5, ఆగస్టు 2015, బుధవారం

పద్య రచన - 975

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. భావి భరత దేశ భాగ్యచంద్రిక వీవు
      మురికి కూపమందు మునగ నేమి?
      మట్టి లోనె దాగు మాణిక్యమనుమాట
      నెఱిగీ సాగు నీకు నింగి హద్దు

      తొలగించండి
    2. భావి భరత దేశ భాగ్యచంద్రిక వీవు
      మురికి కూపమందు మునగ నేమి?
      మట్టి లోనె దాగు మాణిక్యమనుమాట
      నెఱిగీ సాగు నీకు నింగి హద్దు

      తొలగించండి

  2. 255.అ.వె: తల్లి కష్ట పడుచు తనయను చదివింప
    మురికి గొట్టమందు మూల నుండి
    'నేటి బాల వీవు మేటిబాలికవౌగ
    నెదగ వలయు నమ్మ నెమ్మి /నెనరు తోడ

    రిప్లయితొలగించండి
  3. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఎఱిగి సాగు’ అనండి. (ఎఱగి=వంగి, నమస్కరించి, వ్రాలి; ఎఱిగి=తెలిసికొని).
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. గొట్టపు వాసమునే పడ
    గొట్టుట నీ చేత గలదు గురుతెరుగమ్మా
    కట్టెదము మంచి యింటిని
    పట్టుదలను బాగచదివి పైకెదిగినచో.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పైపు గర్భమందు వసియించు చుండియు
    బాలనంపు చుండె బడికి ప్రీతి
    రెక్కలాడినపుడె డొక్కాడు నని యెర్గి
    కష్ట పడుచు నుండె కన్న తల్లి

    రిప్లయితొలగించండి
  7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. ముఱి కి పారె డు గొట్టపు ముఖము నందు
    వాస మున్నట్టి యాతల్లి ,బడికి పంపు
    చుండె దనదుకూ తుమురిపించు చునును నట
    యెంత చక్కని తల్లియో వింత గొలిపె

    రిప్లయితొలగించండి
  9. ఇష్టమ్ముగ చదువు కొనిన
    స్పష్టముగ జయమ్ము నీది చదివించెదనే
    కష్టమ్ములకెదురీదుచు
    సృష్టించిన బ్రహ్మకూడ సిగ్గు పడ వలెన్

    రిప్లయితొలగించండి
  10. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. చిట్టీ! మనకీ దుర్భర
    గొట్టంపు బ్రతుకు తొలంగి కోరినవందన్
    చుట్టమ్మీ చదువందును
    గట్టెక్కించగ శ్రమించు గౌరవమబ్బున్

    రిప్లయితొలగించండి
  12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. తలదువ్విబొట్టిడు తల్లికి గనుపించె
    -----చదువుల తల్లిగాకదలుబిడ్డ|
    నిలబడ చిన్నారి నిలువెత్తు లక్ష్మిగా
    -----కళ్ళలో గదలాడు కలిమిలాగ|
    శక్తి సామర్థ్యంబు రక్తిగ వికశించె
    -----బాలికా భావాల బంధమందు|
    చదువ?సంస్కృతి నేర్పు-పదవుల నందించు
    -----నన్నభావన మది నల్లుకొనగ?
    పడ్డ కష్టాలకంటెను బిడ్డచదువు
    ముఖ్య మనియెంచి తల్లియేమురిసిపోవు
    దుస్తులందునకూతురి దూర-దృష్టి
    పంపనెంచెను గొట్టాల కొంపనుండి

    రిప్లయితొలగించండి
  14. గొట్టపు జీవనంబు పడగొట్టగవిద్యయెమూలమంచు తా
    దిట్టగుబిడ్డ లోకమున దీనత లేకను సంతసంబునే
    పట్టునటంచు నెంచగలభావన లందునతల్లి కోర్కెచే
    కట్టడులందు పంపుటన?కాంక్షలుదీర్చు సరస్వతీదయే.
    2చదువగ బిడ్డ?జీవితము చక్కగ నౌననుతల్లియూహలే
    అదనపు బాధ్యతందున –ప్రయాసల మధ్యనగొట్టమందునే
    ముదమున దుస్తులుంచి మునుముందుగబంపగపాఠశాలకున్
    చదువుల తల్లి దీవెనలె?సంపద నింపక మానదెప్పుడున్|

    రిప్లయితొలగించండి
  15. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. చదువన?జీవితాశయము.చక్కటి సంస్కృతి.ధర్మరక్షయే
    వొదిగిన వోర్పు నేర్పు,నలవోకగ లక్ష్మియు లక్ష్య సాధనా
    పదునుకు మార్గ దర్శకము.భావన భాగ్యము.మానవత్వమే
    కుదురును “విద్య నేర్వుమనికూతురునంపగ నెంచుచిత్రమే”

    రిప్లయితొలగించండి
  17. నిలువ నీడలేదు నివసింతుమన్నచో
    వలసినంత తిండి కలుగబోదు
    కలతలెన్ని యున్న కడదాక నాకున్న
    చదువు మీది ధ్యాస సడలబోదు.

    విద్యాపార్జన చేయుమానవులకేవీ యడ్డు రావంచు తా
    ముద్యుక్తంబున సర్వ శాస్త్ర పఠనా యోగంబులన్ బొందుచున్
    హృద్యంబౌ తమ లక్ష్యసాధనమునన్ పృథ్వీపథంబందున
    ఛ్చేద్యంబౌ ఘన సంస్కృతిన్ నెఱపి వైశిష్ఠ్యంబులన్ గానరే.

    రిప్లయితొలగించండి
  18. పట్టు దలగ జదివినచో
    గొట్టపు జీవనము పోయి గొప్పగ నిల్లున్
    కట్టుకు నివశించ గలము
    పట్టీ నువు బడికి పోవ బాధలు దీరున్!!!

    రిప్లయితొలగించండి
  19. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ తాజా పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి