23, మే 2014, శుక్రవారం

పద్య రచన – 568 (పసుపు కుంకుమలు)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

  1. ఐదువలకు ముఖ్యమైనట్టి సంపద
    జీవితమున కెల్ల శ్రీకరమ్ము
    పసుపు కుంకుమలు శుభంకరములు జీవి
    తము నిరామయముగ దనరజేయు

    రిప్లయితొలగించండి
  2. సుభము లీయగ నింటను శోభ గూర్చు
    కనుల విందుగ పూజించ గౌరి ననగ
    మంగ ళంబంచు మగువలు మనసు నిలిపి
    పసుపు కుంకుమ లేకున్న బ్రతుకు లేదు

    రిప్లయితొలగించండి

  3. పసుపు పచ్చదనం
    కమల మెర్రదనం
    అమల సీమాంధ్రం
    అరుణ చంద్రోదయం !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. హిందువుల గృహములందు మందిరమ్ము
    లందు బసుపు కుంకుమ కనువిందు చేయు
    నన్ని శుభ కార్యములలోన ననవరతము
    విరివిగా వాడుకొందురు వేడ్కతోడ.

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    శుభము టైపాటు వల్ల సుభము అయింది.
    *
    జిలేబీ గారూ,
    ?
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘గృహములయందు’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  6. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ

    వనితలకెందున శుభమిడు
    కొనగను నెపుడును పసుపును కుంకుమలిలలో
    మనుగడ తలచియు మగనికి
    ఎనయగునెవ్వానికెందునేర్పడు శుభముల్

    రిప్లయితొలగించండి
  7. భగవంతునలంకారము
    తగు పసుపూకుంకుమమర దర్శన మీయన్
    భగవద్భావము మదిన గ
    లిగించు వాటిని ధరించ లీలలవేమో?

    రిప్లయితొలగించండి
  8. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘పసుపూ’ అని వ్యావహారికాన్ని వాడారు. ‘పసుపును’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  9. పసుపున్ కుంకుమ శోభలన్ పడతి సౌభాగ్యంబు వర్ధిల్ల పెం
    పెసగన్ చక్కని సంతుతో నిలను తా పేరైన యిల్లాండ్రునై
    ససినీ యింతులు విజ్ఞులై చదువులన్ సారస్వతీ మాతలై
    వసియింపన్ దగు భర్తతో చిరముగా వాసంత లక్ష్ముల్ బలెన్

    రిప్లయితొలగించండి