16, ఆగస్టు 2015, ఆదివారం

సమస్యాపూరణ - 1761 (భర్తృరహిత సంతుఁ బడసి మురిసె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
భర్తృరహిత సంతుఁ బడసి మురిసె.
(ఈ సమస్యకు స్ఫూర్తి నిచ్చిన బూసారపు నర్సయ్య గారికి ధన్యవాదాలు)

37 కామెంట్‌లు:

  1. దురిత దూరుఁడైన దుర్వాస మునిచేత
    వరమునంది సూర్యు వలన తాను
    కర్ణ జననమునకు కారణురాలయ్యె
    భర్తృరహిత సంతుఁ బడసి మురిసె.

    రిప్లయితొలగించండి
  2. మూడునెలల కడుపు మొగడుండగాతనకు
    పతిని కోలుపోయి వెతలు పొందె
    నెలలునిండి పోయి నీళ్ళాడెనాయింతి
    భర్తృరహిత - సంతుఁ బడసి మురిసె

    రిప్లయితొలగించండి
  3. భక్తితోడ శివుని పాదాలపైవ్రాలి
    శరణు వేడు కొనియె సంతు గోరె
    భీమకవినిఁ గన్న నామెయే వెరువక
    భర్త రహిత సంతు బడసి మురిసె

    రిప్లయితొలగించండి
  4. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ఆ.వె :మునివరుడగు యత్రి పుత్రుడొసంగిన
    వరము పేర్మి చేత వనిత కుంతి
    తరణిని మనసార దలచి ముదముతోడ
    భర్తృ రహిత సంతు బడసి మురిసె.

    రిప్లయితొలగించండి
  6. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కుంతికి వరమిచ్చింది దుర్వాసుడు కదా! మీరు అత్రి అన్నారు.

    రిప్లయితొలగించండి
  7. నిండు నెలలు మోసి నిర్భయముగనుండ
    పతియు కాల ముడిగి మృతియు నొంద
    భర్త లేని బ్రతుకు బహుభారముకాగ
    భర్తృరహిత సంతుఁ బడసి మురిసె

    రిప్లయితొలగించండి
  8. కవిశ్రీ సత్తిబాబు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  9. శ్రీగురుభ్యోనమ:

    మగడు తప్పిపోయె, మగువ రోధించెను
    పతి గతించె ననెడి వార్త జెప్ప
    తిరిగి వచ్చె భర్త, తెలిసెను కాదామె
    భర్తృరహిత, సంతుఁ బడసి మురిసె.

    (NTR,సావిత్రి నటించిన 'దేవత ')

    రిప్లయితొలగించండి
  10. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘దేవత’ సినిమాలో భార్య మరణిస్తే ఆ విషయం తెలియని భర్త భార్యలాగే ఉన్న మరొక స్త్రీని తన భార్యే అనుకొని ఇంటికి తెస్తాడు. మీరు చెప్పిన కథ అందులో లేనట్టున్నది.

    రిప్లయితొలగించండి
  11. నమస్కారమండి గురువుగారూ.అత్రి పుత్రుడన్నానండీ.అత్రిమహర్షి అనసూయల కుమారుడు దుర్వాసుడని అంటారు కదండి.ఆ విషయాన్ని ఇక్కడ పొఐదుపరచినాను.

    రిప్లయితొలగించండి
  12. భర్తృరహిత సంతుఁ బడసి మురిసె నన్న
    ధర్మబద్ధ మౌనె ధర్మరాజ?
    పతినిపొందు యముని వరమొందిసావిత్రి
    సంతసంబు నొందె సచ్చరిత్రి!!!

    రిప్లయితొలగించండి
  13. బల్లూరి ఉమాదేవి గారూ,
    నేనే పొరబడ్డాను. మన్నించండి.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. ధన్యవాదములు గురువుగారు.
    సినిమా పేరు గుర్తుకు రాలేదు. NTR,సావిత్రి,శోబన్ బాబు,రేలంగి మొ// నటించారు. "మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ" అనే పాట అందులోనిదే.

    రిప్లయితొలగించండి
  15. న్యాయమూర్తి తగ విడాకులు దయసేయ
    సంతు గూర్చి తిరిగి జగడమెసగ
    న్యాయవాద నిజసహాయసమోపేత-
    భర్తృరహిత- సంతుఁ బడసి మురిసె.

    రిప్లయితొలగించండి
  16. భాగ్యవంతు నంది పరవశమ్మున దేలి
    కడుపు పండు వ్రాత కాన రాక
    యో యనాద శిశువు నాదరమ్మున బెంచ
    భర్తృరహిత సంతుఁ బడసి మురిసె!

    రిప్లయితొలగించండి
  17. ఉంచు కొనిన వాని కొడలిని చ్చి యొ కతె
    బిడ్డ గనగ నంత ప్రేమ మీర
    చూఛి మురియు చుండె సోయగంబునకు ను
    భర్తృ రహిత సంతు బడసి మురిసె

    రిప్లయితొలగించండి
  18. శ్రీపతిశాస్త్రి గారూ!
    దేవత సినిమాలో పాట:
    "ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి"

    రిప్లయితొలగించండి
  19. గురువుగారు శంకరయ్య గారికి వందనములు.

    ఆ.వె.నిత్యవేదనమున నరకయాతనమున
    భర్త తోడ నిత్య బాధలొంది
    విసుగుఁజెంది తాను వదలి వేరుఁగాగ
    భర్తృ రహిత సంతుఁ బడసి మురిసె

    రిప్లయితొలగించండి
  20. గురువుగారు శంకరయ్య గారికి వందనములు.

