27, మే 2014, మంగళవారం

పద్య రచన – 572

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. గోరింట రంగవల్లులు
    పేరంటము జేసె వధువు పెళ్లికి సిరులై!
    తీరిన గాజుల దాటుచు
    చేరెను కుందనపు వంకి చీరెకు తోడై!

    రిప్లయితొలగించండి
  2. పెళ్లి కూతురు గాబోలు పే రటాండ్రు
    తెచ్చి యిచ్చిన గాజుల నిచ్చ తోడ
    తొడుగు కొనుచుండి చేతికి విడివి డిగను
    మదన మోహన మూ ర్తి తో మరులు గొలిపె

    రిప్లయితొలగించండి
  3. అందమందున నిజముగ చందమామ
    చేత గాజులు ధరియించి చెన్నుగాను
    వరుని కోసమై కనుచుండె పగటి కలలు
    యెడద పొంగుచు నుండగా యెదురుజూచి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెడ్డి గారూ,
      ఆసుపత్రినుండి వచ్చీ రాగానే పద్యం వ్రాశారంటే రచనావ్యాసంగం పట్ల మీకెంత ఆసక్తి ఉన్నదో తెలుస్తున్నది. సంతోషం.
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘కలలు + ఎడద’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘కలల/ నెడద’ అనండి.

      తొలగించండి
  4. భారత దేశ చేడియలు భాగ్యమ టంచును బొట్టుకాటుకల్
    చీర ధరించి గాజులను చేతుల నిండుగ కుస్తరించుచున్
    భారముగా దలంపకను బంగరు మంగళసూత్ర మెప్పుడున్
    జారుచు నుండ చోలకము చాటున మోతురు భర్త గుర్తుగా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరయ్య గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘దేశ చేడియలు’ దుష్టసమాసం. ‘భారతదేశ యోషితలు’ అందామా?

      తొలగించండి
  5. గురుదేవుల సవరణకు ధన్యవాదములు, సవరణతో....

    భారత దేశ యోషితలు భాగ్యమ టంచును బొట్టుకాటుకల్
    చీర ధరించి గాజులను చేతుల నిండుగ కుస్తరించుచున్
    భారముగా దలంపకను బంగరు మంగళసూత్రమెప్పుడున్
    జారుచు నుండ చోలకము చాటున మోతురు భర్త గుర్తుగా!

    రిప్లయితొలగించండి
  6. గాజులు మోచేతివరకు
    మోజులుమనసున్నవరకు మోహముతీరన్
    జాజులు జడచివర వరకు
    రాజితమై యుండుటెల్ల రమణికి చెల్లున్

    రిప్లయితొలగించండి


  7. కొమ్మకు చేతులు పండెను
    కొమ్మల గోరింట దూసి గోటికి బెట్టన్
    గుమ్ముగ చేతులు నిండెగ
    నిమ్ముగ నే గాజులెల్ల నిరవుగ తొడగన్

    రిప్లయితొలగించండి