7, ఆగస్టు 2015, శుక్రవారం

పద్య రచన - 977

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. మిక్కిలి యాశ్చర్యమ్మౌ
  నెక్కడగనలేము సుమ్మ ఇలలోనెపుడున్
  చక్కగ ట్రాక్టరుపైననె
  యెక్కించుకు పోవుచుండెనేనుగునౌరా

  రిప్లయితొలగించండి
 2. నన్నేటికి గొనిపోవగ
  మిన్నగ లాభములు పొంద మేలగు నంచున్
  దన్నుగ సర్కసు నందున
  వెన్నున యంకుశము తోన వేధిం చుటకై

  రిప్లయితొలగించండి
 3. ఆ.వె:మూగ జీవులెల్ల మొరపెట్టు చుండగా
  కనికరంబు లేక కరిని బట్టి
  వాహనంబునందు బంధించి గొంపోవు
  వారి కేది శిక్ష వారిజాక్ష.

  ఆ.వె: నీరసముగ తిరిగెడి యా
  వారణమును హింస బెట్టి బాధింపంగన్
  భారంబగు మదితో ఘీం
  కారము చేసెడి కరీంద్రుఁ గాపాడగదే!

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. చిత్ర మయ్యది జూడుము చిత్ర ! నీవు
  గజము నెక్కించు కొనిబోవు కరణి జూడ
  నద్భు తంబుగ నుండెను నాహ ! యదియ
  నతుల నొనరింతు గజరాజు నమ్ర తకకు

  రిప్లయితొలగించండి
 6. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. కరటియె జిక్కెను నరులకు
  కరివేల్పుడ గావుమయ్య కారుణ్యముతో
  వరముగ నది వని జేరగ
  సురవందిత! నాదుకొనుము శుండాలమునే!!!

  రిప్లయితొలగించండి
 8. శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. మనిషి మాటవినుచు మత్తగజమ్ము తా
  నెక్కె ట్రక్కు లోకి చక్క గాను
  తిక్కరేగి నపుడు తిప్పలఁ బెట్టును
  మర్మ మెఱిగి జనులు మసలవలయు

  రిప్లయితొలగించండి
 10. కరమును శకటముఁ జేర్చిన
  కరమున దెంతటి బలమని గర్వమ్మేలా?
  కరమున ప్రపంచమొక పరి
  కరమున నమరంగ జేయు కరమా కరమే!

  రిప్లయితొలగించండి
 11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘లోనికి’ సాధురూపం, ‘లోకి’ అనడం గ్రామ్యం. ‘ట్రక్కులోన చక్కగాను’ అనండి.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మొదటి పాదంలో ఏనుగు అనే అర్థంలో ‘కరము’ అన్నారా? కరమంటే తొండము, కరి అంటే ఏనుగు కదా! ‘కరిని శకటమునఁ జేర్చిన’ అనండి.

  రిప్లయితొలగించండి
 12. గురుదేవులకు ధన్యవాదములు.

  కరిని శకటమున జేర్చిన
  కరమున దెంతటి బలమని గర్వమ్మేలా?
  కరమున ప్రపంచమొక పరి
  కరమున నమరంగ జేయు కరమా కరమే!

  రిప్లయితొలగించండి
 13. తెలివి తక్కువైన?బలమెంత యున్నను
  ఉన్నవారి చెంత నూడిగంబె|
  తరలు ట్రాక్ట రందు తగ్గిన ఏనుగు
  పీనుగట్లు మార?పిరికి తనము|
  2.అడవి జంతువు లెల్ల-నంతరించగజేయ?
  -----నాగరికత యనినవ్వగలమ?
  సర్కసు లనుచును,సాకెదమనుచు-స
  -------వారుల కెంచగ?ఫలముగలద?
  ఏనుగు దంతముల్ ఎనలేని ధరయని
  -----ఆశకుబలిజేయ?వాశి యగున?
  ట్రాక్ట రందున నిల్పి-రక్షణ లేనట్టి
  ------పయనానబంధించ?పౌరుషంబ?
  అడవిజంతువు లన్నియు నంతరించ?
  జీవజాలము లేనట్టి జీవితాలు
  సంతసంబును సాకని వింతజగతి
  అడవి జంతువుల్ నశియించ?హాయి-లేదు|

  రిప్లయితొలగించండి
 14. అజమా? కాదది భీకర
  గజమే యదియును కనుగొన కలియుగ మహిమే
  నిజమిది భువిలో స్వార్థపు
  కుజనులు బంధింతురైరి కుంజరమైనన్

  రిప్లయితొలగించండి
 15. అజమా? కాదది భీకర
  గజమే యదియును కనుగొన కలియుగ మహిమే
  నిజమిది భువిలో స్వార్థపు
  కుజనులు బంధింతురైరి కుంజరమైనన్

  రిప్లయితొలగించండి