25, ఆగస్టు 2015, మంగళవారం

దత్తపది - 81 (లంగా-లుంగీ-చీర-దోవతి)

కవిమిత్రులారా,
లంగా - లుంగీ - చీర - దోవతి
పై పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

41 కామెంట్‌లు:

  1. శ్రీగురుభ్యోనమ:

    తుదముట్టించీ రయమున
    కదనమునకు దోవతీయ కౌరవసేనన్,
    యదుబాలుం గీర్తించుచు
    ముదమున నా ధర్మరాజు భువినేలంగా


    ప్రజలెల్ల సుఖశాంతి బడయుచు నుండ
    విజయమే చేకూరె విశ్వంబు కెల్ల

    రిప్లయితొలగించండి
  2. "బొట్టు" అనే పేరుతో తేటగీతి పద్యాల సంకలనం తెస్తున్నాం...ఎవరైనా అయిదు తేటగీతి పద్యాలకు మించకుండా బొట్టు గురించి "బొట్టు" గ్రూప్ లో పోస్ట్ చేస్తే మా పుస్తకంలోకి తీసుకొనే అవకాశం ఉందని మనవి... ఇది చివరి అవకాశం
    రావి రంగా రావు గారు Bottu వెబ్ సైటులో ఇచ్చిన ప్రకటన. 10 మంది శంకరాభరణం కవులే దానిలో పద్యములు వ్రాశారు. మిగిలిన కవిమిత్రులలో ఎవరైనా 5 వ్రాసి పంప వలసినది గా కోరుచున్నాను. site address: https://www.facebook.com/groups/tilakam/
    if you send to my email I will post in the said group on your name. along with 5 poems please send your address, phone No and Email address. My email address: asn_reddy@yahoo.com

    రిప్లయితొలగించండి
  3. లంగా-లుంగీ-చీర-ధోవతి (దోవతి కాదు ధోవతి) అని నా అభిప్రాయము. నిఘంటువులో రూపాంతరం దోవతి అని ఉంది, కానీ ధోవతి అనటమే ఎక్కువగా విన్నాను.

    రిప్లయితొలగించండి
  4. ‘దోవతి’యే సరియైన పదం. కేవలం శ్రీహరి నిఘంటువు, మాండలిక పదకోశం మాత్రమే ‘ధోవతి’ని పేర్కొన్నాయి. సూర్యరాయాంధ్ర నిఘంటువు, శభ్ద రత్నాకరం, బ్రౌణ్యం, తెలుగు అకాడెమీ నిఘంటువు, పర్యాయ పద నిఘంటువులలో ‘ధోవతి’ శబ్దం లేదు.
    దత్తపది పూరణలో ‘ధోవతి’ ఇబ్బంది పెట్టవచ్చు. పూరణలో దత్తపదంగా ఇచ్చిన దానినే స్వీకరించాలి. మార్చరాదు.

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులతో...

    (ఖాండవ వనమును దహించి, మయ విరచిత యింద్ర[ఖాండవ]ప్రస్థముగ నొనర్చిన వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది)

    ఖాండవ తరులం గాలిచి
    మెండు బలుం గీడుఁ ద్రోచి మేలైన భువిన్
    గండరగండఁడు చీరఁ
    దండిగ హరి దోవ తీసెఁ దమ నగరముగన్!!

    రిప్లయితొలగించండి
  6. కురుక్షేత్రమున శ్రీకృష్ణునితో అర్జునుడు...
    బావా!
    శ్రీలుం గీలొల్లను నీ
    మ్రోలం గాలము గడుపగ మోక్షము నిమ్మా
    చాలదె! చీరము వీడెద!
    నాలము నిల దోవతీయు నాప్తులు గూలన్!
    చీరము = బరి

    రిప్లయితొలగించండి
  7. దోవతి శబ్దమే సప్రమాణం... కానీ దాన్ని దత్తపది లో గ్రథనం చేయడానికి కొంతమేర అపభ్రంశపు 'తోవ' తొక్కక తప్పింది కాదు. అస్తు.

