30, ఆగస్టు 2015, ఆదివారం

సమస్యాపూరణ - 1774 (హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్.

24 కామెంట్‌లు:

  1. సతులను మాయజేసి తమ సౌఖ్యము కోసము పౌరులెల్లరున్
    మతిచెడి యూర నున్న నొక మంజిక పొందును గోరి రోగులై
    వెతలను బొందు చుందురని వృత్తిని మాన్పగ సంఘసేవికై
    హితము గనంగ ప్రాణ విభు నింతియె పంపెను వేశ్య చెంతకున్!

    రిప్లయితొలగించండి
  2. పతితులు భ్రష్టులై పతులు బానిసలై చన వేశ్యవద్దకున్
    వెతలకు తల్లడిల్లునలివేణులకూరటనివ్వ నెంచుచున్
    చతురత కల్గినట్టి తన స్వామియె కట్టడిచేయునంచు తా
    హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్.

    రిప్లయితొలగించండి
  3. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. సతతము వేశ్యవాటికయె, సర్వము ధారగవోసి హీనుడై
    మతిచెడి మద్యపానమున మత్తుడయిల్లును కానలేక శ్రీ
    మతిఁ మతి లేనిదానివలె మార్చి, న ముద్దుల చిన్న తమ్మునిన్
    హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్

    రిప్లయితొలగించండి
  5. సతతము వేశ్యవాటికయె, సర్వము ధారగవోసి హీనుడై
    మతిచెడి మద్యపానమున మత్తుడయిల్లును కానలేక శ్రీ
    మతిఁ మతి లేనిదానివలె మార్చి, న ముద్దుల చిన్న తమ్మునిన్
    హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్

    రిప్లయితొలగించండి
  6. పతిని లసేవ జేయుటయె భారత జాతికి భావ్య మంచుతా
    మతిమర పందు భర్తగని మైకము నెంచక రాముడంచునే
    పతితుల స్నేహ మంటినను భారము ,జీవన యాన మందునన్
    హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్

    రిప్లయితొలగించండి

  7. శ్రీగురుభ్యోనమ:

    సతతము దుష్టవర్తనులు సభ్యసమాజము సిగ్గు జెందగా
    నతివల నమ్ముచుండిరట యాతన నొందుచు దీనులైన య
    ప్పతితల కష్టనష్టములు వ్రాయగ గోరిన యా విలేఖరీ
    హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్.

    రిప్లయితొలగించండి
  8. సతతము సత్ప్రవర్తన విశారదురాలయి జీవకోటి సం
    తతులకు సేవయే నిజవిధానము జేసె నహింసయందు తా
    నతులిత, వేశ్యవాసిత గృహమ్మున రోదన నాలకించి లో
    హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్

    రిప్లయితొలగించండి
  9. ఓ పోలీసు భార్య:
    పతితులు భ్రష్టులున్ చెలగి పాలన జేయగ నీతిమృగ్యమై
    గతిచెడి ఛాత్రులున్ యువత గ్రామనివాసులు జారులవ్వ, స్త్రీ
    లు తనకు విన్నవించగను, లోనెఱ నమ్మి "పొలీసు రైడు" కై
    హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్.

    రిప్లయితొలగించండి
  10. శ్రీపతి శాస్త్రి గారి పద్యం ఈ పాత ఛలోక్తిని గుర్తుకు తెచ్చింది:

    భార్య : మీరు ఆ వేశ్య వద్దకు వెళ్లవలిసిన అవసరమేమిటో
    భర్త(విలేకరి): వృత్తిరిత్యా వెళ్లవలసివచ్చింది
    భార్య : మీ వృత్తిరిత్యా నా? ఆవిడ వృత్తిరిత్యా నా?

    వారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

  11. మిత్రులందఱకు నమస్సులు!

    పతికి నమస్కరింపఁ బతి పాదములంటి పతివ్రతా విధుల్
    సతతముఁ జేయు నా సుమతి; సానిని, శుండను, సర్వవల్లభన్
    మతినిఁ దలంచి కోరఁ; బతి మానసమున్ గ్రహియించి, వేగమే
    హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్!

    రిప్లయితొలగించండి
  12. గతిచెడి వేశ్యవృత్తిఁ బడి గాదిలి నేస్తము రోగగ్రస్తయై
    మతిచెడి చిక్కియున్నది సుమా! యను వార్తను విన్న వెంటనే
    పతికది తెల్పి వారలట వైద్యులు గావున సేవలందునన్
    హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్

    రిప్లయితొలగించండి
  13. అతివల మేలుగోరుతు సహాయము సేయు సమాజ సేవకున్
    పతిగను పొందినట్టి సతి భర్తకు సాయము నందజేయుచున్
    పతితల జీవితమ్మున సువర్ణ పథమ్ము నొసంగమంచు తా
    హితముగనంగ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్యచెంతకున్

    రిప్లయితొలగించండి
  14. శ్రీ ఊకదంపుడు రామక్రిష్ణ గారికి నమస్సులు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    సతి సుతులందరిన్ విడిచి సర్వము నా వెలయాలె యంచనన్
    పతితు లెయిడ్సు పీడితులు పల్విధ రోగులు వైద్య శాలలన్
    బ్రతుకక చావలేక పడు పాట్లను జూపుచు మారు నాశతో
    హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్.

