చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది అభినందనలు. ‘ఎండకు నెండుచు... మొండిగ నా మట్టి...’ అనండి. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. రెండవపద్యం, రెండవపాదంలో యతి తప్పింది. ‘నెమ్మిని జేయంగ పాత్ర నీలాంగునకున్’ అనండి.
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘మహిని నతడె’ అనండి. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ వృత్తరచనాభ్యాసానికి ‘పద్యరచన’ శీర్షిక ఉపయోగపడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఎండకు యెండుచు కుమ్మరి
రిప్లయితొలగించండిమొండిగ యా మట్టి మలచి ముచ్ఛటగా తా
కుండలచేయుచునుండెను
నిండదు కడుపైన తనకు నిత్యము పస్తే
కండలు కరిగెను తుదకిటు
రిప్లయితొలగించండిదండిగ కుండలను జేసి దప్పిక యనకన్
కొండలు తవ్విన మట్టిని
పిండిన దొరకనిది పైస పేదల బ్రతుకున్
------------------------------------------
కుమ్మరి భీముడు మట్టిని
నెమ్మిని చేయంగ పాత్ర వేంకట పతికై
కమ్మని పెరుగ న్నమ్మును
నిమ్ముగ నైవేద్య మిడగ నిలవేలు పటన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది అభినందనలు.
‘ఎండకు నెండుచు... మొండిగ నా మట్టి...’ అనండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవపద్యం, రెండవపాదంలో యతి తప్పింది. ‘నెమ్మిని జేయంగ పాత్ర నీలాంగునకున్’ అనండి.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
మాత్రను సంపాదించగ
రిప్లయితొలగించండిపాత్రల చొట్టలనుదీసి బాగుగ జేయన్
రాత్రంతయు నిదుర మరచి
నాత్రముగా జేయుచుండె నాముదుసలియే!!!
మాత్ర = ధనము
చొట్టల పాత్రలఁ బట్టుకు
రిప్లయితొలగించండిదట్టించుచు బాగు జేయు దశమీస్తునికిన్
కొట్టమె నివాస మయ్యెను
పొట్టైనను నిండు రోజు పుట్టునొ లేదో?
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పొట్ట కూటి కొరకు పొద్దస్తమానమ్ము
రిప్లయితొలగించండివృద్ధుడైన నేమి వృత్తి యందు
అలసి పోక తాత ఆరాటపడుచుండె
మహిన యతడె గొప్ప మార్గదర్శి
పొట్ట కూటి కొరకు పొద్దస్తమానమ్ము
రిప్లయితొలగించండివృద్ధుడైన నేమి వృత్తి యందు
అలసి పోక తాత ఆరాటపడుచుండె
మహిన యతడె గొప్ప మార్గదర్శి
కుండలుకండబెంచుటకు,కూడును,గుడ్డనునుంచునన్నతా
రిప్లయితొలగించండిమెండగుఎండలుండిననుమేటిగ వాటినిజేయనెంచినా
అండగ రానివై ధరలు నాశలునార్పగ ఇంటివారికిన్
తిండికి కష్టమాయెగద|దీనత కుమ్మరి వృత్తికబ్బెగా|
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘మహిని నతడె’ అనండి.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ వృత్తరచనాభ్యాసానికి ‘పద్యరచన’ శీర్షిక ఉపయోగపడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఓర్పుతోడ కరము నేర్పుతో కుండల
రిప్లయితొలగించండినద్భుతముగఁ జేసి యమ్ముచుంద్రు
మట్టి కుండలోని మంచినీ రెప్పుడు
తియ్యగుండునందు రయ్యలెపుడు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ముదిమి మీద బడ్డ ముదుసలి యౌతాత
రిప్లయితొలగించండిసొట్ట గిన్నెలెల్ల చూసిచూసి
వంకరలను తీసి బాగు చేయుచు నుండె
పొట్టకూటి కొరకు పుడమి యందు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
కాని అవి కుండలు... మీరు గిన్నెలు అన్నారు.
"సొట్ట కుండ లన్ని చూసిచూసి"
రిప్లయితొలగించండిఅంటె సరిపోతుందా అన్నయ్యగారూ.
ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిచక్కగా సరిపోతుంది. సంతోషం!