10, మే 2014, శనివారం

సమస్యాపూరణం - 1408 (రామాయణమున్ జదివి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రామాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్.
(ఛందోగోపనము)
ఈ ప్రసిద్ధ సమస్యను సూచించిన డా. విష్ణునందన్ గారికి ధన్యవాదాలు.

34 కామెంట్‌లు:

  1. మాయన్న బుధ జనాగ్రణి
    శ్రేయమ్మొనగూరు ననుచు శ్రీవిధి ద్వ్యర్థిన్
    ధ్యేయము తత్త్వమనుచు రా
    మాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్

    (భారత = జ్ఞాన కాంతియందు అనురక్తి కలిగిన)

    రిప్లయితొలగించండి
  2. మిత్రులారా! శుభాశీస్సులు.
    ప్రస్తుతము నాకు arthritis అను problem వలన కుడి భుజము మరియు కుడి ప్రక్క ఎముకలలో(ribs) నొప్పియును నిరంతరముగా బాధించుచున్నవి. ఏవో మందులు వాడుచున్నాను. ఉపశమనము తక్కువగనే యున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి

  3. విలోమ కవి కావ్యమున్ చదివి
    ఆహా ఓహో అని సంతసించు చుండ
    కవివరులు వెనుక నించి విలోమ
    రామాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్!!

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. డా. విష్ణునందన్ గారి పూరణ.....

    ధీయుతుడై యా సూరన
    వ్రాయగ దా ద్వ్యర్థి రచన రసికుడు తొలుతన్
    శ్రేయోనిధియై శ్రీ రా
    మాయణమున్ జదివి , భారతార్థము జెప్పెన్.

    రిప్లయితొలగించండి
  5. Pandita Nemani గారూ
    మీరింకా అమెరికాలోనే ఉన్నారా ?

    రిప్లయితొలగించండి
  6. శ్రీ లక్కరాజు వారికి శుభాశీస్సులు.
    నేను ప్రస్తుతము అమెరికాలో న్యూ జెర్సీలో నుంటున్నాను. జూన్ నెల మధ్యలో విశాఖపట్నమునకు వస్తాను.

    రిప్లయితొలగించండి
  7. నేమని గారూ
    ఆలివ్ ఆయిల్ లో హారతి కర్పూరం వేసిన నూనెని నేను వాడుతాను బహుశా మీకు కూడా ఉపయోగించ వచ్చు.
    వీలయితే నాకు ఇ-మెయిల్ ఇవ్వండి.
    lakkarajus@gmail.com

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారూ,
    మీరు త్వరగా అన్ని రుగ్మతలనుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులవ్వాలని కోరుకుంటున్నాను.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    _/\_
    *
    డా. విష్ణునందన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘రామకృష్ణ విలోమకావ్యమ్’ ను మన బ్లాగులో ప్రకటించాను. క్రింది లింకులో చూడండి.
    http://kandishankaraiah.blogspot.in/2012/01/181.html

    రిప్లయితొలగించండి
  10. మాయగ నున్నది నాకే
    ' టూయిన్ వన్ ' పద్యమొక్కటున్నదననుచున్
    మాయన్న గొప్పగను రా
    మాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్.

    రిప్లయితొలగించండి
  11. తాతగారైన గురువర్యులకు అభినందనలు.
    శ్రీ నేమాని గారికి త్వరగా స్వస్థత చేకూరాలని కోరుకొను చున్నాను

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీయుత సూరన వ్రాసె న
    మేయాద్భుత కావ్యమునతి మేధా శక్తిన్
    శ్రేయమ్మగు ద్వర్థిని రా
    మాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్

    రిప్లయితొలగించండి
  14. ఆయది సూరనదే రా
    మాయణమును భారతమ్ము మధురతరం బో
    హో! యని యొక కవి తా రా
    మాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్.

