17, ఆగస్టు 2015, సోమవారం

సమస్యాపూరణ - 1762 (చింతామణి నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
చింతామణి నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్.

24 కామెంట్‌లు:

  1. ప్రణామములు గురువుగారు.....

    సంతసము గలుగు జూడగ
    చింతామణినాటకమును, శ్రీశ్రీ వ్రాసె
    న్నెంతో గొప్పగు రచనలు
    వింతగ విరచించి తాను విఖ్యాతి గొనెన్ !!!

    రిప్లయితొలగించండి
  2. శైలజ గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  3. చింతామణి! నాటకమును శ్రీ శ్రీ వ్రాసెన్ ,
    కదం తొక్కుతూ, పదం పాడుతూ
    సుబ్బి శెట్టి తో నాట్యం జేయవే
    పోదాం పోదాం శ్రీ కృష్ణ సన్నిధి కి !


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. ఎంతో యభిమాని వొకడు
    వింతగ వాదించుచుండు వివరమ్మిదిగో
    సాంతము శ్రీశ్రీ సొంతము
    చింతామణి నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్

    రిప్లయితొలగించండి
  5. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    సంతసమిడుఁ బ్రస్థానాల్
    సంతసమిడు ఖడ్గసృష్టి జయభేరులు నా
    కెంతేని! కాని, యెప్పుడు
    చింతామణి నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్?

    రిప్లయితొలగించండి
  6. జిలేబీ గారూ,
    _/\_
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    అభిమాని మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    సమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. వింతగ నుడివితి రార్యా !
    చింతామణి నాటకమును శ్రీశ్రీ వ్రాసె
    న్నెంతో మేలగు రచనలు
    సంతుల కవి సాయబడును సరసపు రచనన్

    రిప్లయితొలగించండి
  8. నేటి 'శంకరాభరణం' లోని సమస్యకు నా పూరణం

    చింతలు తొలగును చూడగ
    నంతనె మదిఁ గాళ్ళకూరు నారాయణరా
    వంతయు వ్రాసెను.ఎక్కడ
    చింతామణి నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్

    రిప్లయితొలగించండి
  9. పొచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వల్లూరు మురళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. చింతామణి మంత్రముకద
    వంతలు తీరగను శ్రమిక వర్గమునకు రా
    యింత "మహా ప్రస్థానమె"
    "చింతామణి"నాటకము ను శ్రీ శ్రీ వ్రాసెన్

    ఆగస్టు 17, 2015 11:36 [AM]

    రిప్లయితొలగించండి
  11. ఎంతో ముదము కలుగు కన
    చింతామణి నాటకమును, శ్రీశ్రీ వ్రాసెన్
    చింతించి ప్రజల బాధలు
    సొంతపు భావనలతోడ సొంపగు కవితల్

    రిప్లయితొలగించండి
  12. ఇంతీ! వెళదామా ప్రియ
    చింతామణి, నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్
    యెంతో రమణీయమ్మట
    వింతేమున్నది మహాకవి రచించెఁ గదా!

    రిప్లయితొలగించండి
  13. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీగురుభ్యోనమ:

    పొంతన కుదరని ప్రశ్నలు
    కాంతామణి యడిగినంత గదుసుగ జెప్పెన్
    వింతగ నిట్టుల కొంటెడు
    చింతామణి నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్.

    రిప్లయితొలగించండి
  15. సాంతమలంకారముల ని
    శాంతంబై ప్రౌఢకావ్య సాహిత్యంబై
    వింతల నెలవౌ కవితల
    చింతామణి, నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్

    ప్రౌఢ సాహిత్యము అలంకారములకు చింతామణి యైన ఒక నాటకాన్ని శ్రీ శ్రీ గారు రచించారనే భావన....

    రిప్లయితొలగించండి
  16. బూసారపు నర్సయ్య గారి పూరణ.....

    ఇంతుల బాధ నివారిణి
    చింతామణి; నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్
    కాంతల వంతలఁ దీర్చఁగఁ;
    జింతామణి యక్కఱేమి చేయును నీకున్.

    రిప్లయితొలగించండి
  17. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ******
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ******
    బూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    కాంతుల మార్చగ జూపిరి
    చింతామణి నాటకమును ; శ్రీశ్రీ వ్రాసెన్
    వింతగ పద్యములను తొలి,
    క్రాంతిని సాగించె గేయ కైతల నాపై

    రిప్లయితొలగించండి
  19. చింతించి కాళ్ళకూరియు
    చింతామణి నాటకమును;-శ్రీశ్రీ వ్రాసెన్
    వంతలు,కష్టములందెడి
    యంతరమా కార్మికాళి నందరుయెరుగన్

    వంతలు సంఘము గనమే
    చింతామణి నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్
    వంతల నొందెడి కార్మికు
    వింతగు జీవన సరళిని,విప్లవ కవియై

    సుంతయు తెలుగులు మరచిరి
    ఎంతయు నా నాటకమును నెరపిన కవినే
    వింతగ పలుకరె నేడిటు
    చింతామణి నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్

    పొంతన లేకను బాలలు
    వింతగ"మమ్మీ"యు"డాడీ"విరివిగ ననుచున్
    సుంతయు తెలియక పలికిరి
    చింతామణి నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్

    రిప్లయితొలగించండి
  20. పంతులుగారిచ్చిరి "మీ
    వంతుగ నిందుగల నామవాచకములనున్
    గొంతెత్తి చెప్పు" డనుచును
    "చింతామణి నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్"

    రిప్లయితొలగించండి
  21. వింతగ యొకకవి వ్రాసెన్
    చింతామణి నాటకమును;శ్రీశ్రీ వ్రాసెన్
    చింతలతో,వెతతో చితికిన వారల బతుకుల్
    వంతగు నటుల రచియించి వాసిని గాంచెన్.

    రిప్లయితొలగించండి
  22. పంతులు గౌరవ వచనం
    బంతఁబలికి కాళ్లకూరి వారల నామం
    బెంతకుఁ దోచక నిటులనె
    'చింతామణి నాటకమును శ్రీశ్రీ....వ్రాసెన్'

    రిప్లయితొలగించండి
  23. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    ‘ఊకదంపుడు’ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదాన్ని సరిపాద లక్షణాలతో వ్రాసారు. ఆ పాదాన్ని ‘చింతలఁ జితికెడి బ్రతుకుల’ అనండి.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. సుంతయు తెలుగును తెలియని
    పంతులు పిలకను నిమురుచు ప్రశ్నను వేయన్
    చింతా దీక్షితులనియెను:
    "చింతామణి నాటకమును శ్రీశ్రీ వ్రాసెన్"

    రిప్లయితొలగించండి