బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అక్కయ్యా, సవరించినా అన్వయం లోపం ఉన్నది. ***** మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘మిగులన్ వ్యంగ్యం...’ అనండి.
గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణలో, రావే కుక్కా అని చందూ ముద్దుగా పిలిచినప్పటికీ, కుక్కుకు తలబ్రాలు అవుతుందేమో కానీ కుక్కకు తలబ్రాలు అవదని అనుమానమండీ. అలానే సహదేవుడి గారి పూరణలో రాబిన్ కుక్కుకు అవుతుంది కానీ రాబిన్ కుక్కకు కాదేమోనండీ -
ఊకదంపుడు గారూ మీరన్నట్లు రాబిన్ కుక్కు అనే అనాలండీ.కాకపోతే మన పద్ధుతుల మీద విశ్వాసముంచిన వాడు కాటట్టి అక్కడవిశ్వాసానికి మారు పేరయిన ' కుక్క ' అనే ప్రయోగం చేశానండి.
చక్కని చుక్కను గాంచితి
రిప్లయితొలగించండిమక్కువ కలుగంగ నాదు మనసునొసగితిన్
ఠక్కున, మామా తలపై
కుక్కకు,తలబ్రాలు వోయు కుతుకము గలిగెన్.
కుక్కాయని తిట్టెదవా
రిప్లయితొలగించండినిక్కము నీ చక్కదనమె నిక్కును పెంచెన్
మక్కువతో నీపై యీ
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్
చెక్కిన శిల్పము వలెనీ
రిప్లయితొలగించండిచక్కని యందమును గాంచి సంతస మందున్
ఠక్కున పేరది తులసని
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్
కుక్క తులసి = ఒకరకపు తులసి
అక్కా నేనిపు డెంతో
రిప్లయితొలగించండిమక్కువ తోడను వివాహ మాడద లచితన్
చక్కని చుక్కను నిజమిది
కుక్కకు, తలఁబ్రాలువోయు కుతుకము కలిగెన్.
మక్కువ పేలిటు తలలో
రిప్లయితొలగించండికుక్కకు,తలబ్రాలు పోయు కుతుకము గలిగెన్
చిక్కులు విడదీసి సిగను
అక్కడనక్కడను యనక నణచుము చెలియా!
రాజశేఖర, వేంకటశేష కవుల పూరణ...
రిప్లయితొలగించండిఅక్కా! చైద్యున కిడు నట
చక్కని నిను రుక్మి; యిదియు జగతిం గలదే
చొక్కపు ముత్యంబులు వెఱి
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొద్దిగా అన్వయలోపం ఉన్నట్టుంది.
******
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అక్కడను+అనక’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సిగను+అక్కడ’ అన్నప్పుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు కదా! ‘విడదీసియు సిగ| నక్కడనక్కదను గనుచు నణచుము...’ అందామా?
రిప్లయితొలగించండిచక్కని ఎండల వేళను
పిక్కటిలగ వానకురియ పిల్లలు పాడన్
'నక్కల కుక్కల పెండ్ల'ని
కుక్కకు తలబ్రాలు పోయు కుతుకము గలిగెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
అక్కడి యాచారంబట
దుక్కులు జేయంగ భూమి,దోషము తొలగన్
చక్కగ పెండిలి జేసిరి
కుక్కకుఁ, దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.
మక్కువ తో బావ యొకడు
రిప్లయితొలగించండిచక్కన్ని మరదలి తోడ సరసము లాడెన్
చుక్కా! జడలో పూవులు
కుక్కకు, దలఁ బ్రాలు వోయ కుతుకము గలిగెన్
మక్కువ తో బావ యొకడు
రిప్లయితొలగించండిచక్కన్ని మరదలి తోడ సరసము లాడెన్
చుక్కా! జడలో పూవులు
కుక్కకు, దలఁ బ్రాలు వోయ కుతుకము గలిగెన్
మక్కువ తో బావ యొకడు
తొలగించండిచక్కనగు మరదలి తోడ సరసము లాడెన్
చుక్కా! జడలో పూవులు
కుక్కకు, దలఁ బ్రాలు వోయ కుతుకము గలిగెన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమి పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చక్కన్ని’ అన్నదాన్ని ‘చక్కనగు’ అనండి.
