13, మే 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1411 (కాలికి బుద్ధి చెప్పి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాలికి బుద్ధి చెప్పి చనగాఁ దగు వీరుఁడు యుద్ధ భూమిలో.
ఈ సమస్యను పంపిన డా. విష్ణునందన్ గారికి ధన్యవాదాలు.

36 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  2. చాలిక ముందుకే లజన సైన్యము మెండుగ భీతిగొ ల్పగన్
    మేలగు వెన్కబో వకను మీరిటు తేరును మార్చి యున్నచో
    హేలగ వెంబడించ నటు హెచ్చరి జేయ కిరీటి నుత్తరుం
    గాలికి బుద్ధిచెప్పి చనగా దగు వీరుడు యుద్ధ భూమిలో

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు
    గురువులు క్షమించాలి
    చివరి పాదంలో " కాలికి " బదులుగా " గాలికి " అని టైపాటు
    అసలు పద్యంలొ ఇంకెన్ని టై...పాట్లొ ? తెలియదు

    రిప్లయితొలగించండి
  4. ఆలము చేయ జాలక పలాయనమున్ జరిగించి చేరగా
    నాలి వచించె తిక్కనతొ నయ్యయొ వైరులు పోరు సల్పగా
    జాలని రీతి చెండవలె, జచ్చుట నిక్కమటంచు శత్రువుల్
    కాలికి బుద్ధి చెప్పి చనగాఁ దగు, వీరుఁడు యుద్ధ భూమిలో.

    రిప్లయితొలగించండి
  5. నేమానివారు, "దారుణ రీతి " అన్నది కొంచెం అనుమానాస్పదంగా ఉందండీ. ఈ మిశ్రమం సరిగా ఉందంటారా?

    రజేశ్వరమ్మగారు, "హెచ్చరి జేయ " అన్నది కొంచెం పరిశీలించండి. "హెచ్చరికించ" అంటే మరింత సుష్టువౌతుందేమో యోచించండి. మరొక విషయం ఏమిటంటే సంధిపుణ్యమా అని గాలికి అనే వస్తుంది కాబట్టి మొదటిపాఠం సరిగా ఉన్నట్లే.

    కృష్ణారావుగారి పద్యం పసందుగా ఉంది, మంచి ధారతో. సరదాగా రెండు చిన్నచిన్న సవరణలు. "పలాయితుఁడై వెను జూపి చేరగా" అనీ "తిక్కనతొ" అన్నదానికన్నా "తిక్కనకు" అన్నది మరింత కుదురైన మాటగా దానినీ వేసి కొంచెం మార్చితే మార్చితే ఎలాగుంటుందో అని ప్రతిపాదన.

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారు ప్రాస మరచినట్టున్నారు. ఇంకొ రెండు పూరణలలో సమస్య మొదటి భాగం అన్వయం అవుతుండగా, రెండవభాగం గురించి పట్టించుకొన్నట్టు లేదు.

    రిప్లయితొలగించండి
  7. బేలలు సైతమిప్పుడమి వీరతఁ జూపిరణమ్ములందునన్
    హేలగ ప్రాణముల్ విడచి రెందరొ! నేరవె ప్రాణనాథ! మాం
    చాలకు భర్తవే? యకట! సంగరభూమిని వీడి యెట్లహో,
    కాలికి బుద్ధి చెప్పి చనగాఁ దగు వీరుఁడు యుద్ధ భూమిలో?

    రిప్లయితొలగించండి
  8. పాలిత ధర్మమార్గమున పావన యుద్ధము చేయునాడలన్
    కాలికి బుద్ధిచెప్పి చనగా నతడెందున యోడినట్లు నౌ
    గాలికి వీడిరట్టి దగు గౌరవనీతిని నేడు,మాయచే
    కాలికి బుద్ధిచెప్పి చనగాదగు వీరుడు యుద్ధ భూమిలో

    మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ

    రిప్లయితొలగించండి
  9. మాలిమి లేనిగుర్రములు, మాటనుమీరెడు సారధైనచో,
    కాలికిబుద్ధిచెప్పి చనగాదగు,వీరుడు యుద్ధభూమిలో
    వీలది చిక్కగానపుడె వేటునువేయగ పూనుకొంట పో,
    మేలగులక్షణంబు,నిది మేదిని యందునశౌర్యమెన్నగా!

    రిప్లయితొలగించండి
  10. ఓహ్! యతికే కాక ప్రాసకు కూడా వర్తిస్తుందని తెలియదు. మన్నించగలరు.