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని గారు అన్ని రుగ్మతలనుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులవ్వాలని కోరుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  17. మాయన్న రాము డారా
    మాయణ మున్ జదివి భార తార్ధము జెప్పె
    న్నాయది సూరన రచితము
    శ్రేయం బొనగూర్చు గాత 1సీతా దేవిన్

    రిప్లయితొలగించండి
  18. గురు తుల్యులు శ్రీ నేమానివారికి నమస్కారములు

    సకల శుభములు గలిగించు శంకరుండు
    ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
    కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
    యెల్ల వేళల మిమ్ముల చల్ల గాను

    రిప్లయితొలగించండి
  19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఉన్నది + అని + అనుచున్’ అన్నప్పుడు యడాగమాలు వస్తాయి. అక్కడ ‘ఉన్నదటంచున్’ అనండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    రామకృష్ణ విలోమకావ్యానికి తెలుగు వ్యాఖ్యానం ఉన్న ఆ లింకును దయచేసి చెప్పగలరా?
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. నా స్వస్థత గురించి స్పందించిన మిత్రులందరికి శుభాశీస్సులు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. పాయక రెండర్ధములను
    వ్రాయగ దుష్టయతినిగని పద్యాలందున్
    మాయౌ రీతినొకడు రా
    మాయణమున్ జదివిభారతార్ధము జెప్పెన్

    మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ

    రిప్లయితొలగించండి
  22. ఆర్యా ! ధన్యవాదములు...మీరు సూచించిన సవరణతో..

    మాయగ నున్నది నాకే
    ' టూయిన్ వన్ ' పద్యమొక్కటున్నదటంచున్
    మాయన్న గొప్పగను రా
    మాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్.

    రిప్లయితొలగించండి
  23. హాయిగ సురపానము గొని
    ఛీ యనుచును నేస్తగాండ్ర ఛెణుకుల నొకడే
    పాయక తూలుచు విని రా
    మాయణమున్ జదివి భారతార్ధము జెప్పెన్

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ రామకృష్ణమూర్తి గారు : శుభాశీస్సులు.

    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. సురాపానము అనుట సాధు ప్రయోగము. మీరు సురపానము అన్నారు. అందుచేత మీ పద్య పాదమును ఇలాగ మార్చుదామా? -- హాయిగ సేవించి సురను --
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సవరణను గమనించారు కదా!

    రిప్లయితొలగించండి
  27. మిత్రులారా, చాలా కాలం తరువాత బ్లాగు చదివే వెసులుబాటు కలిగింది. కొంత వెనకబడ్డట్లనిపిస్తోంది. సమస్య విరుపు బాగుంది. చివరి పాదంలో కానీ "మా" కు "తా" యతి ఎలా కలిసింది?

    రిప్లయితొలగించండి
  28. The other గారు:
    మీరు యతి గురించి అవగాహన లేకుండా ప్రశ్నించేరు.
    రామాయణము = విడదీయగా = రామ + అయణము అగును.
    అటులనే భారత + అర్థము = భారతార్థము అగును.
    రామాయణములో "అకారమునకు" మరియు అర్థములోని అకారమునకు యతి చక్కగా వేయబడినది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  29. శ్రీ నేమాని పండితులకు ధన్యవాదాలు. ముందే చెప్పానుగా కొంత వెనకబడ్డట్లనిపించిందని, అంతే.

    రిప్లయితొలగించండి
  30. శంకరయ్య గారికి, నేమాని వారికి, మీ సూచనను సవరణలను గమనించి స్వీకరిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  31. శ్రేయమ్మొసగెడు ద్వ్యర్థిని
    వ్రాయగ మాన్యుడు పొగడుచు వ్యాఖ్యానమ్ముల్
    మాయని శ్రద్ధనొసగి; రా
    మాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్.

    రిప్లయితొలగించండి
  32. ఆయన సూరన ప్రతిభుడు
    మాయల మాటలు కలుపుచు మాన్యత మీరన్
    "నాయన నయనా" వలె రా
    మాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్

    రిప్లయితొలగించండి



  33. ఓయమ్మ జిలేబీ ! రా
    మాయణమున్ జదివి భారతార్థము జెప్పె
    న్నాయన లార! వినుడు విను
    డోయీ కథలన్ గనంగ డుగుడుగుడుక్కే :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  34. ఆయన నాలాగే కడు
    వాయనములు లాగు కొనుచు పండుగ పూటన్
    హాయిగ మూర్ఖులకున్ రా
    మాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్

    రిప్లయితొలగించండి