    క్రాలంగా వలె ధర్మ బుద్ధి ధృతరాష్ట్రా! యుద్ధమే యన్నచో
    మేలుంగీళ్లను జూడఁగా వలయు ; నెమ్మిం బూనుటే యొప్పగున్ మ్రోలన్ జీరఁగదయ్య పాండవుల సంపూర్ణానురాగమ్ముతో
    శ్రీలం బంచఁగఁ దోవ తీయదు గదా చింతింపఁగాఁ బోరిఁకన్!

    రిప్లయితొలగించండి
  8. ఖాండవ వనము నదరులం గాల్చి మిగుల
    మేటి వీరుడై చీరగ సాటివారి
    వార లుం గీడు జేయగ బా ర్ధుడం త
    దోవతి ని నూర డిం చెను దోడునగుచు

    రిప్లయితొలగించండి
  9. పాండు పుత్రులం గావంగ బావ కృష్ణు
    డుండ వారలుంగీడెట్టులొంద గలరు
    కావుమనుచు యతివ చీర కాచె గాదె
    పార్థు దోవతీయ నడిపె బండి తాను/శౌరి.

    రిప్లయితొలగించండి
  10. రాయబార ఘట్టంలో దుర్యోధనునితో శ్రీకృష్ణుడు.....

    కదనమున వచ్చు నిడుములం గాన వేల?
    కలిమి నిన్ వదలుం గీడు గలుగు మీకు,
    నో సుయోధన! చీ! రణమే సరి యను
    దోవ తిరముగ హిత మౌనె? బావ! వినుము.

    రిప్లయితొలగించండి

  11. శా.రాలన్ గన్నులనిప్పు, మౌష్టమున చీరన్ సాగె దుశ్శాసనున్
    కాలు౦గీలును వ్రక్కలించెను బల౦గా భీమసెను౦డు,తా
    కోలన్ గ్రుచ్చెను గుండె రక్తమును గ్రక్కున్ గ్రోలి,పై దోవతిన్
    లీలన్నోష్టము నప్పళించెను భటుల్ నిశ్చేష్టులై జూడగన్

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు వందనములు
    దత్తపది లో పదములను అన్యార్ధములో ప్రయోగించమని
    నిబంధనలేదు గనుక 'దోవతి'పదమును ఉత్తరీయము పైపంచె అన్న అర్ధములో
    వ్రాయడ మైనది

    రిప్లయితొలగించండి
  13. 2 కం: ఆలంగాచెడి వాడిట
    మేలుంగీడుల దెలుపుచు మీగడ దొంగై
    లీలం విలువగు చీరలి
    డెన్ లలనకు మంచిదోవ తిరముగ జూపెన

    రిప్లయితొలగించండి
  14. గురువు గారికి ప్రణామములు
    కీచకునితో ద్రౌపతి సంభాషణలా ఊహించాను పొరపాటున్నచొ మన్నించగలరు

    కాముకా! పడతులం గాంచి మోహించుచున్
    చెరబట్ట బూనుట క్షేమమవదు
    ఉత్తమోత్తమ జాతి యువిదను నేనైతి
    నన్నవమానింప న్యాయమవదు
    బలోద్ధతులగునా పతులాగ్ర హించిన
    నీదు శ్రీలుంగిర్తి నిలువ లేవు
    వీరత్వమవబోదు చీ! రమణులనిట్లు
    వేదింప దగదంచు వేడుచుంటి

    ధీరుడ వయిన నీదోవతిరిగి వెడలు
    సుదతులన్ బ్రోచు వాడంచు సుగుణ శీలి
    యనెడు కీర్తిని పోందుమీ యవని యందు
    కేలు మోడ్చి యర్థించెద కీచకుండ.

