19, ఆగస్టు 2015, బుధవారం

పద్య రచన - 984

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

 1. నిధులను బంపెను ప్రభుతయె
  విధిగా సామాన్యులకును ప్రీతిగ, దాటన్
  అధికార గణము హత విధి !
  వ్యధలే మిగిలేను చివర వారికి గనరే !

  రిప్లయితొలగించండి
 2. శ్రీగురుభ్యోనమ:

  కరగి కరగి కరగి కడదాక చేరగా
  కాసు మిగలదాయె కార్మికునకు
  వెన్ను విరిగిపోయె పన్ను భారంబాయె
  నాడు కొనెడు ప్రభుత యాదు కొనునె?

  రిప్లయితొలగించండి
 3. దోసపు నిర్వహణ క్రమము
  వాసిగ మొదలిడు ప్రభుత్వ పథకములందున్
  దోసిట జారు జలమ్మై
  చేసెడు పని దారిఁ దప్పి సిరి వ్యర్థమగున్!

  రిప్లయితొలగించండి
 4. ప్రభుత యిచ్చును నిధులను బ్రజల కొఱకు
  నంచె నంచెలు గాగను ,నదియ వచ్చు
  బడుగు ప్రజలకు పిసరంత భాగముగను
  గొల్ల కొట్టుదు రధి కారు లెల్ల నిధిని

  రిప్లయితొలగించండి
 5. ఆ.వె: అడుగు స్థాయి యైన అత్యున్నతులకైన
  తప్పదింక నీటి బాధ యిలను
  ఎంత వారికైన చింతలు తప్పవు
  నీరు లేక మనిషి నిలువ లేడు.

  రిప్లయితొలగించండి

 6. శ్రీగురుభ్యోనమ:

  దప్పి గొన్నవాని దరి జేరు వేళకు
  బొట్టు రాలదాయె పట్టుకొనగ
  బావి త్రవ్వువాడు పాతాళమున నుండె
  ఫలిత మందువాడు పైన నుండె.

  రిప్లయితొలగించండి
 7. దోసపు నిర్వహణమ్మున
  వాసిగ మొదలిడు ప్రభుత్వ పథకంపు సిరుల్
  దోసిట జారు జలమ్మై
  చేసెడు పని దారిఁ దప్పి సేమము క్షయమౌ!

  రిప్లయితొలగించండి
 8. నిధుల రాకను జూడుమా నీరజాక్షి !
  ప్రభుత నుండి యమాత్యుల వారి కచట
  నుండి యధ్యక్షు నకునట నుండి యాక
  మీ షన రువారి కటనుండి ,మిగులు సొమ్ము
  బడుగు ప్రజలకు గోరంత వచ్చు నమ్మ !

  రిప్లయితొలగించండి
 9. ప్రభుత యిచ్చు నిధులు ప్రజలకుజేరంగ
  మాయ మగును గాదె మధ్యలోన
  పంచు కొనగ దాని నంచెలంచెలుగాను
  బడుగువారినోట పడును బొట్టు!!!

  రిప్లయితొలగించండి
 10. నీటి కొరకు జనులు నీలుగు చుండగా
  ప్రభుతయిచ్చినట్టి ప్రజల సొమ్ము
  మధ్యవారిజేరి మటుమాయమైపోవు
  చుక్కనీరు ప్రజకు చిక్కదాయె

  రిప్లయితొలగించండి
 11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘మిగిలేను’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘మిగులునట’ అనండి.
  *****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. కోట్ల నిధుల తోడ క్రొంగొత్త పథకాలు
  ప్రభుత తెచ్చునంట ప్రజల కొరకు
  పందికొక్కు లెన్నొ ఫలహారమును జేయ
  ప్రజల కంద బోవు ఫలము సున్న

  రిప్లయితొలగించండి
 13. కోట్ల నిధుల తోడ క్రొంగొత్త పథకాలు
  ప్రభుత తెచ్చునంట ప్రజల కొరకు
  పందికొక్కు లెన్నొ ఫలహారమును జేయ
  ప్రజల కంద బోవు ఫలము సున్న

  రిప్లయితొలగించండి
 14. శంకరయ్య గారూ నమస్తే ! 984 చిత్రానికి నా పద్య రచన 19 ఆగష్టు 2015

  ఇచ్ఛు వాని యొద్ద ఈనివాడుండిన సుబ్బ సహదేవుడు గారూ నమస్తే! శంకరయ్య గారి బ్లాగులో  నేను ఆలస్యంగా చేరాను. 7396564549 నా సెల్లుకు ఫోన్ చేయండి.

  ప్రభువు లిచ్చు నిధులు పాలితులకు కలుసుకుందాము. మీరు నన్ను చూచామన్నారు .సంతోషం .
  ఎట్లు చేర గలవు పాట్లు మిగులుగాని?

  కలియుగం బిదియని తెలిసికొనరె!

  విద్వాన్' డాక్టర్ మూలేరామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు.

  రిప్లయితొలగించండి