'కుక్కును' వంటకు బెట్టెను
రిప్లయితొలగించండిచక్కనిదని 'లవ్వు'జేసె చందూ, ప్రేమన్
కుక్కాయని పిలుచు చుండును
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. ‘కుక్కా యని పిలుచు సతము’ అందామా?
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండికుక్కగ పలువురు బిలిచిన
మిక్కుటముగ వెంట నంటి మేలొన గూర్చన్
చక్కని చుక్కకు మనసయి
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.
మక్కువగ జేయ పెండ్లిని
రిప్లయితొలగించండికుక్కకు, దలబ్రాలు వోయుకుతుకము గలిగె
న్జక్కని శునకము తోడన
మిక్కిలి సంతసము గలుగ మీరా ! వింటే !
భూసారపు నర్సయ్య గారి పూరణ....
రిప్లయితొలగించండి(పెద్దక్క, చిన్నక్కలతో తమ్ముడి సంభాషణ....)
“అక్కా! మెడ విఱుగె నిటులఁ
గుక్కకు; తలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్
చక్కనిదే నా చెలి”.... “చి
న్నక్కా! నీవైనఁ జెప్పు మక్కకు దీనిన్”
అక్కా సర్దిన బట్టలు
రిప్లయితొలగించండికుక్కకుఁ, దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్
ముక్కామల బాబాయికి
మక్కువతో షష్టిపూర్తి మంటపమందున్!!!
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భూసారపు నర్సయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కుక్కను బ్రేమగ బెంచిన
రిప్లయితొలగించండియొక్కతె సంతానలేమి నోర్చక బెండ్లిన్
మక్కువతో జేయగ నా
కుక్కకు, తలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్!
ఎక్కడి రాబిన్ కుక్కో ?
రిప్లయితొలగించండియిక్కడి పద్ధతులు నచ్చి యింతిని మెచ్చెన్
మక్కువతో పెండ్లాడగ,
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.
కుక్కుట శాస్త్రికి కూతురు
రిప్లయితొలగించండికుక్కన బహు మక్కువనుచు కూతురు కివ్వన్
ప్రక్కన నవ్వుచు వరుడనె
కుక్కకు దల బ్రాలువోయు కుతుకముగలిగెన్
.
అక్కరకురాని వరునకు
రిప్లయితొలగించండిమక్కువ నన్నిచ్చి పెండ్లి మా తలిదండ్రుల్
నిక్కము జేయగ మదిలో
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.
టక్కునబలికెనువరుడట
రిప్లయితొలగించండికుక్కకు దలబ్రాలు వోయు కుతుకము గలిగెన్
అక్కాయనగా”వధువనె
కుక్కకు భర్తయిన నీవు-కుక్కవె గాదా”.?
మిత్రులందఱకు నమస్సులతో...
రిప్లయితొలగించండిమిక్కిలి చొక్కునఁ జిక్కియుఁ
గ్రక్కున ముక్కంటి యువిద కర మందంగన్
జక్క నడుగు దశగళుఁ డను
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్!
మిక్కిలి చక్కని చిన్నది
రిప్లయితొలగించండిమక్కువతోడ పడియుండె మాగృహమందున్
దక్కును నాతోడని, యా
కుక్కకు దల బ్రాలు వోయు కుతుకము గలిగెన్
చెక్కిన శిల్పము వలెనీ
రిప్లయితొలగించండిచక్కని యందమును గాంచి సంతస మందున్
దక్కును తులసను సతియగు
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్
అక్కడ వేసవి వేడికి
రిప్లయితొలగించండిచిక్కులు పడ పెళ్ళిజంట చిన్నది కూలర్
టక్కున నిడ తగ్గి చిరా-
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.
