 పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు.
    అన్వయ సౌలభ్యము ఇంకా మెరుగుగా నుండాలి.
    త్రెచ్చ అనుట సరికాదు - త్రచ్చ అందామా?

    శ్రీ రామకృష్ణ మూర్తి గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    శ్రీ మల్లెల సోమనాధ శాస్త్రి గారు:
    మీ పద్యములలో ఇంక అన్వయ శుద్ధి ఉంటే బాగుండును.
    యా సుధో అన్నారు - సుధయో అనుట సరియైన ప్రయోగము.
    లేదు నిద్దరన్? అర్థము కాలేదు.

    శ్రీ తిమ్మాజీ రావు గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    అన్వయము బాగు పడాలి. తాను + యా అని యడాగమము రాదు. తానె యా అందామా?

    శ్రీ లక్ష్మీ నారాయణ గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    ఖచర ఖేచరులు అంటే దేవ దానవులు అనే అర్థము రాదు.
    దేవదేవుడు అనుటకు బదులుగా శివుని పేరు ఏదేని వేస్తే బాగుండును.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మా పద్యమును గురించి మీ ప్రశంసకు మా సంతోషము.

    రిప్లయితొలగించండి
  18. నేమాని వారికి వందనములు, మీకు,శంకరయ్య గారి కుటుంబానికి త్వరగా ఆరోగ్యం చేకూరాలని ప్రార్ధిస్తూ....

    రిప్లయితొలగించండి
  19. నమస్కారములు
    నాపని కుడా అల్లాగె ఉన్నది కళ్ళు మొత్తంగుడ్డి ఒక్కలైను వ్రాయడానికి గంట కుస్తె పట్టాలి ప్చ్ ! ఏం చేస్తాం ? ఈ వయస్సు తెచ్చే సమస్యలు .తప్పవు మరి . సవరణ చేసిన గురువులకు , సూచించిన శ్రీ రామ కృష్ణ మూర్తి గారికి ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  20. నేమాని పండితార్యా! మీకు త్వరలో పూర్తి స్వస్థత చేకూరాలని మా ఆకాంక్ష.

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమాని గురువర్యులకు నమస్సులు, మీరు సూచించిన సవరణకు ధన్యవాదములు, సవరణతో.....

    కృషి నడరించి రాక్షసులు, ఖేచరు లబ్ధిని జిల్కుచుండగా
    విషము బయల్పడన్ సురలు భీతిలి వేడగ శూలధారి యా
    విషయము నాలకించి తన వేల్పుల రక్షణ జేయగోరి యా
    విషమును మ్రింగె, మాధవుడు, వేల్పులు, దైత్యులు సంతసింపగన్

    రిప్లయితొలగించండి
  22. చషకము నిండుగా సుతునిఁ జావునుఁ గోరిన తండ్రి యిచ్చె నా
    విషమునుఁ ద్రావుమంచు; హరి వేల్పని నమ్మిన పుత్రుడప్పుడే
    శషభిష లెంచకుండెనట; చల్లగఁ జూడగ నెంచి యాత్ముడై
    విషమును మ్రింగె మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపగన్.

    ప్రహ్లాదుడు విషముతాగి బ్రతికినప్పుడు పైనున్న వేల్పులతో పాటు వానిఁ బెంచిన దైత్యులూ సంతోషించే ఉంటారు కదా!

    రిప్లయితొలగించండి
  23. ధిషణుని వోలు రాహులుడు దేవుల ధామము ముట్టడించగా
    విషయము నేర్చి మాధవుడు వింతగు రీతిని చావు కోరగా
    భిషజుడు చూసి వ్రాయగను భీకర వైద్యము తత్క్షణమ్మునన్
    విషమును మ్రింగె మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపగన్

    రిప్లయితొలగించండి