    రిప్లయితొలగించండి
  16. పతితు డు నైన భర్తను గభాలు నజూచి వైద్యు యొ ద్దకు
    న్హి తము గనంగ బ్రాణ విభు నింతియె పంపెను, వేశ్య చెంతకు
    న్స తతము బోవ నెంచుట నసభ్యము గాదలంచు మామది
    న్వి తరణ శీ లియై మిగుల వైభవముం ద నరం గా నుండుమా

    రిప్లయితొలగించండి
  17. బ్రతుకును బంచుకొన్న సతి బాధ్యతగా గుడి పూజ లెంచుమా
    హితము గనంగ బ్రాణ విభు నింతియె పంపెను|”వేశ్య చెంతకున్
    సతతము వెళ్ళబోకు,మనసైన విచారమునందు భక్తిచే
    శ్రుతిలయరాగము న్ బలుక?సూక్ష్మత లబ్బును దైవపూజతో”.
    2.పతి పరమాత్ముడే యనెడి భావన గల్గిన భక్తిచేత స
    మ్మతియగు భర్త సేవకు సమానము నేదియులేడటంచునే
    సతి,పతిధర్మమున్ విడక సాగెడిపీడ వినాశ నంబుకే
    హితము గనంగ బ్రాణ విభు నింతియె పంపెను వేశ్య చెంతకున్

    రిప్లయితొలగించండి
  18. భృతి యిసుమంత గైకొనక ప్రేమను పంచుచు సర్వ సౌఖ్యముల్
    సుతులను ఇచ్చు భార్యయ, మజూరిని చేకొని అంగ భంగిమల్,
    కృతకపు ప్రేమ తోడ తన క్రీడను జూపిన సానియా, యనన్,
    హితము గనంగ ప్రాణ విభు నింతియె బంపెను వేశ్య చెంతకున్

    రిప్లయితొలగించండి
  19. గురుమూర్తి ఆచార్య్ :: అభినందనలు

    రిప్లయితొలగించండి
  20. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజంతా ప్రయాణంలో ఉండి మీ పూరణలపై వెంటవెంటనే స్పందించలేకపోయాను. రేపు, ఎల్లుండి కూడా ప్రయాణాలు చేయవలసి ఉన్నది. సమస్యలను షెడ్యూల్ చేసాను.
    *****
    వల్లూరు మురళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మద్యపానమున మత్తిలి యింటిని గానలేక...’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘విలేఖరిన్’ అంటే బాగుంటుందేమో?
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    ఊకదంపుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    ఈ సమస్యను ఇస్తున్నపుడే నా మనస్సులో సుమతి కథ మెదిలింది. దీనిని ఎవరు ప్రస్తావిస్తారా అని ఎదురుచూసాను. ఆ పని మీరు చేసారు.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి, మూడవ పాదాలలో గణదోషం. ‘గభాలున జూచియు..., నసభ్యముగా దలపోయు...’ అనండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సుతులను ఇచ్చు’ అని విసంధిగా వ్రాసారు. ‘సుతుల నొసంగు..’ అనండి.
    *****
    గురుమూర్తి గారూ,
    మీ సమస్య పరిష్కారమయిందా? ఈ వ్యాఖ్య ఫోన్ ద్వారానే పంపారా?

    రిప్లయితొలగించండి
  21. సతతము వేశ్యవాటికలె స్వర్గమని తలంచు చుండగా
    నతులిత భక్తితోడుతను హాసముచేయుచు నిశ్చలమ్ముగా
    హితము గనంబ్రాణవిభు నింతియె పంపె వేశ్య చంతకున్
    సతిసుమతీ లలామఁగనిస్వర్గమునుండి సురల్ స్థుతించెడిన్

    రిప్లయితొలగించండి
  22. సతి గురజాడ వారిదగు సంస్తవ నాటక సూత్రధారిగా
    సతమత మౌచు పాత్రలకు సన్నుతి నిచ్చెడి రీతి గోరుచున్
    నతులిడి మెప్పు నొందెడిది నాయిక పాత్రకు ప్రీతి వంతమౌ
    హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్

    రిప్లయితొలగించండి
  23. అతివయె శ్లాఘ మొందగను హైరన నిచ్చుచు బాపనోడికిన్
    మతిచెడి మాడెలౌచునహ మంచివి దుస్తులు వాడుటందునన్
    కుతిగొని శ్రావణమ్మునను కుండలు పోతను వర్షమందునన్
    హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్

    మాడెలు = model

    రిప్లయితొలగించండి