9, ఆగస్టు 2015, ఆదివారం

పద్య రచన - 979

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. చారెడు కన్నుల చిన్నది
    బారెడు జడముందు కేసి భంగిమ లిడగన్
    కూరిమి నాట్యము నందున
    నోరగ చూపుల నువిసరి నృత్యము జేయన్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    చివరిపాదంలో యతి తప్పింది. ‘ఓరగ చూపులను విసరె నొక నృత్యమునన్’ అందామా?

    రిప్లయితొలగించండి
  3. చిలిపి చూపు విసురు చిన్నారి ఓ తల్లి
    అచ్చ తెనుగుదనపు యందమంత
    సొంతమాయె నీకు సుకుమారి సిరిమల్లి
    దొంగ వీవు యెదలు దోచు నట్టి

    రిప్లయితొలగించండి
  4. పెద్ద పెద్దగ గన్నులు ముద్దు గొలుప
    చేయు చుండెను నాట్యము చిన్న పిల్ల
    యెంత జక్కగ నున్నదో యంత చిలిపి
    దనము తోడన నొప్పెను దన్వి ! చూడు

    రిప్లయితొలగించండి
  5. ఆ.వె: ఓర చూపుతోడ కోరచూపు గలిపి
    లేత వయసు న,నవ లీలగాను
    బాల నాట్యమాడు భంగిమ గాంచిన
    ముదము తోడ మదికి ముచ్చటౌను.

    రిప్లయితొలగించండి
  6. కళ్లింతలుజేసి వగల
    త్రుల్లింతల నాట్యమాడు తుంటరి కొమ్మా!
    ఝల్లుమనే గుండేదో
    గల్లుమనెడు మువ్వల సడిఁ గలిసే నమ్మా!

    రిప్లయితొలగించండి
  7. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. పట్టు పావడ గట్టెచక్కగ పాల బుగ్గల పాపయే
    బెట్టె పాపిట బిళ్ళ కొప్పున ప్రీతిగా తను వేడ్కతో
    చిట్టి జేతుల నృత్య భంగిమ శ్రీకరమ్ముగ నొప్పుగా
    బుట్ట బొమ్మగ నుండె నవ్వుచు బొట్టి జూడగ ముద్దుగన్!!!

    రిప్లయితొలగించండి
  9. చిన్నారి చిరునవ్వు ,కన్నమువేసియు
    -----ముక్కున ముక్కెర?ముద్దుగూర్చె|
    వాల్జడ సొగసుకు వన్నెగూర్చగ నెంచి
    ------పసిడి తీగలు తల ముసిరి జూసె|
    చీరగట్టగబేల?జారక బిగబట్టె
    -----వడ్డాణ మిచ్చట వన్నెగూర్చె|
    పాపిడి బిళ్ళయే పక్కున నవ్వగ?
    -----వారచూపులకాంతి వడిసి బట్టె|
    ముద్దు మోమున సొగసులే హద్దుమీర?
    చేతిగాజులు చూపులో జేరియుండ?
    నాట్య భంగిమ లందున నాటియున్న
    కంటి చూపిట?వింటిలా కానుపించె|
    2.వయసున చిన్న దైన పరివారము మెచ్చెడి నాట్య భంగిమన్
    మయసభ మంత్ర దండముల మర్మము లట్లుగ చేతులుంచి|యే
    భయమును లేక |వాల్జడన ప్రాకినయందము కంటి చూపులో
    నియమము లన్ని నింపితివి|నీకిట సాటియు లేరు బాలికా|

    రిప్లయితొలగించండి
  10. పట్టుబట్టలు ధరియించి చిట్టితల్లి
    పద్మముల బోలు కనుల విప్పారఁజేసి
    నాట్య భంగిమఁ జూపించె నలుగురెదుట
    దృష్టి దోషము గలవారి దృక్కు మార్చ
    చక్కనమ్మకుఁబెట్టుడు చుక్కబొట్టు

    రిప్లయితొలగించండి
  11. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    రెండవపాదం ప్రారంభంలో సరళాదేశం అవసరం లేదు. ‘పెట్టెఁ బాపిటబిళ్ళ...’ అనండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి