19, ఆగస్టు 2015, బుధవారం

సమస్యాపూరణ - 1764 (భారతయుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
భారతయుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్.

35 కామెంట్‌లు:

  1. కం: వీరుండని పేరొందిన
    కౌరవ నాథుని సఖుండు కాల మహిమచే
    ఘోరంబగు తీరున యా
    భారత యుధ్ధమున నయ్యొ పార్థుండోడెన్.
    పృథా(కుంతీదేవి)కుమారులందరూ పార్థులే.ఇక్కడ కర్ణుడు అనే అర్థంలో వ్రాశానండీ.

    రిప్లయితొలగించండి
  2. కౌరవ పద్మవ్యూహము
    క్రూరవిధమ్ము నభిమన్యుఁ గూల్చిన గొరతన్
    వారస రహిత జయమ్మున
    భారత యుద్ధమున నయ్యొ పార్థుండోడెన్!

    రిప్లయితొలగించండి
  3. శ్రీగురుభ్యోనమ:

    శ్రీకృష్ణపరమాత్మునితో ధర్మరాజు చెప్పినట్లుగా

    "నీరజనేత్రా గనుమా
    మారణ హోమంబు జేయు మా భీష్మునితో
    పోర నసాధ్యంబగు
    భారతయుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్.

    రిప్లయితొలగించండి
  4. శ్రీగురుభ్యోనమ:

    అన్వయలోపమును సవరిస్తూ

    "వారము గడచిన దైనను
    మారణ హోమంబు జేయు మా భీష్మునితో
    పోరియు, నీరజనేత్రా
    భారతయుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్"

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    (అశ్వమేధ యాగాశ్వ గ్రహీత బభ్రువాహనుఁ డర్జునుని నిర్జించిన విధమునుం దర్జించుచు ధర్మరాజుతో శ్రీకృష్ణుఁడు పలికిన సందర్భము)

    కోరియుఁ జిత్రాంగదకుఁ గు
    మారుఁడు హయముం గొని, పరమాంచితమౌ
    వీరత నర్జునుఁ జంపఁగ,
    భారత! యుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్!

    రిప్లయితొలగించండి


  6. కౌరవుల "వ్యూహమున" బడి
    జేరగ నా వ్యూహమందు చెంగట లేకన్
    తీరుగ సుతు రక్షణలో
    భారతయుద్ధమున,నయ్యొ పార్థుం డోడెన్.

    రిప్లయితొలగించండి
  7. యుద్ధానంతరము, సమస్త బంధు జనులను గురువులను హితులను పోగొట్టుకున్న తరువాత ఇదీ ఒక గెలుపేనా అన్న వెటకారఁపు మాటల దుర్యోధనుఁడు........

    పోరున బంధులు మిత్రులు
    కారణజన్ములు సమర్థ కార్యాధ్యక్షుల్
    దారుణ మరణము నొందిరె !
    భారత యుద్ధమున నయ్యొ పార్థుండోడెన్.

    రిప్లయితొలగించండి
  8. కౌరవ పక్షపు యోధుడు
    బీ రముతో బోరు సలుప భీష్ముడు రాగ
    న్బోర న్నిలువగ బార్ధుడు
    భారత యుద్ధమున నయ్యొ పా ర్ధుం డో డెన్

    రిప్లయితొలగించండి
  9. పోరగ రథికుండుండగ
    సారధి చక్రంబుబట్ట సరియే కృష్ణా ?
    వీరులు మదిదలుతురిటుల
    భారత యుద్ధమున నయ్యొ పార్ధుం డోడెన్!!!

    రిప్లయితొలగించండి
  10. బూసారపు నర్సయ్య గారి పూరణ....

    వీరసుతుం గోల్పోయెను
    భారతయుద్ధమున నయ్యొ పార్థుం; డోడెన్
    కౌరవసైన్యము; శూరుల్
    వీరుల్ దెగటార్చఁబడిరి విధివంచితులై.

