23, ఆగస్టు 2015, ఆదివారం

పద్య రచన - 988

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. దుర్గంధము తోనిండిన
    మార్గమ్ముల శుద్ధిజేయ మహిదచెన, ఆ
    స్వర్గమ్మునుండి గంగను
    భర్గుని వేడుచును దెచ్చి పారించెనిటన్.


    రిప్లయితొలగించండి
  2. మరచిన మేఘుడు కురిసెను
    పరవశి యై ధాత్రి మురిసె వరుణుని స్పర్షన్
    పురవీధులు చెఱువులనే
    మరిపించెను, వాహనములు మత్స్యము లయ్యెన్

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మహిదచెన... ‘మహి దించెన’కు టైపాటా?
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. బోరున వర్షము పడుట న

    పారగ జలమంత యచట బాహా టము గ

    న్జేరెను వీధుల లోనికి

    కారుల గమనము నకదియ కష్టం బా యెన్

    రిప్లయితొలగించండి

  5. వాన కాలమొచ్చె వంకయ్యె రహదారి
    కార్లు వెళ్ళు దారి కాన రాదు
    నడచి పోవుటెట్లు నాకిట దారేది
    యేమి సేతు నిపుడు యెవరు దిక్కు.

    రిప్లయితొలగించండి
  6. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వచ్చె’ను ‘ఒచ్చె’ అన్నారు. అక్కడ ‘వానలెన్నొ గురిసె’ అనండి. ‘సేతు నిప్పు డెవరు దిక్కు’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. పరిమితి లో నుండక యా
    దురాక్రమణ! దుర్వినీతి! తుది ఫలితముగన్
    వరదై దారుల పొంగెను
    పరవల్ చాలక జలమ్ము వానలు గురియన్!

    రిప్లయితొలగించండి
  8. వానల రాకతో బ్రతుకు,పంటకు,వంటకుసంతసంబనన్
    దీనుల కష్ట నష్టములదీప్తిని బెంచగ కుండపోతగా
    మానకవచ్చి దారులను-మాన్పుచు’హై,ధర,బాదు బాధలన్
    దేనికిపెంచి నారనగ?తీరిక యందున వానరాకలే|

    రిప్లయితొలగించండి
  9. .వానలరాకతో వరద నీరటు రాగ
    -------దారులు ధరలతో దద్దరిల్లు
    మురికికాలువలందు మురికినిబంపినా
    చెత్తచెదారమ్ము పెత్తనమ్మ
    కష్టపడెడివాడి కడుపుమంటను బెంచ
    --------తిష్టవేయగ వాన లిష్టబడున?
    సర్వజీవులసాకు సాయంబు వానన్న
    --------పాతమిద్దెలన్నిపాతరగును
    హర్ష మందించు వానలే ఆయువుంచు
    కర్షకాళికి పంటగా కానుపించు
    వర్ష మాధారజీవులవసతిబంచు
    ఎక్కువైనచో?బ్రతుకులు చిక్కులగును|

    రిప్లయితొలగించండి
  10. వర్షపుజలమ్ము వరదలై పారుచుండ
    పేటలజనజీవనము స్థంభించి పోయె
    యంత్రవాహనమ్ములు దారి నాగిపోయె
    కూడు గుడ్డలకై ప్రజ కుములుచుండ్రి

    రిప్లయితొలగించండి
  11. తడినేలను పదిలమ్ముగ
    పెడ దారులు పట్టకుండ వేగము లేకన్
    వడిదుడు కులురా నీయక
    సడి జేయుచు వాహనములు సాగుచు నుండెన్

    రిప్లయితొలగించండి
  12. మాస్టరు గారూ ! ధన్యవాదములు..నిజమే... టైపాటు సవరణతో....

    దుర్గంధము తోనిండిన
    మార్గమ్ముల శుద్ధిజేయ మహిదలచెన, ఆ
    స్వర్గమ్మునుండి గంగను
    భర్గుని వేడుచును దెచ్చి పారించెనిటన్.

    రిప్లయితొలగించండి
  13. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యాన్ని సవరించినందుకు సంతోషం!

    రిప్లయితొలగించండి