    రిప్లయితొలగించండి
  11. పాలక మాన్యులీభువిన పౌరుల సంపదనంత దోచుచున్
    పేలవమైన శస్త్రములు ప్రేలని బూజు తుపాకులనివ్వగా
    కాలమె కాలుడై తరుమ కాటికి బంపగ దొంగ నేతలన్
    కాలికి బుద్ధి చెప్పి చనగా దగు వీరుడు యుద్ధ భూమిలో

    రిప్లయితొలగించండి
  12. గురువుగారికి, పెద్దలందరికి వందనములు.
    నేను ఊళ్ళో లేని సమయందునున్న పూరణలు చేయగలిగినవన్నీ చేసి యుంచుచుంటిని.
    వీలు కుదిరినయెడల పరిశీలించగలరు.
    పిల్లవాండ్ర చేత పెద్దలు బుద్ధులు
    వినెడు కాలముఁ గని వింతలాయె;
    మంచిమాట నెవరు మాట్లాడినను విన
    దగునని తెలియుడిక తగినరీతి.

    హోరుగాలి వాన హుంకరింపగ వరి
    చేను వత్తిగిల్లె; చింత మిగిలె
    రైతుకు నిదె ; యేది రక్ష? పాలకులకు
    లేదు చిత్తశుద్ధి; రాదు బుద్ధి.

    మోదుగంపు పూలనుమాట ముదమునిచ్చె
    మనము నిండెనెన్నియొ భావమాలికలవి
    తోట నిండుగ పువ్వుల తోరణములు
    రంగురంగుల గాంచితి రమ్యమలర.

    చషకము నిండుగా సుతునిఁ జావునుఁ గోరిన తండ్రి యిచ్చె నా
    విషమునుఁ ద్రావుమంచు; హరి వేల్పని నమ్మిన పుత్రుడప్పుడే
    శషభిష లెంచకుండెనట; చల్లగఁ జూడగ నెంచి యాత్ముడై
    విషమును మ్రింగె మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపగన్.

    ప్రహ్లాదుడు విషముతాగి బ్రతికినప్పుడు పైనున్న వేల్పులతో పాటు వానిఁ బెంచిన దైత్యులూ సంతోషించే ఉంటారు కదా!

    పిచ్చుకలను చిన్నతనము
    నెచ్చటనైన కనుచుంటిమిప్పుడు నకటా!
    హెచ్చిన యాంత్రిక జీవన
    మిచ్చిన కానుక నఱుదయె నిప్పటి వేళన్.

    భావనలద్భుతముగ కవి
    తావనమందున విరియుచు తనివిని యొసగెన్.
    హా! విధి! నెయ్యెడ నివ్విధి
    పావకకీలికలు చల్లబడె నాజ్యముతోన్?

    పేదవానికి నిల రాదది కోపము
    వచ్చిననది నేత పదవి గూల్చు
    ననుచు జంకు జనులె యందలమునుఁ గాచు
    దారి వెదకుచుంద్రు ధరనునెపుడు.

    రేయమ్మొసగెడు ద్వ్యర్థిని
    వ్రాయగ మాన్యుడు పొగడుచు వ్యాఖ్యానమ్ముల్
    మాయని శ్రద్ధనొసగి; రా
    మాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్.

    సందసవ్వడి యగురీతి సద్దు చేయకుడయ్య
    పెద్దలార! యిచట ముద్దులొలుకు
    పాపనికయి మీరు పాడగ జోలలు
    నిద్దుర విడి లేచు; నేరరొక్కొ!

    దేవిఁ గొలుచునట్టి దినముల దశహర
    రాత్రులందు జనులు రమ్యమైన
    ఫలములెన్నొ చేయు వ్రతమునందున చేయు
    పండు మంచిది; తినఁ బనికి రాదు.

    కన్నియలందమైన కలఁ గాంచుచు నుండినవేళలో సదా
    వెన్నుని యందముల్ కనుల విందులుఁ జేయవె యెల్లరీతులన్!
    పున్నెము పండి శ్రీ హరినిఁ బొందెదనంచు మదిన్ మధూహలే
    వెన్నెల నింపునో! యధర వీధుల హాసము నాట్యమాడెగా!

    నిజము గ్రహియింపుమయ్యరొ! నీదు స్వంత
    భాష యన్ననొకింత గొప్పదను భ్రమనుఁ
    బడక పరికించి చదివిన పల్కగలవు
    తమిళకవి! యల్లసాని పెద్దనకు నతులు.

    ఆయా పోస్ట్ లందున కూడ నుంచినాను.

