12, మే 2014, సోమవారం

పద్య రచన – 594 (కన్నె కలలు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“కన్నె కలలు”

14 కామెంట్‌లు:

  1. అంద చందాలలో కందర్పు దర్పంబు
    ....నణచివేయగ జాలినట్టి వాడు
    భాగ్య వైభవములో బళిర! కుబేరునే
    ....తల దన్నునా యన దనరువాడు
    ఉన్నత పదవిలో నెన్న దేవేంద్రునే
    ....గేలి చేసి చెలంగ జాలు వాడు
    విద్యార్హతలలోన విలువైన స్థాయిలో
    ....నత్యంత ప్రతిభతో నలరువాడు
    నిండు ప్రేమతో జూచుచు నీడవోలె
    నిరతమును వెంటనంటుచు బరగువాడు
    వరుడు కావలెనంచు సంబరముతోడ
    కన్నె పడుచులు కలలను గనుట లెస్స

    రిప్లయితొలగించండి
  2. చంద్త బింబము బోలిన చక్క దనము
    మంచి తనమందు రాముని మించు వాడు
    రాణి వాసము నందుండి రాజ్య మేల
    కలల తేలుచు నుండును కన్నె మనసు

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారూ,
    కన్నెపిల్లలు కనే కలలను గురించి సవివరంగా అందమైన సీసపద్యాన్ని అందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. అందమైనట్టి మఱియును నాద రించు
    నతడు చక్కని నుద్యోగి యైన వాడు
    తనకు భర్తగా నుంటను మనసు నందు
    కన్నె పిల్లలు కనుదురు కలలు భువిని

    రిప్లయితొలగించండి
  5. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘చక్కని యుద్యోగి’, ‘కందురు’ అనండి

    రిప్లయితొలగించండి
  6. కన్నె పిల్ల కలలు కల్లలు గాకుండ
    తీర్చ వలయు తండ్రి తీరుగాను
    కన్న యింటి వారి యున్నతిన్ తాగోరు
    కన్నె పిల్ల హృదయ మున్నతంబు

    కోటి కోర్కెలనిడి కొండెక్కు చున్నారు
    కన్నెపిల్ల లున్న కన్న వారు
    కొడుకు లున్న వారు కోడలు కోసమై
    తిరుగు చుండ్రి చెప్పు లరుగు వరకు

    రిప్లయితొలగించండి
  7. మల్లెల తోటలోన నొక మంజుల కోమలి కన్నెపిల్ల తా
    మల్లెలు గోయుచుండగను మన్మద రూపుడొ కండు గాంచి యా
    పిల్లను జేరి నీ పయిన ప్రేమ జనించెను నాకటంచు వా
    డెల్లరు గాంచ కన్నె కలలెల్లను ముద్దిడి చేసె నాశమున్.

    రిప్లయితొలగించండి
  8. చక్కని రూపురేఖలును శాంతపు చిత్తము, లచ్చి పుత్రుడై
    మిక్కిలి ప్రేమతోడ తన మిత్రుల బందుల నాదరించుచున్
    చిక్కు సమస్యలందునను చిత్తము నెప్పుడు చిక్క నీక బల్
    మక్కువ తోడ తన్నుగను మాన్యుని భర్తగ కోరునెప్పుడున్

    రిప్లయితొలగించండి
  9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ మూడు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. Annapareddy satyanarayana reddy గారూ ---- వావ్.
    ----------------------------
    చక్కని రూపురేఖలును శాంతపు చిత్తము, లచ్చి పుత్రుడై
    మిక్కిలి ప్రేమతోడ తన మిత్రుల బందుల నాదరించుచున్

    రిప్లయితొలగించండి
  11. అందచందాల మురిపించు చందమామ
    కన్నెకలలందు విహరించు వన్నెకాడు
    తనదుభావిని వెలిగించు ఘనుడతండు
    కన్నె మనసను పటమున నున్నవాడు

    రిప్లయితొలగించండి
  12. రావు ఎస్ లక్కరాజు గారికి ధన్యవాదాలు. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారి దీవెనలతో వృత్తములు వ్రాయటనికి ప్రయత్నము చేయు చున్నాను.

    రిప్లయితొలగించండి
  13. కన్నియలందమైన కలఁ గాంచుచు నుండినవేళలో సదా
    వెన్నుని యందముల్ కనుల విందులుఁ జేయవె యెల్లరీతులన్!
    పున్నెము పండి శ్రీ హరినిఁ బొందెదనంచు మదిన్ మధూహలే
    వెన్నెల నింపునో! యధర వీధుల హాసము నాట్యమాడెగా!

    రిప్లయితొలగించండి