25, ఆగస్టు 2015, మంగళవారం

పద్య రచన - 990

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:



  1. కళకు లేదు హద్దు కవి యూహలకు వోలె
    గాంచు శిల్పి ప్రతిభ ఘనముగాను
    నిలిచి యండె గనుము నిలలోన కంబము
    వత్సరంబుల నుండియు పాదు లేక..
    (పాదు=ఆశ్రయము,ఆధారము)

    రిప్లయితొలగించండి
  2. చిత్ర మందున కంబము చిత్రముగను
    నెట్టి యా ధార ము నులేక యిలను బైన
    నెట్లు నిలబడి యుండెనో ? నింతి యొకతె
    తనదు చీరను జాపుచు దాని యడుగు
    నకును ,చూచుచుండెను వింతను కుతు కమున

    రిప్లయితొలగించండి
  3. కనగలమీ యాలయమట
    ఘణమగు డెబ్భది గరువ మొకరముల్ తేల
    న్నునికిన్ బొందుచు వెలయగ
    ననంతపురమున మహత్వ మవగతి కరువై!
    (అలా తేలుతూ ఉన్న స్తంభాలతో ఎలా నిలబడిందో తెలియకున్నదన్న భావంతో)

    రిప్లయితొలగించండి
  4. భళిరా! యేమీ శిల్పుల
    కళ! నైపుణ్యంబు నందు ఘనులోయీ! దే
    వళములనెల్లెడ గనుమా!
    గళమందొక పూలమాల కాన్కగనిడుమా!

    రిప్లయితొలగించండి
  5. అక్క గారి చీరచ్చోట చిక్కెనెటుల?
    కడువిచిత్రము గానుండె కాంచగాను
    శిల్పి చాతుర్యమా లేక చిత్ర కారు
    డందముగ గీచిన పటపు టద్భుతమ్మ?

    రిప్లయితొలగించండి
  6. అవని పైన నదియు యాధారమే లేక
    యేల నిలిచె? జ్ఞాని యెవరు? నిలుప
    అంతరిక్షస్తంభ మద్భుతమ్మునుగాంచ
    వింతగాను దోచు విపుల జగతి

    రిప్లయితొలగించండి
  7. అవని పైన నదియు యాధారమే లేక
    యేల నిలిచె? జ్ఞాని యెవరు? నిలుప
    అంతరిక్షస్తంభ మద్భుతమ్మునుగాంచ
    వింతగాను దోచు విపుల జగతి

    రిప్లయితొలగించండి
  8. ఏమది యద్భుత మంచును
    కోమలి పరికించి జూడ కొంగున బట్టెన్
    భూమిని తాకక నిలచెను
    సోముని మహిమెన్న తరమె సోద్యపు శిల్పిన్

    రిప్లయితొలగించండి
  9. నేలను తాకక కంబము
    గాలిన నిలబడెను జూడ కడు చిత్రముగన్
    లీలలు జూపగ శిల్పులు
    తేలికగా గట్టినారె దేవళమందున్!!!

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. గుంభన మైనచిత్రమది గుప్తనిధట్లుగ శిల్ప చాతురీ
    డంభమునందు గూర్చెగద?దగ్గర జేరియు చీర వేసియున్
    స్తంభముక్రింద దీయగల సందునుగూర్చినశాస్త్ర వేత్త లా
    రంభము నుండి జూచిన సరైన విచారణ కానరాదిటన్|

    రిప్లయితొలగించండి
  12. శ్రీగురుభ్యోనమ:

    మూలమున వీరభద్రుడు
    ఫాలాక్షుని మందిరమున పలు శిల్పంబుల్
    నేలను తాకని స్తంభం
    బీ లేపాక్షికి సొబగులు హృదయంబనగన్

    రిప్లయితొలగించండి
  13. స్తంభము- పైననంటుకొని చక్కగ నిల్చినదెట్టులో !కటా,
    గుంభనశిల్పచాతురిని గొప్పగఁ జాటి, యపూర్వమై, మహా
    జృంభణరీతి చూపగల, శిల్పులు తాము కృతార్థులై శుభా
    రంభముఁ బల్కిరోయ్; ఘనము లక్ష్యము నొక్కటి చేరుకోవటోయ్!

    రిప్లయితొలగించండి
  14. ఈనాటి చిత్రాన్ని చూసి స్పందించి చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులు......
    డా. బల్లూరి ఉమాదేవి గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు, (ఈరోజు దత్తపదికి వ్రాయలేదు. ఎందుకో?)
    శైలజ గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. నమస్కారములు
    నిన్న అల్లల్లావెళ్ళి తిరిగి వచేసరికి లేటైంది .పైగా సవరణ జేయడానికి గురువుగారు కుడా [ ... ]వెళ్ళారని చదివి [క్షమించాలి.తమాషాకి మాత్రమె ] ఇంక రాసి దండుగ అని సిస్టంబందు చేసాను .ఇంక ఉదయం తొందరగా తట్టలేదు .అదన్నమాట అసల్ సంగతి

    రిప్లయితొలగించండి