    రిప్లయితొలగించండి

  11. ఆరయ నర్జునుడగ్నిని
    జేరుట, సైంధవుని మడియ జేయమి, వైరుల్
    జేరిరి కొందరు పల్కిరి
    భారతయుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్.

    రిప్లయితొలగించండి
  12. వీరతఁజూపిరి పార్థులు
    భారతయుద్ధమున, నయ్యొ పార్థుండోడెన్
    శౌరి మరణమ్ము తదుపరి
    కారడవిన పోవునపుడు కాంచక మనువున్(కంకులతో సమరమందు కారడవులలో)
    మనువుః మంత్రము

    రిప్లయితొలగించండి
  13. చేరువలో లేనందున
    పోరాడెడుసుతుని గావ బోవగ లేక
    న్నౌరసునిగోలుపోయెను
    భారత యుద్ధమున,నయ్యొ పార్థుం డోడెన్!!!

    రిప్లయితొలగించండి
  14. భారత ప్రభుతయొసంగిన
    గారవ మర్జున బిరుదము గలిగిన కోహ్లీ
    పోరగ నోడెను, లంకన
    భారత యుద్ధమున నయ్యొ పార్ధుండోడెన్

    రిప్లయితొలగించండి
  15. పై పద్యం కొద్ది మార్పుతో ఇలా

    భారత ప్రభుతయొసంగిన
    గారవ మర్జున బిరుదము గలిగిన కోహ్లీ
    పోరగ జాలక, లంకా
    భారత యుద్ధమున నయ్యొ పార్ధుండోడెన్

    రిప్లయితొలగించండి

  16. జారెను విలు తూణీరము
    భారత యుద్దమ్మునందు;పార్ధు౦ డోడెన్
    వీరులవిది బవర మ్మని
    సారథి కృష్ణుండు గీత సద్బోధించెన్

    ఓడు=సంకోచించు

    రిప్లయితొలగించండి
  17. పోర వరించెను విజయము
    భారత యుద్ధమున నయ్యొ పార్థున్ డోడెన్
    వీరవరేణ్యుడు కర్ణుడు
    కారణములుగలవుపెక్కు కథపరికింపన్ !!!


    రిప్లయితొలగించండి
  18. 2.
    శూరుడౌ రాధేయుడు
    దారుణ మారణ ముఁజేయ, తప్పుకొనంగన్
    తేరు మరల్పమనె హరిని
    భారతయుద్ధమున, నయ్యొ పార్థుండోడెన్

    రిప్లయితొలగించండి
  19. గురువు గారికి మరియు కవిమిత్రులకు నమస్కారములు,
    భీష్మునిపై కృష్ణుడు రథచక్రము ఎత్తిన సందర్భమున విజయుడు కృష్ణుని వలదని వేడుకొనునటుల ఊహించిన పూరణము

    పోరున సాయము జేయగ
    సారధిగా నుందునంచు చక్రము దాల్చన్
    వీరులు తలవరె కృష్ణా
    భారత యుద్ధమున నయ్యొ పార్థుండోడెన్

    రిప్లయితొలగించండి
  20. గురువుగారికి నమస్కారములు
    భీష్మునిపై కృష్ణుడు రథచక్రము ఎత్తిన సందర్భమున విజయుడు కృష్ణుని వలదని వేడుకొనునటుల ఊహించిన పూరణము

    పోరున సాయము జేయగ సారధిగా నుందునంచు చక్రము దాల్చన్
    వీరులు తలవరె కృష్ణా
    భారత యుద్ధమున నయ్యొ పార్థుండోడెన్

    రిప్లయితొలగించండి
  21. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తీరున నా| భారత...’ అనండి.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదం చివర గణదోషం. సవరించండి.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పార్థ’ శబ్దం పునరుక్తమయింది. అన్వయలోపంకూడా ఉన్నట్టుంది.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    బూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. మంచి పూరణ. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వీరుల విది’...?
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. వీరోత్తము డభిమన్యు కు
    మారుని కాపాడ లేని మందుండాయెన్
    ధీరుడు గెలిచియు పాపము
    భారతయుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్.