    ఆ.వె.నిత్యవేదనమున నరకయాతనమున
    భర్త తోడ నిత్య బాధలొంది
    విసుగుఁజెంది తాను వదలి వేరుఁగాగ
    భర్తృ రహిత సంతుఁ బడసి మురిసె

    రిప్లయితొలగించండి
  21. ఇల్లు, సైకిలద్దెకిచ్చు చందమ్మున
    గర్భమద్దెకిచ్చు కాలమందు
    సుతుల కనగలేని హితురాలి మారుగన్
    భర్తృహీన సంతు బడసి మురిసె

    రిప్లయితొలగించండి
  22. కట్టుకొన్న వాని కాట్రేడు గొనిపోవ
    గర్భవతిగనున్న కాంతగాంచి
    యూరిలోని వార లూతనందించగ
    భర్తృ రహిత సంతు బడసి మురిసె

    రిప్లయితొలగించండి
  23. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    మత్స్యగంధిఁ గోరి, మౌని పరాశర్యుఁ
    డామె కన్నెతనము హతము కాని
    వరము నొసఁగి, కలియ, వ్యాసుండు జన్మించె!
    భర్తృరహిత, సంతుఁ బడసి, మురిసె!!


    రిప్లయితొలగించండి
  24. వీరగతిని జెంద వీరాభిమన్యుడు
    భ్రూణ యైన విరటు పుత్రి సుతుడు
    చచ్చిపుట్టి మరల జాతుడై చెలగంగ
    భర్తృరహిత, సంతుఁ బడసి, మురిసె

    రిప్లయితొలగించండి
  25. బూసారపు నర్సయ్య గారి పూరణ......

    భాగ్య ముండెఁ గాని భర్త లేఁ డని యేడ్చె
    భర్తృరహిత; సంతుఁ బడసి మురిసె
    చాల బీదవనిత; సంతృప్తజీవన
    భాగ్య మొందుకొఱకు భాగ్య మేల?

    రిప్లయితొలగించండి
  26. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    భర్త మరణ మొంద పడరాని పాట్లొందె
    భర్తృరహిత ; సంతుఁ బడసి మురిసె
    సకల సౌఖ్యములను సత్పుత్రు డొనగూర్చ
    సుదతి యొకతె భర్త ముదము గూర్చ

    రిప్లయితొలగించండి
  27. శ్రీమతికిని నాడు సీమంతమేజేసి
    కార్గి "లనిని " బోరి స్వర్గమేగ
    పతినిగోలు పోవు బాధనే మరువగా
    భర్తృరహిత సంతుఁ బడసి మురిసె.

    రిప్లయితొలగించండి
  28. ‘ఊకదంపుడు’ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    వల్లూరి మురళి గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగుకు స్వాగతం!
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. కన్నెమరియతాను కన్నదా యేసునే
    ఘనుడు వాని జనులు,కాంతి నిడెడు
    దైవమంచు గొలువ దైవంపుమాతగా
    భర్తృరహిత సంతు బడసి మురిసె

    మునియు నిడిన మంత్రమొప్పు చదువకుంతి
    భాస్కరుండు కొడుకు పడతికిచ్చె
    కవచ కుండలాల కాంతిని వెలిగెడు
    భర్తృరహిత సంతు బడసి మురిసె

    పాండురాజునాజ్ఞ పడసెను కుంతియే
    నతడు శాపమంది యంటకుంట
    దేవతాళి వలన దివ్యమౌ కొమరుల
    భర్తృరహిత సంతు బడసిమురిసె

    పెండ్లియనెడుదాని పీడగా దలచియు
    పిండమద్దెకుగొని వేగ కనదె
    విప్లవాల తలపు వేగాననొకతెయు
    భర్తృరహిత సంతు బడసిమురిసె

    రిప్లయితొలగించండి
  30. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మరియ, కుంతి భర్తృరహితలు కాదుగదా!

    రిప్లయితొలగించండి
  31. గురువుగారూ,
    ధన్యవాదములు.

    మురళి గారూ,
    మీ పద్యం లో ఒకటి మూడు పాదములలో యతి ఒకమారు సరిచూడవలసి ఉందేమో
    భవదీయుడు

    రిప్లయితొలగించండి
  32. ఊకదంపుడు గారూ,
    ధన్యవాదాలు. నేనీ దోషాలను మురళి గారు `Whatsapp'లో పెట్టినప్పుడే గమనించాను. కాని బ్లాగులో సమీక్షించే సమయంలో మరిచిపోయాను.
    *****
    మురళిగారూ,
    మీ పూరణలో మొదటిపాదంలో యతి, మూడవపాదంలో యతితో పాటు గణమూ తప్పాయి మొదటి పాదాన్ని ‘నిరతవేదనమున నరకయాతనమున’ అనీ, మూడవపాదాన్ని ‘విసిగు చెంది తాను విడిచి వేఱుపడగ’ అనండి.

    రిప్లయితొలగించండి
  33. ఆ.వె.నిరత వేదనమున నరకయాతనమున
    భర్త తోడ నిత్య బాధలొంది
    విసుగుఁజెంది తాను విడిచి వేఱుపడగ
    భర్తృ రహిత సంతుఁ బడసి మురిసె

    రిప్లయితొలగించండి
  34. ఆ.వె.నిరత వేదనమున నరకయాతనమున
    భర్త తోడ నిత్య బాధలొంది
    విసుగుఁజెంది తాను విడిచి వేఱుపడగ
    భర్తృ రహిత సంతుఁ బడసి మురిసె

    రిప్లయితొలగించండి
  35. మురళి గారూ,
    నా సూచనను మన్నించి పద్యాన్ని సవరించినందుకు సంతోషం!

    రిప్లయితొలగించండి