    రిప్లయితొలగించండి
  13. శ్రేయమ్మొసగెడు ద్వ్యర్థిని
    రే గా పడింది. గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  14. మిత్రులారా! శుభాశీస్సులు.
    స్వాస్థ్యములేక ఏదో మాదిరిగా పద్యము నుపక్రమించేను కాబట్టి తప్పు దొరలినది ప్రాసలో. శ్రీ శ్యామలరావు గారి దర్శన భాగ్యము చాల కాలము తరువాత దొరకుట మంచిదే. కాని వారను కొనినటుల దారుణ రీతి దుష్ట సమాసము కాదు. ఆ రెండును సంస్కృత పదములే. ప్రాసను మార్చుతూ మరొక పద్యమునకు ప్రయత్నము చేస్తాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. కాలము కూడ నప్పుడును కయ్యమువీడి వెసన్ తొలంగగాఁ
    కాలికి బుద్ధి చెప్పి చనగాదగు, వీరుడు యుద్ధభూమిలో
    మేలగు కాలమందునను మేవడి దీటుగ జేయగా వలె
    న్నాలము, కర్ణుడున్ మెలగె నవ్విధి భారత యుద్ధభూమిలో

    రిప్లయితొలగించండి
  16. విరాట పర్వములో "కర్ణుండు గయ్యంబు విడిచి పాఱిన బార్థుండు దేవ దత్తంబు పూరించి"

    రిప్లయితొలగించండి
  17. నా పూరణ లో రెండవ పాదంలో "తుపాకులివ్వగా " అను పదము సరియైనది. టైపు చేయుటలో పొరపాటు దొర్లినది గమనించగలరు .

    రిప్లయితొలగించండి
  18. కాలుని రీతి బోరవలె గర్వమడంచగ శత్రు మూకలున్
    కాలికి బుద్ధి చెప్పి చనగా దగు, వీరుడు యుద్ధ భూమిలో
    జాలము జేయకన్ తెగువ, జాతురి, శక్తిని ,యుక్తి జూపి శా
    ర్దూలము బాతి వైరులను ద్రుంచుచు ముందుకు సాగిపోవలెన్

    రిప్లయితొలగించండి
  19. శ్రీ లక్ష్మీనారాయణ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    1వ పాదములో శత్రు మూకలు అనే సమాసము సాధువు కాదు.
    3వ పాదములో చేయకన్ అనుచోట చేయకే యని సవరించండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. కాళికి కాళ్ళ మ్రొక్కి రిపుకానన పావకుడైన ధీ యశో
    మాలికి శౌర్య ధైర్యములు పాలతొ బెట్టిన విద్యెయేసుమీ
    గాలికి బుద్ధిచెప్పు చనగా త్వరగా రథమేగవేగమై
    గాలికి బుద్ధిచెప్పి చనగా దగు వీరుడు యుద్ధ భూమిలో

    (గాలి= వాయు, గాలి=రథచక్రము)

    రిప్లయితొలగించండి
  21. శ్రీ పండిత నేమాని కవివరులకు నమస్కారములు
    మీ అమూల్య సూచనకు ధన్యవాదములు
    కాలుని రీతి బోరవలె గర్వమడంచగ శత్రు సంఘమున్
    కాలికి బుద్ధి చెప్పి చనగా దగు, వీరుడు యుద్ధ భూమిలో
    జాలము జేయకే తెగువ, జాతురి, శక్తిని ,యుక్తి జూపి శా
    ర్దూలము బాతి వైరులను ద్రుంచుచు ముందుకు సాగిపోవలెన్


    రిప్లయితొలగించండి


  22. కాలును సేతులున్ వడక గౌరవ సేనను గాంచి యుత్తరుం
    'డేలను నాకు యుద్ధ మిపు డింటికి పోదమయా బృహన్నలా!
    కాలికి బుద్ధి చెప్పి చనగాఁ దగు వీరుఁడు యుద్ధ భూమిలో
    నాలియు బిడ్డలున్ సుఖముగా మనగోరిన వేళ' నంచనెన్.

    రిప్లయితొలగించండి


  23. కాలును సేతులున్ వడక గౌరవ సేనను గాంచి యుత్తరుం
    'డేలను నాకు యుద్ధ మిపు డింటికి పోదమయా బృహన్నలా!
    కాలికి బుద్ధి చెప్పి చనగాఁ దగు వీరుఁడు యుద్ధ భూమిలో
    నాలియు బిడ్డలున్ సుఖముగా మనగోరిన వేళ' నంచనెన్.