    రిప్లయితొలగించండి
  23. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అభిమన్య కుమారుడు’ అనండి.

    రిప్లయితొలగించండి
  24. కోరెను దైవపు సాయము
    భారత యుద్ధమున నయ్యొ పార్ధుం-డోడెన్
    కౌరవులెలమిని,తను వే
    కోరక దైవంపు బలము కుత్సితుడగుచున్

    వీరుడు కర్ణుడు పార్ధుడె
    కూరిమి పుత్రుడు నగుటను కుంతికి-కనె నా
    వీరుడు మరణము ననిలో
    భారత యుద్ధమున నయ్యొ పార్ధుండోడెన్

    ధీరుడు భీష్ముని చేతను
    భారత యుద్ధమున నయ్యొ పార్ధుండోడెన్
    కోరిన కృష్ణుని దయతో
    వీరుడు నౌచును విజయుడు వెలిగెను తుదకున్

    వీరాభిమన్యుడొరుగగ
    భారత యుద్ధమున నయ్యొ పార్ధుండోడెన్
    ధీరుడు నౌచును నటుపై
    భారత యుద్ధమున నతడె భాసిలె తుదకున్

    రిప్లయితొలగించండి
  25. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    ఆరణ భూమిని నరుడన
    '' కోరను నాశనము బందుగుల కీయని లో ''
    కారణ జన్ముడు బలికెను
    భారతయుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్

    వైరులు తమ బందుగులే
    పోరున యెదురాడ జూచి పొదిని విడువగా
    నారాయణుడనె చనవున
    భారతయుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్.

    రిప్లయితొలగించండి
  26. గురుదేవులకు నమస్కారములు
    వీరుల విధి=వీరుల సౌభాగ్యము,అన్న అర్ధములో ప్రయోగి౦చాను

    రిప్లయితొలగించండి
  27. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. మాస్టరుగారూ ! ధన్యవాదములు.
    సంపత్ కుమార్ గారూ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  29. ధన్యవాదములు శంకరయ్యగారూ! నిజమే, రెండవ పాదము చివర "సౌ" టైపాటు జరిగినది. నేను గమనింపకయే ప్రచురించితిని. జరిగిన దోషమునుం దెలిపినందులకుఁ గృతజ్ఞుఁడను. సవరించిన పూరణము:

    (అశ్వమేధ యాగాశ్వ గ్రహీత బభ్రువాహనుఁ డర్జునుని నిర్జించిన విధమునుం దర్జించుచు ధర్మరాజుతో శ్రీకృష్ణుఁడు పలికిన సందర్భము)

    కోరియుఁ జిత్రాంగదకుఁ గు
    మారుఁడు హయముం గొని, పరమాంచితమౌ సౌ
    వీరత నర్జునుఁ జంపఁగ,
    భారత! యుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్!

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  30. శంకరయ్య గారూ నమస్తే ! అనివార్య కారణాలచే (భారత యుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్)సమస్యకు

    పూరణ ఈరోజు పంపుచున్నాను.

    వరజాతుడు కర్ణు గెలిచె

    పురహరు సైతము విజయుడు పోరున గెలిచెన్ ;

    నరవరు డెట్లే రీతిగ

    భారత యుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్.

    విద్వాన్, డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూర్;కడప జిల్లా 516175. 20-8-2015

    రిప్లయితొలగించండి
  31. డా. మూలె రామముని రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. దారుణముగనా కర్ణుని
    భీరువు వలె ద్రోణు జంపి వెన్నుని దయతో
    తీరుగ భీష్ముని గెల్వక
    భారతయుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్

    రిప్లయితొలగించండి


  33. మతి సమ్మతి సన్మతి యభి
    రతి, యవిరతి కొఱతిలేని ప్రతికర్మముగా
    యతికాని విధముగా నను
    రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!


    జిలేబి

    రిప్లయితొలగించండి