రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** జిలేబీ గారూ, _/\_ ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. రెండవపాదంలో గణదోషం. ‘భరతావని సంస్కృతి యని భారత యువిదల్’ అందామా? ‘యువత+ఏ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ***** శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘పోరులంత’ అన్నదాన్ని ‘ముదితలంత’ అనండి.
చక్కని చీరెల సొగసులు
రిప్లయితొలగించండిమక్కువ లేదనె మహిళలు మనకు ప్రియంబౌ
నెక్కడి వారల కైనను
మిక్కుట మగుయంద మిడును మేలగు దుస్తుల్
నీరాజనముల్ మీదగు
రిప్లయితొలగించండిచీరెల సంస్కృతి కటంచు సింగారించన్
వారలు, బావ్యమ్మేనా
మీరలు పద్ధతి మరచుట? మెచ్చరు సుమ్మా!
రిప్లయితొలగించండిమిడీ ల తో మిస మిసలాడుదురు
జీన్సుల తో జింగిణమణులగుదురు
చీర కట్టులో జిగేలు మందురు
ఔరా ! ఇంతి చామంతి మేలుబంతి !
శుభోదయం
జిలేబి
చీరెను గట్టుక నడచిన
రిప్లయితొలగించండిచేరుచు కుచ్చిళ్ళనెత్తు చిరు భంగిమలే
మీరుచు కనులకు విందగు
సారీ ! మీ జీన్సునందు సరిగానములే.
సంప్రదాయమైన సరిగంచు చీరలు
రిప్లయితొలగించండికట్టుకొనుట వలన కళయు హెచ్చు
దాని జూచి పరులు ధరియించు చున్నారు
అతివ వేగ దీని నరయు మమ్మ.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
_/\_
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
భరత దేశపు సం స్కృతి న్భవ్యముగను
రిప్లయితొలగించండినితర దేశాల వారలే యిష్ట పడుచు
నుండ మనవార లరయగా నొకరు మించి
యొకరు ధరియింత్రు వస్త్రముల్నొప్ప నవియ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపరదేశీయులు మెచ్చిరి
తొలగించండిభరతావని సంస్కృతి యని భారత యువిదల్
మరచిరి మనసంస్కృతినే
పొరుగింటిన పుల్లకూర భూరిగ రుచియౌ
పొరుగు దేశము నందలి పోరులంత
రిప్లయితొలగించండిచీర కట్టుతోడుత కడు చెంగలించ
కోక కట్టుట యే మాకు కుదర దనుచు
పొరుగు దుస్తుల మనవారు మురియుచుండ్రి
భారత నారీమణులే
రిప్లయితొలగించండిచీరలను మరచి ముదముగ జీన్సులు వేయన్
ఫారిన్ వనితలు మెచ్చుచు
శారీ లనుదాల్చు చుండె సంతోషముగన్!!!
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో గణదోషం. ‘భరతావని సంస్కృతి యని భారత యువిదల్’ అందామా? ‘యువత+ఏ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పోరులంత’ అన్నదాన్ని ‘ముదితలంత’ అనండి.
రోసి నవీన వస్త్రముల, రోసి శరీరము దాచలేనివై
రిప్లయితొలగించండిమాసిన రీతి దోచు గతిమాలిన జీన్స్ ను, మాని, చీరలో
భాసిలగా విదేశముల భామలు! దేహమునంటి సొంపులన్
వాసిగ చూపు దుస్తులను ఫ్యాషను పేరిట భారతావనిన్
జూసిరె! వస్త్రధారణము చొక్కముగా మన శీలసంపదన్
రాసిగ జేసి చూపునని రమ్యముగా వచియింత్రు పెద్దలున్
మూసిన గుప్పెటన్ తెరువ బోసి యగున్ నశియించు మన్ననల్?
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ ఉత్పలమాలిక బాగున్నది. అభినందనలు.
పరదేశ సంస్కృతి వరమని భావించ?
రిప్లయితొలగించండి-------మనదేశ భావాలు మరుగుబడును.
చీరలుగట్టగ సింగార మనియెంచి
------పరదేశవాసుల పట్టుగలిగె
అందచందాలందు ననువైన చీరలు
-------మందగమనమందు పొందికగును
అర్ధ నగ్నతలందు ఆంగ్లేయ దుస్తులు
------ఆకర్షణీయమా?ఆంధ్రులార?
కొంగు బంగారమే |ప్రేమ పొంగిరాగ
రవికరతనాల సీమయౌ కవితకెపుడు
పద్యరచనందు కవులకు పట్టు|చీర
కోరనివనిత బంగారు గోర ఫలమ?
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పొరుగుదేశాలపడతులుబొట్టువిరులు
రిప్లయితొలగించండిచీరలుధరించిసంస్కృతిన్ గౌరవించ
భారతీయవనితలవి భారమనుచు
విడిచిపెట్టిరిమనదేశవిలువమరచి
హంగులన్ని జేరెనాకాశ వీధిన
రిప్లయితొలగించండిమచ్చుకైన లేదు మహిళ నేడు
దప్పి పోయె మహిళ ధ్వాంతము నందున
వేడు కొనెద మిమ్ము వెదికి తెమ్ము !!
భళిరే భారత సాంప్రదాయములకున్ పాశ్చాత్యులే మెచ్చియున్
రిప్లయితొలగించండికళలున్ సంస్కృతి బాగు బాగు ననుచున్ కంఠంబు నన్ తాళియున్
వలువల్ గట్టిరి పట్టుచీర రవికల్ వయ్యారమొల్కంగ, నా
తళుకుల్ జూడగ వచ్చినారు సురలున్ తండోపతండంబుగాన్
వేలకు వేలుపెట్టి, కొని వేసిరి రంధ్రపు జీన్సుపాంటులన్!
రిప్లయితొలగించండికాలికి యెత్తు చెప్పులును కన్పడు చంకల చిన్ని షర్టులున్ !
నీలపు కళ్ళజోడులును నివ్వెర పర్చెడి సోయగమ్ములున్!
యేలనొ భారతీయులయి యింతటి ధూర్తపు వేషధారణల్!!
కోకకట్టినారు-కోమలకన్యలు
రిప్లయితొలగించండిపడమటింటివారు-పైట వేసె
భారతీయనారి-పాశ్చాత్యతనుకోరె
తారుమారుగాదె-తీరుమారి