16, మే 2014, శుక్రవారం

పద్య రచన – 562

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

  1. కణ్వ ముని పెంచి పోషించె కాన లోన
    చిన్ని పాప శకుంతలన్ చెన్నుగాను
    హస్తినపతి దుష్యంతుడు నామెనుగనె
    వేటకై వచ్చి కానకున్, ప్రేమతోడ
    పరిణయమునాడె కణ్వుని పట్టి నతడు
    పడతి భర్త తలపులతో పరవ శించి
    మౌని దుర్వాసు రాకను కాన కుండె
    శాపమిచ్చె మౌని కనలశాంతి తోడ

    రిప్లయితొలగించండి
  2. మనసు దుష్యంతు మీదన మరల బడుట
    మౌని దూ ర్వాసు రాకను గాన నందు
    వలన ,మఱచి పో వునుగాక !వాడు నిన్ను
    ననుచు పలికెను దూ ర్వాసు డా శ కుంత
    లగురి చి తెలియ రాగను లజ్జ తోడ
    వేడు కొనియెను మౌనిని వినయ ముగను

    రిప్లయితొలగించండి
  3. రాజు దుష్యంతు తలపున రమణి యుండి
    మౌని రాకను గనలేని మరపు బడగ
    శాప మిడెశకుంతలగని కోపముగను
    మరచి పోవును దుష్యంతు మనము నిన్ను
    ననుచు బల్కెను దూర్వాసు డాగ్రహమున

    రిప్లయితొలగించండి
  4. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈ నాటి అందరి పద్యములును అలరించుచున్నవి. అందరికి అభినందనలు.
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  5. భర్త ధ్యానమందు పరవశయై యుండ
    మునివరుండు శాపమొసగినాడు
    చెలులు భీతిజెంది చేతులుజోడింప
    అంగుళీకమాయె ఆనవాలు

    రిప్లయితొలగించండి
  6. మరులను గొన్న శకుంతల
    మరి నారాకైన గనక మత్తెక్కావా !
    మరచును నినునా నృపుడే
    మరలదునా శాపమింక మహిమను గనుమా !

    రిప్లయితొలగించండి
  7. మమత యుప్పొంగి దుష్శంతు మరచిపోక
    కళ్ళు మూసి శకుంతల వళ్ళు మరచి
    యుండ నటకేగు దెంచి మహోన్నతుండు
    మౌని దూర్వాసు ప్రశ్నించ మారు మాట
    పల్కనందున శపియించె మగువనపుడు

    రిప్లయితొలగించండి
  8. కనులను తెఱవక, విరహము
    మనమును బాధించువేళ మౌనము దాల్చెన్,
    మునిఁ గనక యున్న నేరము
    చిన దానిని పెక్కుగతుల శిక్షించె గదా!

    రిప్లయితొలగించండి