    రిప్లయితొలగించండి
  15. తమ్ముని కొడుకులుంగీర తగదు మామ!
    వారికి పదిలంగా రాజ్య భాగ మిమ్ము
    చీరవలదు పాండవుల మంచిమనసులను
    సుతుల దోవ తీరుఁగని మార్చుమయనీవు

    రిప్లయితొలగించండి
  16. చీరంగా వసుదేవనందన! హరే! శ్రీవల్లభా! యంచు నో
    రారన్ బాధను దంతి, నమ్మి మది, లీలంగావవే గోపికా
    చోరా! దోవ తిరమ్ముగా జనక నన్ సొంపార రా సుందరీ!
    చేరన్ రమ్మని కుబ్జకైన నొసలుం గీతన్ సరింజేయవే!
    యేరీ నీసరి వేల్పు? లీ తరుణి కీవే నీదు ప్రేమల్ కృపన్.

    రిప్లయితొలగించండి
  17. చీరమున పాండుతనయులు
    కౌరవులుంగీటడించు ఖచ్చితమదియే
    పోరునకు దోవతీయక
    శూరుడవై సంధిజేయ సుతులంగావన్ !!!

    రిప్లయితొలగించండి
  18. కవిమిత్రులకు నమస్కృతులు.
    ప్రయాణంలో ఉన్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  19. భూసారపు నర్సయ్య గారి పూరణ.....

    అర్జునుఁడు చీర గోవిందుఁ డడవియందు
    దోవ తిరిగెడి చొప్పునం దోలె రథము
    నగ్ని కీలలుం గీలలై యధిగమించి
    సర్వ ప్రాణులం గాల్చె నా సమయమందు.

    రిప్లయితొలగించండి
  20. నా రెండవ పూరణము:

    మత్తేభము (పంచపాది):
    తరులం గాల్పఁగ, ఖాండవమ్ముఁ దగ నింద్రప్రస్థమన్ రాజధా
    ని రచింపన్ మయు సాయమంది, బలులుం గీర్త్యాత్ములున్ రాజ్యపా
    లురునై చీరఁగఁ, బాండునందనుల నాల్గుం దిక్కులం గెల్వఁగన్
    బురికొల్పంగను, నశ్వమేధమునకున్ బ్రోత్సాహియై దోవతీ
    సి, రణోన్ముఖ్యవిజేతృ భాగ్యమొసఁగెన్ శ్రీకృష్ణుఁడే మాన్యుఁడై!!

    రిప్లయితొలగించండి
  21. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    కొంచెము మేలుంగీడుల
    నెంచు కొనుచు భువిని నేతలే లంగా నా
    కించి త్పేచీ రగులక
    నించుక మమతలకు దోవతి దియన చెల్లున్

    రిప్లయితొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  23. శ్రీగురుభ్యోనమ:

    చివర్ పాదంలో యతి భంగము సవరిస్తూ

    తుదముట్టించీ రయమున
    కదనమునకు దోవతీయ కౌరవసేనన్,
    యదుబాలుం గీర్తించుచు
    పదిలంగా ధర్మరాజు పాలనను జేసెన్

    రిప్లయితొలగించండి
  24. తేలంగా యూహలలో
    మేలుం గీడుండుజూడ మేటికిరీటీ
    నీలోగల వేదోవతి
    వ్రాలును వేచీ రమణి సుభద్రయె నీతో.

    రిప్లయితొలగించండి
  25. ఆహా! యేమి యీ భాగ్యము? నేఁటి దత్తపదికి వచ్చిన యందఱి పూరణములును జాలఁ జక్కఁగ నున్నవి. అందఱకును నభినందనలు!

    ముఖ్యముగా...

    విద్వన్మిత్రులు డా.విష్ణు నందన్ గారి పూరణ మద్భుతముగ నున్నది.

    మిత్రులు శ్రీ శంకరయ్యగారి పూరణమందు నన్ని దత్త పదములునుం జక్కఁగ నమరి యలరారుచున్నవి. మేమందఱ మేదో దిక్కునకుఁ దోవతీయఁగ...శంకరయ్యగారు...మఱికొందఱు కవిమిత్రులు దోవ తిరపఱచినారు! అభినందనలు!!