చిక్కని పేలను జంపగ
రిప్లయితొలగించండిచొక్కంబగు తైలమొకటి సొంపుగ నిడుమో
యక్కా!నెత్తిన వానిని
కుక్కకు-తలబ్రాలు బోయు కుతుకము గలిగెన్
పిక్కను కరువగ కుక్కయు
మిక్కిలి బాధను నిటులను,మిగులవ్యంగ్యం
బక్కజపు పెండ్లి జేతును
కుక్కకు తలబ్రాలు వోయు కుతుకము కలిగెన్
చక్కగ కాశీకేగితి
అక్కజమగు కుక్కనొకటి నావిధి కొలువన్
కుక్కకు జోడీ గూర్చెద
కుక్కకు తలబ్రాలు వోయు కుతుకము కలిగెన్
కుక్కల బెంచెడి వాడొక
కుక్కకు జతయై పొసగెడు కుక్కను నొండున్
చక్కని దానిని తెచ్చెన్
కుక్కకు తలబ్రాలు వోయు కుతుకము గలిగెన్
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అక్కయ్యా,
సవరించినా అన్వయం లోపం ఉన్నది.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘మిగులన్ వ్యంగ్యం...’ అనండి.
మాస్టరు గారూ ! ధన్యవాదములు.... చిన్న సవరణతో....
రిప్లయితొలగించండి'కుక్కును' వంటకు బెట్టెను
చక్కనిదని 'లవ్వు'జేసె చందూ, రావే
కుక్కాయనులే ముద్దుగ
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.
ఎక్కడనో పెళ్లి జరుగ
రిప్లయితొలగించండికుక్కలు సామెత నిజమని గోల మొదలిడన్
గ్రక్కున నందొక్క జ్వరపు
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిసవరణతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
‘ఊకదంపుడు’ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణలో, రావే కుక్కా అని చందూ ముద్దుగా పిలిచినప్పటికీ, కుక్కుకు తలబ్రాలు అవుతుందేమో కానీ కుక్కకు తలబ్రాలు అవదని అనుమానమండీ.
రిప్లయితొలగించండిఅలానే సహదేవుడి గారి పూరణలో రాబిన్ కుక్కుకు అవుతుంది కానీ రాబిన్ కుక్కకు కాదేమోనండీ -
భవదీయుడు
గురువుగారు,
రిప్లయితొలగించండిధన్యవాదములు
భవదీయుడు.
తాజా పూరణ:
రిప్లయితొలగించండిఎక్కుడు దు:ఖము మానుము
మిక్కిలి దూరమున లేదు మెట్టిన యిల్లే
యక్కా! కన్నుల నీరిటు
గుక్కకు తలబ్రాలు వోయు కుతుకము కలిగెన్
ఊకదంపుడు గారూ మీరన్నట్లు రాబిన్ కుక్కు అనే అనాలండీ.కాకపోతే మన పద్ధుతుల మీద విశ్వాసముంచిన వాడు కాటట్టి అక్కడవిశ్వాసానికి మారు పేరయిన ' కుక్క ' అనే ప్రయోగం చేశానండి.
రిప్లయితొలగించండిచక్కని శ్రావణమందున
రిప్లయితొలగించండిపెక్కువగా వానకురిసి వెలిసిన గడియన్
మక్కువతో కులుకుచు ప్రతి
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్
రిప్లయితొలగించండిఫక్కున నవ్వితి కవిరాట్!
పక్కా యిది గాలికబురు పారుడ వినకోయ్
నిక్కా యేయవలె!నెటుల
కుక్కకుఁ దలఁ బ్రాలు వోయు కుతుకము కలిగెన్?
జిలేబి