17, మే 2014, శనివారం

సమస్యాపూరణం - 1415 (చేఁప చన్నులలో)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చేఁప చన్నులలోఁ బాలు చెంబెడన్ని.
(‘కవిజనోజ్జీవని’ గ్రంథంనుండి)

17 కామెంట్‌లు:

  1. అందము గలిగి కనులకు విందు జేయు
    చేప, చన్నులలో పాలు చెంబెడన్ని
    మేలుజాతిలోపుట్టిన మేకలందు,
    మేకపాలు గుడిచె గాంధి మిగుల తుష్టిఁ

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. దూడ త్రుళ్లుచు నాడుచు దుమికి దుమికి
    తల్లి చన్నులు పీల్చగా తడిమి తడిమి
    పొడువ పొడువగ గోమాత పొదుగు నిండి
    చేఁప చన్నులలోఁ బాలు చెంబెడన్ని

    రిప్లయితొలగించండి
  4. ఎన్ని చెరువుల కలిగుండు యెండ మావి?
    నేతి బీరలో నుండునే నెయ్యి మెండు ?
    చేప చన్నులలో బాలు చెంబె డన్ని !
    నతిశ యో క్తులకివి మాట లవనియందు !!!

    రిప్లయితొలగించండి
  5. చేతి లోనుండి నీటిని చేర్చి కొట్టి
    పొదుగు గడుగుచు చన్నుల పుష్టి జూచి
    పిండ బూనుము గోమాత ప్రీతి పాలు
    చేప, చన్నులలో బాలు చెంబె డన్ని

    రిప్లయితొలగించండి
  6. ఇమ్ముగను తల్లి తన సుత కిచ్చె పాలు
    చేప, చన్నులలో బాలు చెంబెడన్ని
    త్రాగి సంతోషమున బిడ్డ తల్లి చెంత
    నాడుకొనుచుండ నది జూచి యమ్మ మురిసె.

    రిప్లయితొలగించండి
  7. ఆవు యొద్దకు మఱి వచ్చి యావు దూడ
    చేప, చన్నులలో బాలు చెంబె డన్ని
    పిదుక వచ్చెను మృదువైన పొదుగు నుండి
    మంచి బలమును గలిగించు మామ !యవియ

    రిప్లయితొలగించండి
  8. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈ నాటి అందరి పూరణలును బాగుగ నున్నవి. అందరికి అభినందనలు.
    కొన్ని సూచనలు:

    శ్రి నాగరాజు రవీందర్ గారు:
    హృదయము + ఉప్పొంగి = హృదయముప్పొంగి అగును - యడాగమము రాదు.

    శ్రీ మంద పీతాంబర్ గరు:
    కలిగి + ఉండు = కలిగి యుండు అగును.
    కలిగి యుండును + ఎండమావి = కలిగి యుండు నెండ మావి అగును.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ పండిత నేమాని గారికి నమస్కారములు నా తప్పును సవరిస్తూ మార్పు చేసిన పద్యం

    ఎండ మావిలో నుండునే దండి జలము,
    నేతి బీరలో నుండునే నెయ్యి మెండు ,
    చేప చన్నులలో బాలు చెంబె డన్ని ?
    నతిశ యో క్తులకివి మాట లవనియందు !!!

    రిప్లయితొలగించండి
  10. భోజరాజీయం ఆవు-పులి కధ

    పులికి ఇచ్చినమాటను తలను దాల్చి
    గోలచేసెడు దూడకై పాలనొసగ
    పుత్ర ప్రేమయె తల్లిలో పొంగిపొరలి
    చేప, చన్నులలో బాలు చెంబెడన్ని

    రిప్లయితొలగించండి
  11. మల్ల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

    చిన్నికృష్ణుని వసుదేవు చేర్చగాను
    నందగోకుల పశువు లానందమంది
    చేప,చన్నులలోపాలు చెంబెడన్ని
    బాలకృష్ణునికే పూర్తి పాలు నమరె

    సంతలోపల పశువులు చన్నునిండ
    చేప,చన్నులలో పాలు చెంబెడన్ని
    యింటికే జేర వానికి నింతగిన్నె
    డైన నుండవు మరకట్ల మహిమ

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు నమస్కృతులు.
    నా ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. జ్వరం తగ్గింది కాని నీరసంగా ఉన్నది.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీ రెండవ పద్యం బాగుంది కాని సమస్యకు పరిష్కారం చూపించినట్టు లేదు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నేమాని వారి సవరణలను గమనించారు కదా!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పులి కొసంగిన మాటను...’ అనండి.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    ‘వసుదేవు’ అని అసంపూరణ పదాన్ని ప్రయోగించారు. ‘శ్రీహరిని వసుదేవుడు చేర్చగాను’ అనండి.

    రిప్లయితొలగించండి


  13. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శ౦కరయ్య గారికి వందనములు

    గోలకొండ తిలలు కూష్మాండముల బోలు
    వేపజెట్టు గాసె బెండకాయ
    సృష్టిలోన నతి విచిత్రమ్ము తెలిపెద
    చేప చనుల బాలు చెంబెడన్ని

    రిప్లయితొలగించండి
  14. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ సోమనాథ శాస్త్రి గారు! శుభాశీస్సులు.
    మీ 2 పద్యములును బాగుగ నున్నవి. 2వ పద్యము 4వ పాదములో గణములు సరిగా లేవు. సరిజేయండి.

    రిప్లయితొలగించండి
  16. సోమనాధ శాస్త్రి గారి పూరణ లొ టైపాటు దొర్లినది. రెండవ పద్యం నాల్గవ పాదం లో చిన్నసవరణ
    'డైన నుండవు మరకట్ల దైన మహిమ' అని వుండాలి.

    రిప్లయితొలగించండి
  17. లేగ యావుతో చేసెడి యాగడములు
    తాళక పొలము లోనికి తరిమె రైతు.
    సమయమయె దూడపాలకు, స్తనములన్ని
    చేప, చన్నులలో పాలు చెంబెడన్ని!

    రిప్లయితొలగించండి