వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘అంజను’డన్న ప్రయోగం లేదు. ‘అంజనిసుతుఁడే తెచ్చెను...’ అనండి. అలాగే ‘వింజామరలను నినకుల...’ అనండి. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవపాదంలో గణదోషం. ‘సంజాయిషి తెలిపి దనుజు...’ అనండి. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, నేను సూచించిన సవరణ ‘వింజామరలను నినకుల...’ ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మన్నించాలి... మీ రిచ్చిన వివరణ వలన కూడా పద్యం అవగాహనకు రావడం లేదు.
గుండు మధుసూదన్ గారూ, గదుని ప్రస్తావనతో, విలక్షణమైన విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు. ఈ వృత్తాంతం తెలిసినదే అనిపిస్తున్నది కాని గుర్తుకు రావడం లేదు.
ఈ పాత్రలు పింగళి సూరన్నగారి "ప్రభావతీ ప్రద్యుమ్నం"లో మనకు కల్పిస్తాయి. వజ్రనాభుఁడు, సునాభుఁడు, గదుఁడు, చంద్రవతి, నిరంజనసఖభటులు (=శ్రీకృష్ణుని భటులు), చంద్రవతి పెంపుడు చిలుక....ఇవియన్నియును నందులోనివే. వాటిని సందర్భమునకుం దగినట్లుగ నేను వాడుకొంటిని. స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅంజని సుతుడే దెచ్చెను
తొలగించండిసంజీవని, నంగదుండు సరుగున దెచ్చెన్
వింజామరలన్ నినకుల
సంజాతుల భక్తితోడ సత్కృతి సల్పన్
అంజని పుత్రుడు దెచ్చెను
రిప్లయితొలగించండిసంజీవని;యంగదుండు సరుగున దెచ్చెన్
రంజన మొనరింప దలచి
కంజాతము రామునిపదకంజముల కడన్
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘అంజను’డన్న ప్రయోగం లేదు. ‘అంజనిసుతుఁడే తెచ్చెను...’ అనండి. అలాగే ‘వింజామరలను నినకుల...’ అనండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. ‘సంజాయిషి తెలిపి దనుజు...’ అనండి.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
అంజన తనయుడు చేకొనె
రిప్లయితొలగించండిసంజీవని , నంగదుండు సరగునఁ దెచ్చెన్
సంజాయిషి తెలిపి దనుజు
రంజింపగ మదిని గోరు రభువు డటంచున్
రభువు = రాయబారి
వింజామరలను తెమ్మన
రిప్లయితొలగించండికంజదళాక్షుడు ముదమున గగనమునందే
అంజన సుతు చేతను గని
సంజీవని, నంగదుండు సరగునఁ దెచ్చెన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంజని సుతుడే దెచ్చెను
రిప్లయితొలగించండిసంజీవని ,నంగదుండు సరగున దెచ్చె
గంజ దళాక్షుని గొలువగ
రంజిత కుసుమాల నెన్నొ రాగము తోడన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅంజని పుత్రుడు కూర్చెను
రిప్లయితొలగించండిసంజీవని, నంగదుండు సరగున దెచ్చెన్
వింజామర రిపు మూకల
భంజనుడైనట్టి రాము బడలిక బాపన్
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండినేను సూచించిన సవరణ ‘వింజామరలను నినకుల...’
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కెంజాయ వేళ నాటక
రిప్లయితొలగించండిరంజనుడై ముదుసలనియె లక్ష్మణుఁ గావ
న్నంజన సుతుడందించగ
సంజీవని నంగదుండు సరగున దెచ్చెన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిఅంజన సుతుడేగగ గన
సంజీవని, నంగదుండు సరగునఁ దెచ్చెన్
రంజింపు వార్త ,రాముని
కంజలి ఘటియించి, తనదు ఘనకార్యమునన్.
చిట్టీ! మనకీ దుర్భర
రిప్లయితొలగించండిగొట్టంపు బ్రతుకు తొలంగి కోరినవందన్
చుట్టమ్మీ చదువందును
గట్టెక్కించగ శ్రమించు గౌరవమబ్బున్
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅ౦జని సూనుడు హనుమయ
సంజీవని వెదుకలేక శైలము దెచ్చెన్
కుంజమ్మున గుర్తించుచు
సంజీవని నంగదుండు సరగున దెచ్చెన్
కెంబాయి తిమ్మాజీరావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
అంజనపుత్రుడు వెంటనె
రిప్లయితొలగించండిసంజీవనినంగ-దుండు సరుగున దెచ్చెన్
పుంజుకొను లక్ష్మణుండని
సంజవడు సమయాన రాగ? సరుగున బ్రతికెన్|
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండి‘సంజీవనినంగ-దుండు’... వివరించండి.
అంజనిసుతుడరుతేరగ
రిప్లయితొలగించండిసంజీవని కొండ వెసను సౌమిత్రిని వే
గం జీవునిజేయు కొరకు
సంజీవని నంగదుండు సరగున దెచ్చెన్
అంజనిసుతుడాతడు తా
పుంజపు రోమాంగదుడయి పొసగను వే
గం జీవిగ లక్ష్మణుగన
సంజీవని నంగదుండు సరగున దెచ్చెన్
భంజన మందగ లక్ష్మణు
డుం జీవనమంద వేగ డుంగుచు జని యా
యంజనిసుత రోమాంగుడు
సంజీవని నంగదుండు సరగున దెచ్చెన్
అంజున లక్ష్మణు మూర్ఛకు
నంజని సుతుడటులరయక యా మూలికనే
సంజీవని కొండను తే
సంజీవని నంగదుండు సరగున దెచ్చెన్
శ్రీగురువుగారైన కంది శంకరయ్యగారికివందనాలతో
రిప్లయితొలగించండివిన్నపము
సంజీవనినంగ=సంజీవని ననగల
దుండు=తుండు=ముక్కఅన్నభావన
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మన్నించాలి... మీ రిచ్చిన వివరణ వలన కూడా పద్యం అవగాహనకు రావడం లేదు.
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులు!
రిప్లయితొలగించండి(వజ్రనాభుని తమ్ముఁడు సునాభుని కూఁతురగు చంద్రవతితో నామె పెంపుడు చిలుక, చంద్రవతి ప్రియుఁడగు గదుని వెదుకం బోయి, చిక్కులం దెచ్చుకొనిన విషయమునుం దెలుపుచు, గదుఁడే తన్ను విడిపించినాఁడని నుడివిన సందర్భము)
మంజువచన! చంద్రవతి! ని
రంజనసఖభటులు పంజరమ్మున నిడ, నా
బంజరమందుం గని, శుక
సంజీవని! నన్ గదుండు సరగునఁ దెచ్చెన్!!
(...నంగదుండు...> నన్ గదుండు...)
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిగదుని ప్రస్తావనతో, విలక్షణమైన విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
ఈ వృత్తాంతం తెలిసినదే అనిపిస్తున్నది కాని గుర్తుకు రావడం లేదు.
నమస్కారం శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండిఈ పాత్రలు పింగళి సూరన్నగారి "ప్రభావతీ ప్రద్యుమ్నం"లో మనకు కల్పిస్తాయి. వజ్రనాభుఁడు, సునాభుఁడు, గదుఁడు, చంద్రవతి, నిరంజనసఖభటులు (=శ్రీకృష్ణుని భటులు), చంద్రవతి పెంపుడు చిలుక....ఇవియన్నియును నందులోనివే. వాటిని సందర్భమునకుం దగినట్లుగ నేను వాడుకొంటిని. స్వస్తి.