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. పద్మమందు కూ"లంగా"ను పాండు సుతుడు
    "దోవతి"దులుపు చందాన తూల రిపులు
    పాండు"లుంగీ"డుకునునేడ్వ పార్ధుడపుడు
    పలికె సైంధవు"చీర"కన్ వదలననుచు

    కో"లం గా"సిని బెట్టగ
    మే"లుంగీ"డ్పడి శివుడటు మేకొని యిడ నా
    భీలంబగు పాశుపతము
    శూలింపుగ"దోవతి"నటు సొంపుగ"చీర"న్

    రిప్లయితొలగించండి
  27. రాయబార ఘట్టమున శ్రీకృష్ణునితో దుర్యోధనుడు.

    చీరల దొంగా ! నీవిక
    తీరుగ వెనుదిరిగి దోవ తిన్నగ జనుమా
    వారుబలంగా నున్నను
    కౌరవులము విరువగలము కాలుంగీలున్.

    రిప్లయితొలగించండి
  28. ఆ"లంగా"చెడి కృష్ణుడు
    మే"లుంగీ"డులను తలచి మేకొని సభలో
    లాలూ"చీ ర"మణమెసగ
    దేలగ సంధిల్లు"దోవ తి"రముగ జూడన్

    రిప్లయితొలగించండి
  29. ఉదయమే హైదరాబాదు వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. రోజంతా ప్రయాణంలో ఉండి మీ పూరణలను సమీక్షించలేకపోయాను. మన్నించండి. ఇప్పుడు కూడా ప్రయాణపు టలసట వల్ల ఒక్కొక్కరి పూరణలను ప్రస్తావించలేను.
    గుండు మధుసూదన్ గారు అన్నట్టు ఈనాటి దత్తపది పూరణలో అందరూ ఉత్సాహంగా పాల్గొని చక్కని పద్యాల నందించారు. కొందరు తప్పనిసరియై వ్యావహారిక పదాలను ప్రయోగించారు.
    శ్రీపతి శాస్త్రి గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారికి,
    డా. విష్ణునందన్ గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    డా. బల్లూరి ఉమాదేవి గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    మిస్సన్న గారికి,
    శైలజ గారికి,
    భూసారపు నర్సయ్య గారికి,
    భాగవతులు కృష్ణారావు గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  30. వలులుంగీచకుడొండొరు...
    తలపడ, భీముఁడు నుఁదన్నె తలను బలంగా... కాలుంజేతులు చీరన...
    తుల భీకర లీలఁ బొట్టఁ దోవ యతిధృతిన్ ....

    రిప్లయితొలగించండి
  31. వలులుంగీచకుడొండొరు...
    తలపడ, భీముఁడు నుఁదన్నె తలను బలంగా... కాలుంజేతులు చీరన...
    తుల భీకర లీలఁ బొట్టఁ దోవ తియుధృతిన్ ....

    రిప్లయితొలగించండి
  32. వలులుంగీచకుడొండొరు...
    తలపడ, భీముఁడు నుఁదన్నె తలను బలంగా... కాలుంజేతులు చీరన...
    తుల భీకర లీలఁ బొట్టఁ దోవ తియుధృతిన్ ....

    రిప్లయితొలగించండి
  33. వలులుంగీచకుడొండొరు...
    తలపడ, భీముఁడు నుఁదన్నె తలను బలంగా... కాలుంజేతులు చీరన...
    తుల భీకర లీలఁ బొట్టఁ దోవ తియుధృతిన్ ....

    రిప్లయితొలగించండి
  34. వలులుంగీచకుడొండొరు...
    తలపడ, భీముఁడు నుఁదన్నె తలను బలంగా... కాలుంజేతులు చీరన...
    తుల భీకర లీలఁ బొట్టఁ దోవ తియుధృతిన్ ....

    రిప్లయితొలగించండి