29, మే 2014, గురువారం

సమస్యాపూరణం – 1427 (గుణహీనుండయ్యె నతఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గుణహీనుండయ్యె నతఁడు గురుకృపచేతన్.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
ఒకానొక అవధానంలో గరికిపాటి వారికి ఇచ్చిన సమస్య ఇది...

13 కామెంట్‌లు:

  1. మణులను పణముగ బెట్టుచు
    గుణ హీనుండయ్యె, నతడు గురుకృప చేతన్
    న్నణకువ నేరిచి మెండుగ
    గుణనిధి యైవెలుగు చుండె గొప్పగ నిలలో

    ఇక్కడ గుణనిధి - గుణములకు నిధి

    రిప్లయితొలగించండి
  2. గణనీయపు కాంతులనే
    యణువణువున గలుగు చంద్రు డాచార్యు సతిన్
    గని, కూడగ భస్మమవక
    గుణహీనుండయ్యె నతఁడు గురుకృపచేతన్

    రిప్లయితొలగించండి
  3. అణకువను విడిచి యొక్కడు
    గుణహీనుండయ్యె,నతడు గురుకృపచేతన్
    మణిలాగ వెలుగి,జగతిన
    ఘనకీర్తిని తెచ్చె తుదకు గ్రామమ్మునకున్

    రిప్లయితొలగించండి

  4. అణకువ లేనట్టి ఖలుడు
    గుణదోషములెంచి ప్రజల కొంచెపరచుచున్
    వ్రణములు గలిగించగ దు
    ర్గుణహీనుండయ్యె నతడు గురుకృప చేతన్

    రిప్లయితొలగించండి
  5. ఫణిసదృశ షడ్వర్గపు
    గుణములు బంధింప నరుని కూపస్థుడగున్
    గుణమను పగ్గమువీడగ
    గుణహీనుండయ్యె నతఁడు గురుకృపచేతన్

    రిప్లయితొలగించండి
  6. గుణఖని కాగోరి యొకడు
    అణకువగా గురునియొద్ద ఆశ్రమమందున్
    మణిగా భాసిలి వే దు
    ర్గుణహీనుండయ్యె నతడు గురుకృపచేతన్

    రిప్లయితొలగించండి
  7. గుణవంతునిగా మారుట
    గణనీయంబనుచు గురుని కరుణగొనుటకై
    యణకువగా చేరగ నవ
    గుణహీనుండయ్యె నతడు గురుకృపచేతన్!

    రిప్లయితొలగించండి

  8. గుణ రహితుని చెలిమి కతన
    గుణ హీ నం డ య్యె నతడు, గురు కృప చేతన్
    పణ మున నెగ్గిన యువకుడు
    ఫణి నా గేం ద్రుం డనంగ బరగును బుడమిన్

    రిప్లయితొలగించండి
  9. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

    రణమధ్యభూమి పార్ధుడు
    గుణహీనుండయ్యె నతడు,గురుకృపచేతన్
    రణమేల చేయ తెలిసియు
    గుణటంకారమును జేసి గురువులనెదిరెన్

    ఫణముల పైనను నాట్యము
    ఫణిపతి శయనుండు సలిపి పామును నణచన్
    గుణియై కాళియుడే దు
    ర్గుణహీనుండయ్యెనతడు గురుకృప చేతన్

    గుణనిధి యనియెడు నీచుడు
    గుణహీనుండయ్యె,నతడు గురుకృపచేతన్
    గుణమగు దీపము నుంచగ
    ఫణిభూషణుచే కుబేర పదమును పొందెన్

    రిప్లయితొలగించండి
  10. అణగారిన బోయ వరుడు!
    ప్రణవ సమానంపు నామ రామము నేర్పన్
    గుణమతి నారదుడట దు
    ర్గుణహీనుండయ్యె నతఁడు గురుకృప చేతన్!

    రిప్లయితొలగించండి
  11. గుణములు మూడును సతతము
    రణగొణ మనుచున్ మనసును రభసగ జేయున్
    గణుతికి నెక్కంగ సకల
    గుణహీనుండయ్యె నతఁడు గురుకృపచేతన్

    రిప్లయితొలగించండి