    రిప్లయితొలగించండి


  24. కాలును సేతులున్ వడక గౌరవ సేనను గాంచి యుత్తరుం
    'డేలను నాకు యుద్ధ మిపు డింటికి పోదమయా బృహన్నలా!
    కాలికి బుద్ధి చెప్పి చనగాఁ దగు వీరుఁడు యుద్ధ భూమిలో
    నాలియు బిడ్డలున్ సుఖముగా మనగోరిన వేళ' నంచనెన్.

    రిప్లయితొలగించండి
  25. నమస్కారములు శ్యామలీయం గారూ 1ధన్య్వాదములు
    " హెచ్చరి జేయ " అక్కడ ఏంవ్రాయాలో తెలియక అలా కిట్టించా నంతె తప్పవుతుందని తెలుసు ప్చ్ ! ఏంచేస్తాం

    రిప్లయితొలగించండి
  26. మా మామగారు శంకరయ్య గారికి జ్వరం ఎక్కువగా ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు సమాధానాలు ఇవ్వలేక పోతున్నందుకు, రేపు పోస్ట్ పెట్టలేరేమో అని బాధ పడుతున్నారు.
    కంది కల్పన.

    రిప్లయితొలగించండి
  27. నేలనొ, నీటనో రణము నింగినొ యెట్టులనైన నేమి? యీ
    కాలపు యుద్ధ తంత్రమనగా నొక పద్ధతి లేనిదే యగున్
    కాలికి బుద్ధి చెప్పి చనగాదగు వీరుడు యుద్ధ భూమిలో
    మేలగు నంచు నెంచునెడ మెల్లగ వేరొక యుక్తి నెంచుచున్

    రిప్లయితొలగించండి
  28. చిరంజీవి సౌభాగ్యవతి కల్పన గారూ 1 ముందు మావయ్యగారి ఆరోగ్యం బాగా చూసుకో మనండి
    కాదు మీరేదగ్గరుండి చూడాలి మరి . ఎందుకంటేమాకు గురువులు , మీకు తండ్రి వంటివారు. మామరదల్ని అడిగానని చెప్పండి .సమస్యా పూరణలు అంత ముఖ్యం కాదు. సరేనా ?
    మా సోదరులు త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుతూ

    రిప్లయితొలగించండి
  29. ఆలము సేయలేక నిక నాపుము గావుమనంచు పోరునే
    చాలిక పారిపోదునని చయ్యన దల్చుచు చూడ శత్రువే
    కాలికి బుద్ధి చెప్పి చనగాఁ, దగు వీరుఁడు యుద్ధ భూమిలో
    మేలములాడి వెన్కజని మిత్తికి బంపడు, వానినొగ్గుగా !

    రిప్లయితొలగించండి
  30. గురువుగారు త్వరగా కోలుకోవాలని మా ఆకాంక్ష.

    రిప్లయితొలగించండి
  31. చాలును ! సూత పుత్రకుని శక్తి నెఱుంగమె ? ఘోష యాత్రలో
    మేలి పరాక్రమమ్ముఁ గనమే ? కురు రాజ ! వృథా ప్రసంగమి
    ట్లేల ? మహేంద్ర సూనుని జయింపఁగఁ గల్గునె ? కర్ణుఁడన్నచో
    "గాలికి బుద్ధి చెప్పి చనఁగాఁ దగు వీరుఁడు" యుద్ధ భూమిలో !!!

    రిప్లయితొలగించండి
  32. నాగరాజు రవీందర్ గారు,

    నాకు తెలిసినంతలో
    అ భేద ప్రాస :-
    " ల -ళ " లకు ప్రాసచెల్లును.
    " ల - డ " లకు ప్రాస చెల్లును.

    కాని " ర - ల " లకు ప్రాస చెల్లదు.

    రిప్లయితొలగించండి
  33. లాలస తోడ పోయి సమరంబున పేదల బాగుకోసమై
    మేలొనరింపజేయుట కమేయముగా తన విక్రమమ్ముతో
    ప్రేలుచు వచ్చు శత్రువుల వెన్నులు విర్చగ వారు భీతితో
    కాలికి బుద్ధిచెప్పి చనగా తగు; వీరుడు యుద్ధభూమిలో
    వాలము ద్రిప్పుచండ కని ప్రస్తుతి జేతురు లోకులెల్లరున్!

    రిప్లయితొలగించండి
  34. ఆలిని గూడనీయకయె హైరన జేయగ రోజురోజనన్
    మాలిమి లేని యిల్లరికమందున వేగుట కంటెనున్ గురూ!
    వాలము చుట్టబెట్టుకొని వందన లిచ్చుచు నత్తగారికిన్
    కాలికి బుద్ధి చెప్పి చనగాఁ దగు వీరుఁడు యుద్ధ భూమిలో

    రిప్లయితొలగించండి